iQOO Neo 10 Series Launch Timeframe Leaked
iQOO Neo 10 Series Launch : ప్రముఖ వివో సబ్-బ్రాండ్ ఐక్యూ నుంచి సరికొత్త సిరీస్ వచ్చేస్తోంది. ఐక్యూ నియో 10, ఐక్యూ నియో 10ప్రో అప్‌గ్రేడ్ వెర్షన్లను రిలీజ్ చేయనుంది. ఈ కొత్త నియో ఫోన్ల గురించి చైనీస్ టిప్‌స్టర్ లాంచ్ టైమ్‌ఫ్రేమ్ ఎప్పుడు అనేది లీక్ చేశారు. వనిల్లా ఐక్యూ నియో 10 స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ఎస్ఓసీలో రన్ అవుతుందని భావిస్తున్నారు. అయితే, ఐక్యూ నియో 10 ప్రోను మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్ ద్వారా అందించవచ్చు.
ఐక్యూ నియో 10, ఐక్యూ నియో 10ప్రో సిరీస్ వచ్చే నవంబర్‌లో లాంచ్ కానుంది. ఐక్యూ నియో 9, ఐక్యూ నియో 9 ప్రోలను డిసెంబర్ 2023 లో చైనాలో ప్రారంభించింది. ఈ ఐక్యూ ప్రో మోడల్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆవిష్కరించారు. ఐక్యూ నియో 10 స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ఎస్ఓసీ ద్వారా పవర్ పొందే అవకాశం ఉంది.
అయితే, ఐక్యూ ప్రో వెర్షన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్‌లో రన్ అవుతుంది. మెటల్ మిడిల్ ఫ్రేమ్‌ని కలిగి ఉండొచ్చు.100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో సిలికాన్ బ్యాటరీలను ప్యాక్ చేయనుందని భావిస్తున్నారు. బ్యాటరీ సామర్థ్యం 6,000mAh కన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నారో బెజెల్‌లతో 1.5కె రిజల్యూషన్ ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చు.
ఐక్యూ నియో 9 సిరీస్ 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఐక్యూ నియో 9 చైనీస్ వేరియంట్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 ఎస్ఓసీ ద్వారా పవర్ అందిస్తుంది. ఐక్యూ నియో 9ప్రో హుడ్ కింద మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 16జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ 1టీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంటాయి.16ఎంపీ ఫ్రంట్ కెమెరా, 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరాలు, 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,160mAh బ్యాటరీని కలిగి ఉండనుంది.
Read Also : iPhone SE 4 Launch : ఆపిల్ ఐఫోన్ SE 4 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడు? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?