iPhone 16 Pre-order Sale : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఆపిల్ ఐఫోన్ 16 ప్రీ-ఆర్డర్ సేల్.. ఆఫర్లు, డీల్స్ మీకోసం..!

iPhone 16 Pre-order Sale : ఆపిల్ ఔత్సాహికులు తమ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ప్రీ-బుకింగ్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. అదే భారత మార్కెట్లో ఈరోజు సాయంత్రం 5:30 గంటల తర్వాత ఈ మోడల్‌లలో దేనినైనా ప్రీ-ఆర్డర్ చేయవచ్చు.

iPhone 16 Pre-order Sale : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఆపిల్ ఐఫోన్ 16 ప్రీ-ఆర్డర్ సేల్.. ఆఫర్లు, డీల్స్ మీకోసం..!

iPhone 16 pre-order sale to start today

Updated On : September 13, 2024 / 3:28 PM IST

iPhone 16 Pre-order Sale : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్‌ను ఆపిల్ ఇంటెలిజెన్స్, పవర్‌ఫుల్ ఎ18 చిప్‌సెట్‌తో ఆవిష్కరించింది. ఈ సిరీస్‌లో మొత్తం 4 ఫోన్లు ఉన్నాయి. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఉన్నాయి. ఆపిల్ ఔత్సాహికులు తమ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ప్రీ-బుకింగ్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. అదే భారత మార్కెట్లో ఈరోజు సాయంత్రం 5:30 గంటల తర్వాత ఈ మోడల్‌లలో దేనినైనా ప్రీ-ఆర్డర్ చేయవచ్చు. ఈ ప్రీ-ఆర్డర్ చేసిన ఐఫోన్‌లు సెప్టెంబర్ 20న డెలివరీ అవుతాయి.

Read Also : మీ క్రెడిట్, డెబిట్ కార్డు PIN ఇదేనా? హ్యాక్ చేస్తారు జాగ్రత్త.. సెక్యూరిటీ కోసం ఇవి తప్పక గుర్తుంచుకోండి!

కొత్త ఐఫోన్ 16 ప్రీ-బుక్ చేయడం ఎలా? :
ఐఫోన్ 16ని ప్రీ-బుక్ కోసం కస్టమర్‌లు ఆపిల్ స్టోర్, ఆపిల్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ లేదా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లు అలాగే వివిధ రిటైల్ అవుట్‌లెట్‌లను విజిట్ చేయొచ్చు. ప్రీ-బుకింగ్ దశను అనుసరించి ఐఫోన్ 16 సిరీస్ సెప్టెంబర్ 20 నుంచి ఆన్‌లైన్‌లో, స్టోర్‌లో కొనుగోలుకు అధికారికంగా అందుబాటులో ఉంటుంది.

ఐఫోన్ 16 సిరీస్ భారత్ ధర ఎంతంటే? :
ఐఫోన్ 16 స్టాండర్డ్ వేరియంట్ 128జీబీకి రూ.79,900 నుంచి ప్రారంభమవుతుంది. అన్ని మోడల్స్, వేరియంట్‌ల ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

* ఐఫోన్ 16 : రూ. 79,900 (128జీబీ); రూ. 89,900 (256జీబీ); రూ. 1,09,900 (512జీబీ)
* ఐఫోన్ 16 ప్లస్ : రూ. 89,900 (128జీబీ); రూ. 99,900 (256జీబీ); రూ. 1,11,900 (512జీబీ)
* ఐఫోన్ 16ప్రో : రూ. 1,19,900 (128జీబీ); రూ. 1,29,900 (256జీబీ); రూ. 1,49,900 (512జీబీ); రూ. 1,69,900 (1టీబీ)
* ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ : రూ. 1,44,900 (256జీబీ); రూ. 1,64,900 (512జీబీ); రూ. 1,84,900 (1టీబీ)

ఐఫోన్ 16 బ్యాంక్ ఆఫర్లు, డీల్స్ :
ఐఫోన్ 16 బేస్ మోడల్‌ లాంచ్ ధరలు ముందున్న ఐఫోన్ 15 సిరీస్‌కు సమానంగా ఉంటాయి. కానీ, ఐఫోన్ 16 ప్రో మోడల్స్ నిజానికి ఐఫోన్ 15 ప్రో మోడల్స్ కన్నా చౌకగా ఉంటాయి. పైగా, ఆపిల్ ఇటీవల లాంచ్ చేసిన సిరీస్‌పై కొన్ని బ్యాంక్ ఆఫర్‌లను కూడా అందిస్తోంది. ఆపిల్ ఇండియా వెబ్‌సైట్‌లో ఐఫోన్ 16ని ప్రీ-బుకింగ్ చేసే కస్టమర్‌లు అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లతో సహా ఇతర బ్యాంకుల క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లపై రివార్డింగ్ పేమెంట్ ఆప్షన్ ద్వారా రూ. 5వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

ఐఫోన్ 16 సిరీస్ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ : ఈ రెండు ఫోన్లలో ఐఫోన్ గుర్తుకు తెచ్చే రీవాంప్డ్ డిజైన్‌ను అందిస్తాయి. ఇందులో క్యాప్సూల్ ఆకారపు ఐలాండ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఐఫోన్ 16 మోడల్ 6.1-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఐఫోన్ 16 ప్లస్ పెద్ద 6.7-అంగుళాల స్క్రీన్‌ను అందిస్తుంది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ బ్లాక్, వైట్, గులాబీ, టీల్, అల్ట్రామెరైన్ మొత్తం ఐదు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి.

ఐఫోన్ 16 సిరీస్‌లోని అన్ని మోడల్‌లు అడ్వాన్స్‌డ్ ఎ18 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతాయి. మెరుగైన పర్ఫార్మెన్స్ సామర్థ్యం కోసం రెండో జనరేషన్ 3ఎన్ఎమ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ 48ఎంపీ ఫ్యూజన్ ప్రధాన కెమెరాతో వస్తాయి. 48ఎంపీ, 12ఎంపీ ఫొటోలను ఒక స్పష్టమైన 24ఎంపీ ఇమేజ్‌గా పనిచేస్తుంది. 2ఎక్స్ టెలిఫోటో జూమ్, ఎఫ్/1.6 ఎపర్చర్‌ను కలిగి ఉంటుంది.

ఐఫోన్ 16ప్రో, ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ :
ఈ రెండు మోడల్‌లు ఐఫోన్ 15 ప్రో మోడల్‌లకు సమానమైన డిజైన్‌ను కలిగి ఉన్నాయి. ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 15 ప్రో మాదిరిగానే డిజైన్‌ను కలిగి ఉన్నాయి. ఐఫోన్ ప్రో మోడల్ 6.3-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఐఫోన్ 16 ప్రో మాక్స్ భారీ 6.9-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. రెండు ప్రో మోడల్స్‌లో సన్నని ఎడ్జెస్, 120Hz ప్రోమోషన్ డిస్‌ప్లేలు ఉన్నాయి. ఐఫోన్ ప్రో మోడల్స్ బ్లాక్ టైటానియం, వైట్ టైటానియం, నేచురల్ టైటానియం, కొత్త డెజర్ట్ టైటానియం అనే 4 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి. ఐఫోన్ 16 ప్రో మోడల్స్ A18 ప్రో చిప్ ద్వారా పవర్ పొందుతాయి.

Read Also : iPhone 16 Series Launch : ఆపిల్ కొత్త ఐఫోన్ 16 సిరీస్ కావాలా? ఈ నెల 13 నుంచి ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు.. ధరల వివరాలివే..!