Reliance Digital Offers : వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ ఫోన్‌ ఇదిగో.. రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో స్పెషల్ ఆఫర్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

Reliance Digital Offers : వన్‌ప్లస్ ఫోన్ యూజర్లకు స్పెషల్ ఆఫర్లు.. ప్రత్యేకించి రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ ఫోన్‌పై అదిరిపోయే డిస్కౌంట్లను అందిస్తోంది.

Reliance Digital Offers : వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ ఫోన్‌ ఇదిగో.. రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో స్పెషల్ ఆఫర్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

Reliance Digital Offers OnePlus Open Foldable Smartphone

Reliance Digital Offers : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? వన్‌ప్లస్ కస్టమర్ల కోసం రిలయన్స్ డిజిటల్ అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ ఫోన్‌ (OnePlus Open Foldable Phone)ను తమ స్టోర్లలో ప్రత్యేకంగా అందించడానికి రిలయన్స్ డిజిటల్ (Reliance Digital Stores) వన్‌ప్లస్‌ (OnePlus)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఆసక్తిగల కస్టమర్‌లు తమ సమీప రిలయన్స్ డిజిటల్ అవుట్‌లెట్‌లో ఈరోజు నుంచి వన్‌ప్లస్ ఓపెన్ మడతబెట్టే ఫోన్ ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.

అంతేకాదు.. ఉచితంగా (OnePlus Buds Pro 2), యాక్సిడెంటల్ ప్రొటెక్షన్ ప్లాన్, ICICI బ్యాంక్ కార్డ్‌లపై రూ. 5వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్, రూ. 8వేల వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌తో సహా ప్రత్యేక బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఈ సేల్ అక్టోబర్ 27, 2023న అందుబాటులోకి వస్తుంది. కస్టమర్లు కొనుగోలు చేయడానికి ముందు రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లలో వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను చూసేందుకు వీలు కల్పిస్తుంది. రిలయన్స్ డిజిటల్ సీఈఓ బ్రియాన్ బాడే మాట్లాడుతూ.. ‘అద్భుతమైన వన్‌ప్లస్ ఓపెన్ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకమైన లాంచ్ కోసం వన్‌ప్లస్‌తో భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉంది. భారత్ అంతటా మా కస్టమర్‌లకు సరికొత్త టెక్నాలజీని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని పేర్కొన్నారు.

Read Also : OnePlus Pad Go Sale : ఈ నెల 20న వన్‌ప్లస్ ప్యాడ్ గో ట్యాబ్ ఫస్ట్ సేల్.. లాంచ్ ఆఫర్లు, ధర ఎంతంటే?

వన్‌ప్లస్ ఓపెన్ (OnePlus Open) అనేది అత్యాధునిక టెక్నాలజీతో అద్భుతమైన డిజైన్‌తో వచ్చింది. ఈ ఫోల్డబుల్ ఫోన్, టాబ్లెట్ మోడ్‌ల మధ్య మారడానికి యూజర్లను అనుమతించే ఫోల్డబుల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డివైజ్ సరికొత్త Qualcomm స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో ఆధారితమైనది. గరిష్టంగా 12GB RAM, 512GB స్టోరేజీతో వస్తుంది. మెరుగైన మన్నిక కోసం వాటర్‌డ్రాప్ కీలుతో కూడా వస్తుంది. కెమెరా సెన్సార్ కాంపాక్ట్, సోనీ ‘డ్యూయల్-లేయర్ ట్రాన్సిస్టర్ పిక్సెల్’ టెక్నాలజీతో పరిమాణంలో రెట్టింపు కాంతిని అందిస్తుంది.

అక్టోబర్ 27న వన్‌ప్లస్ ఓపెన్ సేల్.. ధర ఎంతంటే? :
అక్టోబర్ 19న వన్‌ప్లస్ ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ (OnePlus Open) లాంచ్ చేసింది. ‘ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్’ అనే ఈవెంట్‌లో ఈ ఫోల్డబుల్ హ్యాండ్‌సెట్‌ను ప్రవేశపెట్టింది. భారత మార్కెట్లో వన్‌ప్లస్ ఓపెన్ ధర రూ. 139,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఓపెన్ సేల్ అక్టోబర్ 27 నుంచి ప్రారంభమవుతుంది. మడతపెట్టగల ఈ స్మార్ట్‌ఫోన్ వల్చర్ బ్లాక్, ఎమరాల్డ్ డస్ట్ అనే 2 కలర్ ఆప్షన్లలో వస్తుంది. గత ఫిబ్రవరిలో, ఢిల్లీలో జరిగిన క్లౌడ్ 11 ఈవెంట్‌లో వన్‌ప్లస్ కంపెనీ మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ ఆవిష్కరించింది.

Reliance Digital Offers OnePlus Open Foldable Smartphone

Reliance Digital Offers OnePlus Open Foldable

వన్‌ప్లస్ ఓపెన్ కవర్ డిస్‌ప్లే 6.31 అంగుళాలు, ఓపెన్ చేస్తే లోపలి డిస్‌ప్లే 7.82 అంగుళాలు. రెండు స్క్రీన్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటాయి. LTPO 3.0 టెక్నాలజీతో వచ్చాయి. 2K స్క్రీన్ స్పష్టంగా కంటెంట్‌ వినియోగానికి బాగుంటుంది. వన్‌ప్లస్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 4 ఏళ్ల ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌లు, ఐదేళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లతో వస్తోంది. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లో సోనీ కెమెరా టెక్నాలజీ ఉంది. 64MP టెలిఫోటో సెన్సార్‌ను కలిగి ఉంది. 0.6x నుంచి 10x వరకు జూమ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

వన్‌ప్లస్ ఓపెన్ స్పెసిఫికేషన్లు ఇవే :
ప్రాసెసర్ : రే ట్రేసింగ్‌తో కూడిన Qualcomm Snapdragon 8 Gen 2 ప్లాట్‌ఫారమ్.
ఆపరేటింగ్ సిస్టమ్ : OxygenOS 13.2 : డ్యూయల్ స్ప్లిట్ స్క్రీన్, ఫాస్ట్ ఫోకస్, డ్రాగ్ అండ్ డ్రాప్ షేరింగ్, ట్రిపుల్ స్ప్లిట్-స్క్రీన్ ఫంక్షనాలిటీతో మల్టీ టాస్కింగ్
కవర్ డిస్‌ప్లే : 6.31″ 2K రిజల్యూషన్, 1440 Hz సూపర్ ఫ్లూయిడ్ AMOLED డిస్‌ప్లేలు
డ్యూయల్-డిస్‌ప్లేలు : 7.82″ 2K రిజల్యూషన్, ఫ్లెక్సీ-ఫ్లూయిడ్ AMOLED, 1440 Hz వద్ద 89.6శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో
కెమెరాలు : OISతో ప్రైమరీ కెమెరా – 48MP SONY LYT-T800 ‘పిక్సెల్ స్టాక్డ్’ సెన్సార్, 1/1.43″ సెన్సార్, 1.12μm, ƒ/1.65, AF
OIS- 64MP OV64B సెన్సార్‌తో 3X ఆప్టికల్ జూమ్, 6X ఇన్-సెన్సార్ జూమ్, 1/2″ సెన్సార్, 0.7 μm, ƒ/2.6, AFతో టెలిఫోటో
అల్ట్రా-వైడ్ : 114o FOV, 1/2″ సెన్సార్, ƒ/2.2, AFతో 48MP Sony IMX581, కనిష్ట క్రీజ్, పేటెంట్ ఫ్లెక్షన్ కీలు, 8-యాక్సిస్ ప్రెజర్ రిలీఫ్, అండర్ డిస్‌ప్లే మైక్రో-వీవింగ్
మల్టీ-స్పేషియల్ స్పీకర్‌లు : డాల్బీ అట్మోస్ ఆధారితమైన మల్టీ ‘రియాలిటీ’ స్పీకర్‌లతో కూడిన స్పెషల్ ఆడియో ఫంక్షనాలిటీ.

Read Also : OnePlus Open Launch : వన్‌ప్లస్ నుంచి ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్.. ఈ మడతబెట్టే ఫోన్ ధర ఎంత ఉండొచ్చుంటే?