iQoo 12 Series Launch : నవంబర్ 7న ఐక్యూ 12 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!

iQoo 12 Series Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ఐక్యూ నుంచి సరికొత్త ఐక్యూ 12 సిరీస్ (iQoo 12 Series) సిరీస్ మోడల్ వచ్చేస్తోంది. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీకయ్యాయి.

iQoo 12 Series Launch : నవంబర్ 7న ఐక్యూ 12 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!

iQoo 12 Series Could Launch on November 7; Colour Options, Battery Details Leaked

iQoo 12 Series Launch : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో (Vivo) సబ్ బ్రాండ్ ఐక్యూ (iQoo) నుంచి (iQoo 12 Series Launch) సిరీస్ వచ్చేస్తోంది. అయితే, కచ్చితమైన తేదీని ఇంకా కంపెనీ అధికారికంగా ధృవీకరించలేదు. అయితే, లేటెస్ట్ లీక్ ప్రకారం.. iQoo 12, iQoo 12 Pro సిరీస్ నవంబర్ 7న అధికారికంగా అందుబాటులోకి రానున్నాయి.

iQoo 11 సిరీస్ మరో 3 విభిన్న షేడ్స్‌లో వస్తాయి. ఐక్యూ 12 సిరీస్ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4,880mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. iQoo 12 సిరీస్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 SoC ద్వారా పనిచేస్తుందని భావిస్తున్నారు. 24GB వరకు LPDDR5x RAM, 1TB వరకు UFS 4.0 స్టోరేజీని అందిస్తుంది.

Read Also : Reliance Digital Offers : వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ ఫోన్‌ ఇదిగో.. రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో స్పెషల్ ఆఫర్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

మూడు కలర్ ఆప్షన్లలో ఐక్యూ 12 సిరీస్ :
Weiboలో టిప్‌స్టర్ పాండా ఈజ్ బాల్డ్ నుంచి ఐక్యూ 12, ఐక్యూ 12 ప్రో మోడల్ నవంబర్ 7న చైనాలో లాంచ్ కానుందని పేర్కొంది. అందులో బ్లాక్, రెడ్, వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయని చెబుతోంది. మరో టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ iQoo 12 లైనప్ బ్యాటరీ, ఛార్జింగ్ వివరాలను హ్యాండ్‌సెట్‌ల UFCS జాబితాను సూచించింది. లీక్ ప్రకారం.. సాధారణ iQoo 12 4,880mAh డ్యూయల్-సెల్ బ్యాటరీతో 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. మరోవైపు, iQoo 12 ప్రో, 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పెద్ద 4,980mAh బ్యాటరీని అందించనుంది.

iQoo 12 Series Could Launch on November 7; Colour Options, Battery Details Leaked

iQoo 12 Series Could Launch on November 7

లీకైన స్పెషిఫికేషన్లు ఇవే :
గత లీక్‌ల ప్రకారం.. ఐక్యూ 12 సిరీస్ Snapdragon 8 Gen 3 SoCతో రావచ్చు. గరిష్టంగా 24GB RAM, 1TB స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. Android 14తో రానుంది. 2K రిజల్యూషన్, 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో Samsung E7 AMOLED డిస్‌ప్లేలను స్పోర్ట్ చేయవచ్చు. మెటల్ బాడీలతో కూడా వచ్చే అవకాశం ఉంది. iQoo 12 సిరీస్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.

ఇందులో, 50MP ఓమ్నివిజన్ OV50H సెన్సార్‌తో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), మరో 50MP Samsung ISOCELL JN1 సెన్సార్‌తో అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉన్నాయి . 3x జూమ్, OIS సపోర్టుతో 64MP OV64B టెలిఫోటో సెన్సార్ కూడా ఉండవచ్చు.

Read Also : Amazon Sale on Laptops : అమెజాన్ సేల్.. ఈ టాప్ 5 ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు.. మీకు నచ్చిన మోడల్ కొనేసుకోండి..!