iQOO 13 Leak : ఐక్యూ 13 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర, కీలక ఫీచర్లు లీక్..!

iQOO 13 Launch : ఐక్యూ 13 ఫోన్ 6.78-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. లాంచ్‌కు ముందే ధర, కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి. 

iQOO 13 Price, Key Features Leaked Ahead of October 30 Launch ( Image Source : Google )

iQOO 13 Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఐక్యూ నుంచి సరికొత్త మోడల్ ఫోన్ వచ్చేస్తోంది. ఈ నెల 30న చైనాలో ఐక్యూ 13 ఫోన్ లాంచ్ కానుంది. లాంచ్‌కు ముందే ధర, కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి. ఇప్పటివరకు, కంపెనీ ఫోన్ డిజైన్, కలర్ ఆప్షన్లను మాత్రమే రివీల్ చేసింది. డిస్‌ప్లేకు సంబంధించిన కీలక వివరాలను కూడా ధృవీకరించింది. ఐక్యూ ఫోన్ AnTuTu బెంచ్‌మార్క్ నంబర్‌లను కూడా వెల్లడించింది. ఇంటర్నల్ క్యూ2 గేమింగ్ చిప్‌సెట్‌తో లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎస్ఓసీ ద్వారా అందిస్తుంది. ఈ ఫోన్ బ్యాటరీ, ఛార్జింగ్ వివరాలు కూడా వెల్లడయ్యాయి.

ఐక్యూ 13 ధర (అంచనా) :
ఐక్యూ 13 మోడల్ 12జీబీ + 256జీబీ ఆప్షన్ ధర సీఎన్‌వై 3,999 (దాదాపు రూ. 47,200) నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పుడు టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా సవరించినవెయిబో పోస్ట్ ప్రకారం.. గత ఐక్యూ 12 కన్నా ఐక్యూ 13 ఖరీదైనది. అయితే, కొత్త లీక్ రాబోయే హ్యాండ్‌సెట్ అంచనా ధర ఐక్యూ 12 లాంచ్ ధరకు సమానంగా ఉంటుందని సూచిస్తుంది.

ఐక్యూ 13 ఫీచర్లు (అంచనా) :
ఐక్యూ 13 ఫోన్ 6.78-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. 100డబ్ల్యూ పీపీఎస్+ డైరెక్ట్ డ్రైవ్ పవర్ సప్లై కోసం సపోర్టుతో వస్తుందని టిప్‌స్టర్ సూచిస్తున్నారు. ఈ ఫోన్ ఎల్ పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1016హెచ్ సూపర్ లార్జ్ మోటార్‌కు కూడా సపోర్టు అందిస్తుంది. గతంలో, ఐక్యూ 13 క్యూ2 గేమింగ్ చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎస్ఓసీ ద్వారా పవర్ పొందుతుందని కంపెనీ వెల్లడించింది. 120డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,150mAh బ్యాటరీతో సపోర్టు అందిస్తుంది.

ఐక్యూ ఫోన్ 2కె రిజల్యూషన్‌తో క్యూ10 8టీ ఎల్‌టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 1,800నిట్స్ హెచ్‌బీఎమ్ బ్రైట్‌నెస్, 510పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, హెచ్‌డీఆర్10+ సపోర్ట్‌ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కోసం స్క్రీన్ బీఓఈతో కలిసి అభివృద్ధి చేసింది. ఐక్యూ 13 డిస్‌ప్లే రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్‌తో కూడా వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ బ్లాక్, గ్రీన్, గ్రే, వైట్ అనే 4 కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా, ఫోన్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. తేదీ ఎప్పుడు అనేది కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

Read Also : JioBharat Diwali Offer : జియోభారత్ దీపావళి ధమాకా ఆఫర్.. నెలకు 14జీబీ డేటా, 450కి పైగా టీవీ ఛానెల్స్, ధర, బెనిఫిట్స్ ఇవే!