iPhone 13: ఐఫోన్ లవర్స్‌కు కీలక అప్‌డేట్.. రిలీజ్ డేట్ అనౌన్స్‌డ్
ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్. ఎట్టకేలకు ఐఫోన్ 13 మోడల్ రిలీజ్ డేట్ వచ్చేసింది. సెప్టెంబర్ 14న కాలిఫోర్నియా వేదికగా విడుదల చేయనున్నట్లు టెక్ దిగ్గజం యాపిల్ ప్రకటించింది.

I Phone 13
iPhone 13: ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్. ఎట్టకేలకు ఐఫోన్ 13 మోడల్ రిలీజ్ డేట్ వచ్చేసింది. సెప్టెంబర్ 14న కాలిఫోర్నియా వేదికగా విడుదల చేయనున్నట్లు టెక్ దిగ్గజం యాపిల్ ప్రకటించింది. ఈ సందర్భంగా నాలుగు కొత్త ఐఫోన్ మోడళ్లు – ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్‌లను కంపెనీ విడుదల చేసే అవకాశం ఉంది. ఐఫోన్ 13 మోడల్ తో పాటు దాని ధరలు, ఫీచర్లను వెల్లడించింది.
యాపిల్ వాచీ సిరీస్ 7, కొత్త యాపిల్ ఎయిర్‌పాడ్స్ 3 వంటి ఉపకరణాలను సైతం విడుదల చేయొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంటర్నేషనల్‌గా విడుదల చేసిన తర్వాత భారత్‌లో ఐఫోన్ 13 ధరలను యాపిల్ ప్రకటించొచ్చు. దేశీయంగా అక్టోబరులో అమ్మకాలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సుమారుగా ధరలు ఎలా ఉంటాయా అనేదానిపై వివరాలిలా ఉన్నాయి.
– iPhone 13 Pro $999 (అంటే రూ. 73వేల 300వరకూ ఉండొచ్చు.)
– iPhone 13 Pro Max variant $1,099 (అంటే రూ.80వేల 679వరకూ ఉండొచ్చు).
– iPhone 13 Mini smartphone $699 (అంటే Rs రూ.51వేల 314వరకూ ఉండొచ్చు).
ఐఫోన్ 13సిరీస్ మోస్ట్ పవర్‌ఫుల్ స్మార్ట్ ఫోన్ గా నిలవనుంది. ఐఫోన్ 13ప్రో మ్యాక్స్ 6.7అంగుళాల ఓఎల్ఈడీ 120Hz డిస్ ప్లేతో లాంచ్ కానుండగా ఐఫోన్ 13.. 6.1 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది.