Instagram Blend : వావ్.. ఇన్‌స్టాగ్రామ్ ‘బ్లెండ్’ ఫీచర్ భలే ఉందిగా.. రీల్స్ ఫీడ్‌ను మీ ఫ్రెండ్స్‌తో ఈజీగా షేర్ చేయొచ్చు..!
Instagram Blend : ఇన్‌స్టాగ్రామ్ DM ద్వారా షేర్ చేసిన ఏదైనా రీల్ బ్లెండ్ ఫీడ్‌లో ఆటోమాటిక్‌గా అప్‌డేట్ అవుతుంది. రీల్స్ చూస్తున్నప్పుడు మెసేజ్ బార్ నుంచి చాట్ చేయవచ్చు లేదా ఎమోజీలతో నేరుగా రియాక్ట్ అవ్వొచ్చు.

Instagram launches Blend
Instagram Blend : ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్.. మెటా సొంత ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ బ్లెండ్ అనే కొత్త ఫీచర్‌ను ఆవిష్కరించింది. మీకు మీ స్నేహితుడికి లేదా గ్రూప్ చాట్‌కు ప్రత్యేకంగా షేర్ చేసుకునే రీల్స్ ఫీడ్‌ను అందిస్తుంది. బ్లెండ్ ఫీచర్ ఇన్వైట్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేయగలరు.
ప్రతిరోజూ లేటెస్ట్, పర్సనలైజడ్ వీడియోల ఆప్షన్ అందిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులకు ఆసక్తికరమైన ఫీచర్ ‘బ్లెండ్’ను క్రమంగా రిలీజ్ చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు ఇప్పుడు వారి స్నేహితులతో ప్రైవేట్, కస్టమైజడ్ రీల్స్ ఫీడ్‌ను షేర్ చేయొచ్చు.
బ్లెండ్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది? :
ఈ ఫీచర్ డైరెక్ట్ మెసేజ్‌ల (DM) మాదిరిగానే ప్రైవేట్ అని ఇన్‌స్టాగ్రామ్ చెబుతోంది. వినియోగదారులు తమ స్నేహితుల్లో ఎవరినైనా ‘బ్లెండ్’కు ఇన్వైట్ చేయొచ్చు. మీ స్నేహితుడు ఈ ఇన్విటేషన్ అంగీకరించిన వెంటనే ఇన్‌స్టాగ్రామ్ అల్గోరిథం మీ ఇద్దరికీ ప్రత్యేక రీల్స్‌ను సూచిస్తుంది. ఈ సూచనలు పూర్తిగా పర్సనలైజ్ అవుతాయి. మీ స్నేహితుడి ఇన్‌స్టాగ్రామ్ యాక్టివిటీ ఆధారంగా రీల్స్ లిస్టును రెడీ చేస్తుంది.
బ్లెండ్ ఇన్వైట్-ఓన్లీ ఫీచర్ :
ఇన్‌స్టాగ్రామ్ ఈ ‘బ్లెండ్’ ఫీచర్ ఇన్వైట్-ఓన్లీ ఫీచర్. మీరు ఇందులో జాయిన్ అవ్వాలంటే మీ స్నేహితుడి నుంచి ఇన్విటేషన్ పంపాలి లేదా స్వీకరించాలి. ఇద్దరు యూజర్లు బ్లెండ్‌లో జాయిన్ అయిన వెంటనే, DM ద్వారా షేర్ చేసిన ఏదైనా రీల్ బ్లెండ్ ఫీడ్‌లో ఆటోమాటిక్‌గా అప్‌డేట్ అవుతుంది.
బ్లెండ్‌లోని ప్రతి రీల్‌తో పాటు రీల్ ఎవరికి కనిపించాలో వారి పేరు కూడా ఉంటుంది. వినియోగదారులు రీల్స్ చూస్తున్నప్పుడు దిగువన ఉన్న మెసేజ్ బార్ నుంచి చాట్ చేయవచ్చు లేదా ఎమోజీలతో నేరుగా రెస్పాండ్ అవ్వొచ్చు.
DMలో బ్లెండ్ ఐకాన్ చూడొచ్చు :
మీరు బ్లెండ్ ఫీచర్ యాక్సస్ చేయగానే మీ చాట్ విండోలో ఆడియో కాల్, వీడియో కాల్ బటన్స్ పక్కన స్పెషల్ బ్లెండ్ ఐకాన్ చూడొచ్చు. మీరు ఈ బ్లెండ్ నుంచి ఎప్పుడైనా నిష్క్రమించవచ్చు.
Read Also : iPhone 16e Sale : ఐఫోన్ ప్రియులకు పండగే.. అమెజాన్‌లో అతి తక్కువ ధరకే ఐఫోన్ 16e కొనేసుకోండి.. డోంట్ మిస్!
ఐప్యాడ్‌లో ఇన్‌స్టాగ్రామ్ యాప్ :
ఇటీవలి నివేదిక ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్ ఐప్యాడ్ కోసం ప్రత్యేకంగా యాప్‌ను డెవలప్ చేస్తోంది. టాబ్లెట్‌ల కోసం రూపొందించిన వెర్షన్‌పై టెస్టింగ్ జరుగుతోందని వెల్లడించారు. ప్రస్తుతం ఐప్యాడ్స్, ఐఫోన్ యాప్ రన్ అవుతాయి. కానీ, బిగ్ డిస్‌ప్లే కోసం ఇంటర్‌ఫేస్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ సరైనది కాదు. ప్రస్తుతం, ఐప్యాడ్ యాప్ గురించి సమాచారం పరిమితంగా ఉంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దానిపై అధికారిక ప్రకటన లేదు.