Amazon Republic Day Sale 2024 : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. మొబైల్స్, ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు.. సేల్ ఎప్పటినుంచంటే?
Amazon Great Republic Day Sale 2024 : కొత్త స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్ టాప్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మరికొద్ది రోజులు ఆగండి.. అతి త్వరలో అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం కానుంది. కస్టమర్లు అనేక ప్రొడక్టులపై భారీ తగ్గింపు పొందవచ్చు.

Amazon Great Republic Day Sale 2024 With Discounts on Mobiles, Laptops Announced
Amazon Great Republic Day Sale 2024 : అతి కొద్దిరోజుల్లో అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 ప్రారంభం కానుంది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ నెక్స్ట్ సేల్ ఈవెంట్ వివరాలను వెబ్‌సైట్‌లో రివీల్ చేసింది. ప్రతి ఏడాది మాదిరిగానే అమెజాన్ రిపబ్లిక్ డేకి కొన్ని రోజుల ముందు ప్రారంభమయ్యే సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, ఆడియో ప్రొడక్టులు, ఇతర యూజర్ ఎలక్ట్రానిక్‌లతో సహా అనేక రకాల ప్రొడక్టులపై ఆకర్షణీయమైన డిస్కౌంట్‌లను అందిస్తుంది. అమెజాన్ సేల్‌లో భాగంగా, కస్టమర్‌లు తమ బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై ఇన్‌స్టంట్ డిస్కౌంట్లను కూడా పొందవచ్చు.
కొన్ని ఫోన్లపై రూ.50వేల వరకు తగ్గింపు :
ఇ-కామర్స్ దిగ్గజం వెబ్‌సైట్‌లో రాబోయే అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ పేజీని పబ్లీష్ చేసింది. అయితే, ఈ సేల్ ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇంకా ప్రకటించలేదు. గత ఏడాదిలో సేల్ జనవరి 15న ప్రారంభమైంది. ఈ ఏడాది కూడా ఇదే టైమ్‌లైన్ ఉండవచ్చు.
కంపెనీ ఇతర సేల్ ఈవెంట్‌ల మాదిరిగానే, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్‌లు రాబోయే సేల్‌కు ముందస్తు యాక్సెస్‌ను కలిగి ఉంటారని వెబ్‌సైట్ వెల్లడించింది. రాబోయే సేల్‌లో అమెజాన్ స్మార్ట్‌ఫోన్‌లు, అప్లియన్సెస్‌పై 40 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ఇందులో 5జీ స్మార్ట్‌ఫోన్‌లు రూ. 9,999, ల్యాండింగ్ పేజీ ప్రకారం.. కొన్ని స్మార్ట్‌ఫోన్‌లపై రూ. 50వేల వరకు తగ్గింపు ఉండవచ్చు.

Amazon Great Republic Day Sale 2024
ల్యాప్‌టాప్, స్మార్ట్‌వాచ్‌లపై 75 శాతం వరకు తగ్గింపు :
అదేవిధంగా, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు 75 శాతం వరకు తగ్గింపుతో లభిస్తాయి. రాబోయే అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో స్మార్ట్‌టీవీలు, ఇతర అప్లియన్సెస్ 65 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా అనేక ప్రొడక్టులపై డిస్కౌంట్‌లతో పాటు, ఎస్‌బీఐ బ్యాంక్ కస్టమర్‌లు క్రెడిట్ కార్డ్, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
పాత డివైజ్ ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా సేల్ సమయంలో ఇ-కామర్స్ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలుపై ధర మరింత తగ్గుతుంది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ గురించి మరిన్ని వివరాలు ఇంకా తెలియలేదు. ఇ-కామర్స్ దిగ్గజం సేల్ తేదీల వివరాలను వెల్లడించనుంది. ఏ డివైజ్‌లకు తగ్గింపు అందించనుంది? ప్రైమ్ మెంబర్‌ల కోసం సేల్ ఎప్పుడు ప్రారంభం కానుంది అనే వివరాలు ఇంకా రివీల్ చేయలేదు.
Read Also : Apple iPhone 14 Discount : అత్యంత సరసమైన ధరకే ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్.. ఈ ఫోన్ కొనాలా? వద్దా?