iPhone 14 Home Delivery In India : ఐఫోన్ 14 సిరీస్ కొనేందుకు చూస్తున్నారా..? ఇలా ఆర్డర్ చేస్తే.. కేవలం 30 నిమిషాల్లోపే హోం డెలివరీ.. అదేలా అంటారా?!
iPhone 14 Home Delivery In India : సరికొత్త ఐఫోన్ 14 సిరీస్ సొంతం చేసుకునేవరకు ఆగలేకపోతున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్.. మీరు కొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేయాలంటే ఎక్కువ గంటలు వేచి ఉండాల్సిన అవసరం లేదు. అంతేకాదు... మీరు క్యూలలో కూడా నిలబడాల్సిన పనిలేదు.

iPhone 14 can now be delivered to you in less than 30 minutes, here is how
iPhone 14 Home Delivery In India : ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్ (Apple iPhone 14 Series) గ్లోబల్ మార్కెట్లోకి వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ 14 సిరీస్ మోడల్స్ సేల్ (iPhone 14 Series Sale)కు అందుబాటులో ఉన్నాయి. భారత్ సహా కొన్ని దేశాల్లో ఐఫోన్ 14 సిరీస్ చాలా ఖరీదైనదిగా చెప్పవచ్చు అమెరికాతో పాటు కెనడా, జపాన్ ఇతర దేశాల్లో చాలా తక్కువ ధరకే ఐఫోన్ 14 సిరీస్ అందుబాటులో ఉంది. ఆపిల్ లవర్స్ చాలామంది ఐఫోన్ 14 సిరీస్ సొంతం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తన్నారు.
సరికొత్త ఐఫోన్ సొంతం చేసుకునేంతవరకు ఆగలేకపోతున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్.. మీరు కొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేయాలంటే ఎక్కువ గంటలు వేచి ఉండాల్సిన అవసరం లేదు. అంతేకాదు… మీరు క్యూలలో కూడా నిలబడాల్సిన పనిలేదు. ఎందుకంటే Zomato సబ్-బ్రాండ్ Blinkit కంపెనీ మీ iPhone 14ని సమయానికి డెలివరీ చేయనుంది.

iPhone 14 can now be delivered to you in less than 30 minutes, here is how
గతంలో Apple సేల్ పార్టనర్ Unicornతో భాగస్వామ్యం కలిగి ఉంది. దేశంలో Unicorn అందించే ఈ సర్వీసులు ఇప్పుడు ఢిల్లీ ముంబైలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్లో రిటైల్, నిత్యావసరాలను ఆర్డర్ చేసేందుకు Blinkit వినియోగిస్తున్నారు. ఐఫోన్ కొనుగోలు చేసే యూజర్ అడ్రస్ పరిధిలో ఐఫోన్ సంబంధిత స్టోర్ ఉంటే ఆర్డర్ చేసిన 30 నిమిషాల్లోపే యూజర్‌కు డెలివరీ అవుతుందని కంపెనీ పేర్కొంది. ఐఫోన్ 14 (iphone 14), ఐఫోన్ 14 ప్రో (iphone 14 pro) ఇప్పుడు యూజర్లకు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఐఫోన్లు అన్ని Apple అధికారిక రిటైల్ షాపులతో పాటు Apple ఆన్లైన్ స్టోర్‌లోనూ అందుబాటులో ఉన్నాయి.

iPhone 14 can now be delivered to you in less than 30 minutes, here is how
Blinkit వ్యవస్థాపకుడు, అల్బిందర్ ధిండ్సా (Albinder Dhindsa) వినియోగదారులకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు. కేవలం నిమిషాల్లోనే Apple iPhone, అప్లయన్సెస్ Blinkit కస్టమర్లకు అందించేందుకు @UnicornAPRతో భాగస్వామ్యం చేసినట్టు తెలిపారు. ప్రస్తుతానికి దేశ రాజధాని ఢిల్లీ, ముంబైలలో అందుబాటులో ఉంది. ఇతర నగరాల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయా లేదా అనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. మీరు ఐఫోన్ 14 సిరీస్‌ని Blinkit నుంచి ఆర్డర్ చేయాలనుకుంటే..
మీ వద్ద ఇప్పటికే ఫోన్ లేకపోతే.. మీరు ముందుగా Blinkit Appను గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store), యాపిల్ యాప్ స్టోర్ (Apple App Store) నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఐఫోన్ 14 (iPhone 14 Price) ధర 128GB రూ.79,900, 256GB వేరియంట్ ధర రూ.89,900, 512GB ధర రూ.1,09,900గా నిర్ణయించింది.
మరోవైపు iPhone 14 Pro ధర రూ. 1,29,900 (128GB), రూ. 1,39,900 (256GB), రూ. 1,59,900 (512GB), రూ. 1,79,900 (1TB)గా ఉంది. మీరు అధికారిక Apple స్టోర్ నుంచి iPhone 14 సిరీస్‌ను కొనుగోలు చేస్తే.. మీరు HDFC క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 6000 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డిస్కౌంట్ తర్వాత ఐఫోన్ 14 సిరీస్ ధర బేస్ వేరియంట్ రూ.73,900కి తగ్గుతుంది.