iPhones Payments : ఇకపై ఐఫోన్ ద్వారా కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ చేసుకోవచ్చు.. QR కోడ్ అక్కర్లేదు..!

ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ పేమెంట్ వ్యాలెట్ గా మారబోతోంది. డిజిటల్ ప్లాట్ ఫాంలైన పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే మాదిరిగా ఐఫోన్ ద్వారా కూడా పేమెంట్స్ చేసుకోవచ్చు.

iPhones Payments :  ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ పేమెంట్ వ్యాలెట్ గా మారబోతోంది. డిజిటల్ ప్లాట్ ఫాంలైన పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే మాదిరిగా ఐఫోన్ ద్వారా కూడా పేమెంట్స్ చేసుకోవచ్చు. అయితే ఈ డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ ఫాంలపై క్యూఆర్ కోడ్ అవసరం.. కానీ, ఐపోన్ ద్వారా కాంటాక్ట్ లెస్ ఫీచర్ ఒకటి తీసుకొస్తోంది ఆపిల్ కంపెనీ. థర్డ్ పార్టీ యాప్ లపై ఆధారపడకుండా నేరుగా ఐఫోన్ నుంచే కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ అతిత్వరలో రిలీజ్ చేయనున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది.

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. చిన్న వ్యాపారాల కోసం ఐఫోన్‌లలో నేరుగా పేమెంట్స్ చేసుకునేందుకు అనుమతించే ఓ సరికొత్త ఫీచర్‌ను ఆపిల్ త్వరలో తీసుకురానుంది. ఔట్ హార్డ్‌వేర్‌ను అవసరం లేకుండా సులభంగా పేమెంట్స్ చేసుకునేందుకు సాయపడుతుంది. రాబోయే నెలల్లో ఆపిల్ ఈ ఫీచర్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. మొదట 2020లో మోబీవేవ్ అనే కెనడియన్ స్టార్టప్‌ను సుమారు 100 మిలియన్ల డాలర్లకు కొనుగోలు చేసింది ఆపిల్.. దీనికి ముందు, 2019లో, Samsung ఈ సంస్థతో కలిసి పనిచేసింది.

వ్యాపారులకు ఇదే విధమైన సర్వీసును అందించింది. Mobewaveతో భాగస్వామ్యంతో Samsung POS (Samsung Point of Sale)ను ప్రవేశపెట్టింది. ఈ సర్వీసును Samsung ఫోన్‌లను ఉపయోగించి చిన్న వ్యాపారాలు కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ చేసుకునేందుకు సులభతరం చేసింది. వ్యాపారులు తమ NFC-సామర్థ్యం గల Samsung డివైజ్ లతో అదనపు హార్డ్‌వేర్ లేకుండానే mPOS (మొబైల్ పాయింట్ ఆఫ్ సేల్) టెర్మినల్స్‌గా మార్చుకోవచ్చు అనమాట..

మీరు చేయాల్సిందల్లా.. డౌన్‌లోడ్ చేసుకోవడమే.. 
Samsung POS యాప్‌ని Galaxy Store లేదా Play Store నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడమే.. అంతే.. మీరు ఒక మర్చంట్‌గా నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, వ్యాపారులు, చిన్న వ్యాపార యజమానులు Apple Pay, Google Pay, Samsung Pay లేదా Visa, Mastercard నుంచి కాంటాక్ట్‌లెస్ కార్డ్‌లను ఉపయోగించి కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ ప్రారంభించవచ్చు. ఆపిల్ కూడా అలాంటిదే చేయాలని భావిస్తోంది. కంపెనీ ట్యాప్-టు-పే టెర్మినల్ టెక్నాలజీని నేరుగా NFC-ఆధారిత ఐఫోన్‌లలోకి చేర్చాలని భావిస్తోంది. ప్రస్తుతం.. చిన్న వ్యాపార యజమానులు ఐఫోన్‌ల కోసం.. మల్టీఫుల్ పేమెంట్స్ టెర్మినల్‌లను విక్రయించే స్క్వేర్ వంటి ఆర్థిక సేవల సంస్థల అదనపు హార్డ్‌వేర్‌పై ఆధారపడాల్సి వస్తోంది.

అదే ఐఫోన్లలోనే ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టడం ద్వారా నేరుగా పేమెంట్స్ నిర్వహించుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ ఎప్పుడు ప్రారంభించాలని ప్లాన్ చేస్తుందో కంపెనీ వెల్లడించలేదు. Mobewave సాంకేతికత Apple Pay సర్వీసులో భాగంగా వస్తుందా అనేది తెలియదు. కుపెర్టినో దిగ్గజం ఆపిల్ కంపెనీ.. ఈ కొత్త ఫీచర్ కోసం ఇప్పటికే పేమెంట్ ఉన్న నెట్‌వర్క్‌తో భాగస్వామి అవుతుందా లేదా దాని పేమెంట్ నెట్‌వర్క్‌ని ఉపయోగిస్తుందా అనేది క్లారిటీ లేదు. రాబోయే నెలల్లో Apple సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా ఫీచర్‌ను విడుదల చేయాలని భావిస్తోందని నివేదిక పేర్కొంది.

Read Also : Tata Sky : టాటా ప్లేగా మారిన టాటా స్కై.. కాంబో ప్లాన్‌తో చానెల్స్, 13 ఓటీటీలు చూసే అవకాశం

ట్రెండింగ్ వార్తలు