Apple iPhone Lost : మీ ఆపిల్ ఐఫోన్ పోగొట్టుకున్నారా? రాబోయే ఈ కొత్త అప్‌డేట్‌తో దొంగిలించిన డివైజ్ ఎవరూ అన్‌లాక్ చేయలేరు..!

Apple iPhone Lost : మీ ఐఫోన్ పోయిందా? అయితే ఇకపై ఆందోళన అక్కర్లేదు. ఎందుకంటే.. ఆపిల్ స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ అనే బ్రాండ్-న్యూ సేఫ్‌గార్డ్ ఫీచర్ తీసుకొస్తోంది. ఈ కొత్త ఫీచర్ ఐఓఎస్ 17.3 అప్‌డేట్‌తో రానుంది.

Apple iPhone Lost : మీ ఐఫోన్ పోగొట్టుకున్నారా? అయితే, ఇది చాలా బాధ కలిగించే విషయం. ఆపిల్ రాబోయే ఈ కొత్త అప్‌డేట్ ద్వారా దొంగలు దొంగిలించిన మీ ఐఫోన్‌ను అన్‌లాక్ చేయకుండా నివారిస్తుంది. ఈ కొత్త అప్‌డేట్‌తో ఆపిల్ దొంగలు మీ ఐఫోన్‌ని అన్‌లాక్ చేయలేరు. మార్క్ గుర్మాన్ ప్రకారం.. మీ డివైజ్ పాస్‌కోడ్‌ను దొంగలు గుర్తించకుండా ఉండేలా ఐఫోన్ డేటాను ప్రొటెక్ట్ చేసేందుకు ఆపిల్ ప్రొటెక్షన్ గేమ్‌ను మరింత వేగవంతం చేస్తోంది.

ఇందులో భాగంగానే కంపెనీ iOS 17.3 ప్రివ్యూను ఆవిష్కరించింది. ఇందులో స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ అనే బ్రాండ్-న్యూ సేఫ్‌గార్డ్ ఉంది. స్టోర్ చేసిన పాస్‌వర్డ్‌లు, ఆపిల్ ఐడీ సెట్టింగ్‌లు, పేమెంట్ వివరాలు, (Find My iPhone)ని నిలిపివేయడం వంటి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.

Read Also : Apple iPhone 14 Sale : ఆపిల్ ఐఫోన్ 14పై బిగ్ డిస్కౌంట్.. కేవలం రూ.24,999కే కొనుగోలు చేయొచ్చు.. డోంట్ మిస్!

ఫేస్ ఐడీ లేదా టచ్ ఐడీని యాక్సస్ చేయలేరు :
మీ ఐఫోన్ ముఖ్యమైన భాగాలను యాక్సెస్ చేసేందుకు ఫేస్ ఐడీ లేదా టచ్ ఐడీని ఉపయోగించడం ఈ అప్‌డేట్ తప్పనిసరి చేస్తుంది. తద్వారా మీ పాస్‌కోడ్‌ను ఉపయోగించే ఆప్షన్ ఇది తొలగిస్తుంది. అలాగే, యూజర్ డివైజ్ పాస్‌కోడ్‌ని తెలుసుకుని దొంగలు ఐఫోన్‌లలోని వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఒక దొంగ ఎవరైనా వారి పాస్‌కోడ్‌ను పబ్లిక్‌గా ఇన్‌పుట్ చేయడాన్ని గమనిస్తాడు. ఆపై ప్రైవేట్ సమాచారాన్ని యాక్సెస్ చేసేందుకు డివైజ్ స్వైప్ చేస్తాడు. ఈ కొత్త అప్‌డేట్ కీలకమైన ఐఫోన్ విభాగాలకు అవసరమైన ఫేస్ ఐడీ లేదా టచ్ ఐడీ ద్వారా యాక్సస్ అవ్వకుండా నిరోధించడం లక్ష్యంగా పెట్టుకుంది.

Apple new update unlock stolen iPhone

2024లో ఐఓఎస్ 17.3 అప్‌డేట్ :
దొంగలు మీ డేటాను డిలీట్ చేయడం, ఆ తర్వాత డివైజ్ విక్రయించడం కష్టతరం చేస్తుంది. ఆపిల్ వినియోగదారులందరికీ నిర్దిష్ట లాంచ్ తేదీని సెట్ చేయనప్పటికీ, వచ్చే ఏడాది ప్రారంభంలో iOS 17.3ని అందరికీ అందుబాటులో ఉంచాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. అయితే, స్టోలెన్ డివైజ్ ప్రొటెక్షన్ అదనపు భద్రతా చర్యగా పనిచేస్తుందని వారు గుర్తించారు. ప్రత్యేకించి ఒక దొంగ డివైజ్ దొంగిలించే ముందు వారి పాస్‌కోడ్‌ను ఎంటర్ చేసిన యూజర్ కు అలర్ట్ వెళ్తుంది. ఈ కొత్త అప్‌డేట్ ఒక గంట ఆలస్యాన్ని కూడా అందిస్తుంది.

సెన్సిటివ్ టాస్క్‌ల కోసం రెండవ ఫేస్ ఐడీ లేదా టచ్ ఐడీ స్కాన్ కోసం అడుగుతుంది. ఇందులో ఆపిల్ ఐడీ పాస్‌వర్డ్‌ను మార్చడం, స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్‌ను ఆఫ్ చేయడం, కొత్త పాస్‌కోడ్‌ను సెట్ చేయడం లేదా టచ్ ఐడీ లేదా ఫేస్ ఐడీ నిలిపివేయడం వంటివి ఉన్నాయి. అయినప్పటికీ, వినియోగదారులు ఇల్లు లేదా ఆఫీసు వంటి సుపరిచితమైన ప్రదేశాలలో ఉన్నప్పుడు ఆలస్యం జరగదని గమనించాలి. ఆపిల్ మీ ఐఫోన్ సురక్షితంగా ఉండేందుకు అదనపు సెక్యూరిటీ ఫీచర్ అందిస్తోంది. ఈ సౌండ్ ఫీచర్ అవాంఛిత యాక్సెస్‌ నుంచి అదనపు భద్రతను అందిస్తుంది.

Read Also : WhatsApp Channels : వాట్సాప్‌‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఛానెల్స్‌లో ఫొటోలు, వీడియోలతో ఆటోమాటిక్ ఆల్బమ్ గ్యాలరీ క్రియేట్ చేసుకోవచ్చు!

ట్రెండింగ్ వార్తలు