Tata Nano Electric Car : టాటా నానో ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది.. సింగిల్ ఛార్జ్‌తో 700 కి.మీ రేంజ్.. ఫీచర్లు ఇవేనా? ధర ఎంత ఉండొచ్చుంటే?
Tata Nano Electric Car : రాబోయే టాటా నానో ఎలక్ట్రిక్ కారు గురించి సోషల్ మీడియాలో పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి, టాటా కంపెనీ నుంచి ఈ కారు విడుదలపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కేవలం ఊహాగానాలు మాత్రమే..

Tata Nano Electric Car ( Image Credit : Google/ Represent Image)
Tata Nano Electric Car : ప్రస్తుత రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ప్రతిఒక్కరూ మార్కెట్లోకి ఏదైనా కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ రాగానే కొనేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రత్యేకించి టాటా నానో ఎలక్ట్రిక్ కారు ఎప్పుడు వస్తుందా? అని అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నానో ఈవీ కారు త్వరలో ఎలక్ట్రిక్ అవతార్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో తెగ రుమర్లు వస్తున్నాయి. ఈ నానా ఎలక్ట్రిక్ కారుకు సంబంధించి ఎలాంటి విషయం తెలిసినా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ కారు కస్టమర్లను అంతగా ఆకర్షించడానికి అందులోని ఫీచర్లు కావొచ్చు. రాబోయే టాటా నానో ఈవీ కారులో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్లు ఉండొచ్చునని భావిస్తున్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. టాటా నానో ఎలక్ట్రిక్ కారు మార్చి 2026 నాటికి మార్కెట్లోకి విడుదల కానుందని భావిస్తున్నారు. ఈ రేంజ్ కూడా వినియోగదారులను మరింత ఆకట్టుకునే అవకాశం ఉంది టాటా నానో ఎలక్ట్రిక్ అవతార్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ కారుకు సంబంధించి అన్ని వివరాలు ఊహాగానాలు మాత్రమేనని గమనించాలి.
నానో ఎలక్ట్రిక్ కారు రేంజ్, ఫీచర్లు? :
భారత మార్కెట్లో టాటా నానో ఎలక్ట్రిక్ కారు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రాబోయే ఈ నానో ఎలక్ట్రిక్ కారులో కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు ఉండొచ్చు. నానో ఈవీ కారు రేంజ్ 0 నుంచి 100 మధ్య ఉంటుందని అంచనా. టాప్ స్పీడ్ గంటకు 110 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో కూడిన 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండవచ్చు. 19kWh బ్యాటరీ దాదాపు 250 కి.మీ వరకు దూసుకెళ్లే సామర్థ్యం ఉంటుంది. సింగిల్ ఛార్జ్‌తో 700 కిలోమీటర్ల దూరం వెళ్లగలదని అంచనా.
అంతేకాదు.. బ్లూటూత్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఉండొచ్చు. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, యాంటీ-రోల్ బార్‌లు వంటి ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది. ఇందులో AC కూడా ఉండొచ్చు. సోషల్ మీడియాలో పుకార్ల ప్రకారం.. ప్రస్తుతానికి నానో ఎలక్ట్రిక్ కారు ఇంకా తయారీ దశలోనే ఉంది.
ధర ఎంతంటే? (అంచనా) :
టాటా నానో ఎలక్ట్రిక్ కారు ధర మార్కెట్‌లో సామాన్యుల బడ్జెట్‌లోనే ఉంటుందని భావిస్తున్నారు. నానో ఎలక్ట్రిక్ కారు ధర దాదాపు రూ. 3లక్షల రూ. 5 లక్షలు ఉండే అవకాశం ఉంది. లుక్, డిజైన్ యువతకు మరింత ఆకర్షించే విధంగా ఉండవచ్చు.
Note : ఈ టాటా నానో ఎలక్ట్రిక్ కారుపై కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కేవలం ఈ నానో కారు గురించి వస్తున్న పుకార్లపై సమాచారం ఆధారంగా మాత్రమే ఈ స్టోరీ అందించామని గమనించాలి.