iQOO Neo 7 Price Cut : ఐక్యూ నియో 7 సిరీస్ ఫోన్ ధర తగ్గిందోచ్.. కొత్త ధర ఎంతంటే?

iQOO Neo 7 Price Cut : కొత్త ఫోన్ కొంటున్నారా? ఐక్యూ నియో 7 ఫోన్ ధర భారీగా తగ్గింది. 8ర్యామ్ /128జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 3వేలు ధర తగ్గింపు, 12జీబీ ర్యామ్ /256జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 4వేలు ధర తగ్గింపు అందిస్తుంది.

iQOO Neo 7 receives a significant price cut in India

iQOO Neo 7 Price Cut : ఐక్యూ నియో 7 సిరీస్ భారత మార్కెట్లో గణనీయమైన ధర తగ్గింపును పొందింది. వనిల్లా వేరియంట్ ధర రూ. 25వేల కన్నా తక్కువగా ఉంది. ఐక్యూ నియో 7 8జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 3వేల ధర తగ్గింపును పొందగా, 12జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజ్‌తో కూడిన హై-ఎండ్ ఐక్యూ నియో 7 రూ. 4వేల ధర తగ్గింపును పొందుతుంది. ఐక్యూ నియో 7 128జీబీ వేరియంట్ ధర ఇప్పుడు రూ. 24,999 కాగా ఐక్యూ నియో 7 256జీబీ వేరియంట్ ఇప్పుడు రూ. 27,999కు పొందవచ్చు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ల ధర రూ. 2వేలు తగ్గింది.

Read Also : Amazon Republic Day Sale 2024 : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. మొబైల్స్, ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు.. సేల్ ఎప్పటినుంచంటే?

ఐక్యూ నియో 7 స్పెసిఫికేషన్స్ :
ఐక్యూ నియో 7 5జీ అనేది డ్యూయల్ సిమ్ (నానో) డివైజ్, ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13పై రన్ అవుతుంది. 6.78-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120హెచ్‌‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో పాటు 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను పొందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ 4ఎన్ఎమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 5జీ చిప్‌సెట్‌తో పాటు మాలి జీ610, 12జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్ ర్యామ్‌తో పనిచేస్తుంది. 20జీబీ వరకు ర్యామ్ సపోర్టును అందిస్తుంది.

ఆప్టిక్స్ పరంగా చూస్తే..
ఐక్యూ నియో 7 5జీ ఫోన్ ప్రైమరీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 64ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ మాక్రో షూటర్, 2ఎంపీ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెన్సార్ల గురించి చెప్పాలంటే.. ఐక్యూ నుంచి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 256జీబీ యూఎఫ్ఎస్3.1 ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌తో వస్తుంది.

iQOO Neo 7 price cut

ఈ హ్యాండ్‌సెట్‌లో 5జీ, వై-ఫై, బ్లూటూత్, ఓటీజీ, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. ఐక్యూ 120డబ్ల్యూ ఫ్లాష్ ఛార్జింగ్‌కు సపోర్టుతో ఐక్యూ నియో 7 5జీలో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ కేవలం 10 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీని ఛార్జ్ చేయగలదని కంపెనీ పేర్కొంది.

Read Also : Best phones in India 2024 : ఈ జనవరిలో రూ. 35వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!