iPhone 16 Discount Offer : ఐఫోన్ 16 సేల్ మొదలైందోచ్.. మీ దగ్గర ఐఫోన్ 13 ఉంటే.. రూ. 26వేలు తగ్గింపు.. డోంట్ మిస్!
iPhone 16 Discount Offer : భారత మార్కెట్లో ఐఫోన్ 16 అమ్మకానికి ఉంది. ఐఫోన్ 13 యజమానులు రూ. 26,000 తగ్గింపు ఆఫర్‌తో కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 16 అసలు ధర రూ. 79,900కి విక్రయిస్తోంది.

iPhone 16 goes on sale in India, iPhone 13 owners can buy it with Rs 26k discount offer
iPhone 16 Discount Offer : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో ఐఫోన్ 16 సేల్ మొదలైంది.. ఆసక్తి గల కొనుగోలుదారులు ఐఫోన్ 16 కొనుగోలుపై ఏకంగా రూ. 26వేల వరకు తగ్గింపు ఆఫర్ పొందవచ్చు. ఐఫోన్ 16 ధర తగ్గింపుతో రూ. 79,999కి అందుబాటులో ఉంది.
ఈ కొత్త ఐఫోన్‌ల గురించి చాలా మంది ఉత్సాహంగా ఉండగా, ఐఫోన్ 13 వంటి పాత ఫోన్ల నుంచి కొత్త ఐఫోన్ 16కి అప్‌గ్రేడ్ చేయాలా వద్దా అనే విషయంలో కూడా కొందరు అయోమయంలో ఉన్నారు. ఐఫోన్ 16 కావాలనుకునే వినియోగదారులు తమ పాత ఐఫోన్ 13పై భారీ తగ్గింపుతో పొందవచ్చు.
Read Also : iphone 16 : పది నిమిషాల్లో మీ చెంతకు ఐఫోన్ -16 సిరీస్ ఫోన్లు.. ఎలా అంటే..?
భారత మార్కెట్లో ఐఫోన్ 16 అమ్మకానికి ఉంది. ఐఫోన్ 13 యజమానులు రూ. 26,000 తగ్గింపు ఆఫర్‌తో కొనుగోలు చేయవచ్చు. ఇతర అధికారిక ప్లాట్‌ఫారమ్‌ల మాదిరిగానే, ఇండియా ఐస్టోర్ ఐఫోన్ 16 అసలు ధర రూ. 79,900కి విక్రయిస్తోంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా, ఈ ఐఫోన్ రూ. 5వేల తగ్గింపు ఆఫర్‌తో లభిస్తుంది. ఇది ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐ కార్డ్‌పై వ్యాలిడిటీ అవుతుంది. దీంతో ఐఫోన్ 16 ధర రూ.74,900కి తగ్గనుంది. అంతేకాదు.. ఎక్స్ఛేంజ్ బోనస్‌పై రూ. 20వేలు, రూ. 6వేల వరకు రెగ్యులర్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందిస్తుంది.
ఐఫోన్ 13పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ :
ఐఫోన్ 13 (128జీబీ) కలిగి ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది. కంపెనీ షేర్ చేసిన వివరాల ప్రకారం.. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ధర రూ.48,900కి తగ్గుతుంది. ఈ సైట్ అందించే మొత్తం ఎక్స్ఛేంజ్ ఆఫర్ డిస్కౌంట్ రూ. 26వేలు మాత్రమే. అయితే, సైట్ ప్రకారం.. ఈ డిస్కౌంట్ ఆఫర్‌ను పొందాలంటే.. మీ ఐఫోన్ 13 కూడా మంచి వర్కింగ్ కండిషన్‌లో ఉండాలని గుర్తుంచుకోండి. భారత అధికారిక ఆపిల్ స్టోర్‌లో లేటెస్ట్ ఐఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఇప్పుడు, ఐఫోన్ 13 కన్నా ఐఫోన్ 16ని కొనుగోలు చేయడమే బెటర్. ఎందుకంటే.. కొత్త ఐఫోన్ చాలా స్పీడ్. మెరుగైన కెమెరా సెటప్, ఆపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్, యాక్షన్ బటన్, కొత్త కెమెరా కంట్రోల్ బటన్, కొంచెం పెద్ద బ్యాటరీని అందిస్తుంది. ఈ అప్‌గ్రేడ్‌లు మీకు అవసరమని భావిస్తే.. ఐఫోన్ 16కి వెంటనే అప్‌గ్రేడ్ చేయవచ్చు. 128జీబీ స్టోరేజ్ మోడల్ ఐఫోన్ 16 ధర భారత మార్కెట్లో రూ.79,900గా నిర్ణయించింది. 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 89,900, 512జీబీ స్టోరేజ్ ధర రూ. 1,09,900కు అందుబాటులో ఉన్నాయి.