Apple iPhone 16 Sale : అమెజాన్‌లో ఐఫోన్ 16పై అదిరే డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Apple iPhone 16 Discount : ఫోటోగ్రఫీ ఔత్సాహికుల కోసం ఐఫోన్16 మోడల్ 48ఎంపీ ఫ్యూజన్ కెమెరాతో వస్తుంది. ఇందులో అప్‌గ్రేడ్ చేసిన 2ఎక్స్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. జూమ్ ఇన్ చేసేందుకు ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు.

iPhone 16 on sale on Amazon

Apple iPhone 16 Discount : మీరు ఐఫోన్ 16కి అప్‌గ్రేడ్ చేయాలని చూస్తున్నారా? అమెజాన్ ప్రస్తుతం ఈ పాపులర్ మోడల్‌పై ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. కొనుగోలుకు ఇదే సరైన సమయం. అమెజాన్ లేటెస్ట్ ఆఫర్‌లో భాగంగా ఐఫోన్ 16 రూ. 2వేల ధర తగ్గింపుతో అందుబాటులో ఉంది. అదనపు బ్యాంక్ డిస్కౌంట్లు అవసరం లేదు. వాస్తవానికి రూ. 79,900 ధర ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ప్లాట్‌ఫారమ్‌లో రూ. 77,900 వద్ద జాబితా అయింది.

ఇంకా ఎక్కువ డబ్బులు ఆదా చేయాలనుకునేవారికి అదనపు పెర్క్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు కొనుగోలకు ఎస్బీఐ లేదా ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. మీరు రూ. 5వేల అదనపు క్యాష్‌బ్యాక్‌ని అందుకుంటారు. తద్వారా ధర మరింత తగ్గుతుంది. అమెజాన్ ఎక్స్‌ఛేంజ్ ఆప్షన్‌ను కూడా అందిస్తుంది. కస్టమర్‌లు తమ పాత ఐఫోన్‌పై ట్రేడింగ్ చేస్తే.. కొత్త మోడల్‌పై రూ. 20వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఫోన్ కండిషన్, ఎక్స్‌ఛేంజ్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.

ఐఫోన్ 16 ప్రత్యేకతలివే :
ఐఫోన్ 16 యూజర్ ఎక్స్‌పీరియన్స్ పర్ఫార్మెన్స్, ఫొటోగ్రఫీ క్వాలిటీని అందిస్తుంది. ఆపిల్ ఐఫోన్ 16 కొత్త ఎ18 చిప్ కలిగి ఉంది. వేగవంతమైన పర్ఫార్మెన్స్, మెరుగైన శక్తి సామర్థ్యాన్ని అందిస్తుంది. పాత ఐఫోన్ మోడల్‌లతో పోలిస్తే.. సున్నితమైన గేమింగ్, మల్టీ టాస్కింగ్, మెరుగైన బ్యాటరీ లైఫ్ అందిస్తోంది. హై పర్ఫార్మెన్స్ యాప్‌లు లేదా గేమ్‌లను వాడేందుకు ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

ఫోటోగ్రఫీ ఔత్సాహికుల కోసం ఐఫోన్16 మోడల్ 48ఎంపీ ఫ్యూజన్ కెమెరాతో వస్తుంది. ఇందులో అప్‌గ్రేడ్ చేసిన 2ఎక్స్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. జూమ్ ఇన్ చేసేందుకు ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. అల్ట్రా వైడ్ కెమెరా షాట్‌లు, క్లోజ్-అప్ మాక్రో ఫొటోగ్రఫీకి అనువైనది. ఫొటో, వీడియో ఆప్షన్లకు అందిస్తోంది. కొత్త కెమెరా కంట్రోల్ ఫీచర్ యూజర్లకు ఫొటో సెట్టింగ్‌లపై అద్భుతమైన కంట్రోల్ అందిస్తుంది. 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్డ్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది.

స్ట్రీమింగ్, గేమింగ్, సాధారణ బ్రౌజింగ్ కోసం ఉపయోగించవచ్చు. డైనమిక్ ఐలాండ్ ఫీచర్ అందిస్తుంది. ఆపిల్ ఐఫోన్ 16 నీటి నిరోధక డస్ట్ ప్రూఫ్ డిజైన్‌తో వస్తుంది. బ్లాక్, వైట్, రోజ్, టీల్, అల్ట్రామెరైన్ అనే 5 కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఐఫోన్ 16లోని కొత్త యాక్షన్ బటన్ కెమెరా, ఫ్లాష్‌లైట్ వంటి ఫీచర్‌లను త్వరగా యాక్సెస్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది.

ఆపిల్ ఇంటెలిజెన్స్‌ ఇప్పుడు గతంలో కన్నా స్మార్ట్‌గా ఉంటుంది. యాప్‌లో సెర్చింగ్ ఆప్షన్ కూడా అందిస్తోంది. ఐఫోన్ 16పై రూ. 2వేల డిస్కౌంట్‌తో పాటు అదనపు క్యాష్‌బ్యాక్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లతో పొందవచ్చు. కెమెరా సిస్టమ్, మెరుగైన పర్ఫార్మెన్స్, వినూత్న ఫీచర్లతో ఐఫోన్ 16 కొత్త యూజర్లను ఆకట్టుకునేలా ఉంటుంది.

Read Also : iPhone Slow Charging : మీ ఐఫోన్ ఛార్జింగ్ స్లో అవుతుందా? స్పీడ్ ఛార్జ్ కోసం ఈ సింపుల్ టిప్స్ పాటించండి!