iQOO Neo 7 SE launched with AMOLED screen, 120W fast charging, and more
iQOO Neo 7 SE Launched : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐక్యూ నుంచి iQOO Neo 7 SE ఫోన్ వచ్చేసింది. చైనా మార్కెట్లో 120W ఫాస్ట్ ఛార్జింగ్, పవర్‌ఫుల్ మీడియాటెక్ చిప్‌సెట్, AMOLED డిస్ప్లేతో లాంచ్ అయింది. ఈ ఫోన్ గ్లోబల్ లాంచ్ ఎప్పుడు అనేది రివీల్ చేయలేదు. ఈ హ్యాండ్‌సెట్ భారత మార్కెట్లో కూడా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే.. దేశంలో iQOO Neo 6 ఇటీవలే లాంచ్ అయింది. మొదట చైనాలో iQOO నియో 6 SE స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. ఇప్పుడు రాబోయే Neo 7 SE లేటెస్ట్ వెర్షన్‌తో అదే ఫీచర్లతో రానుంది. iQOO Neo 7 SE చైనాలో CNY 2,099 ప్రారంభ ధరతో వస్తుంది. భారత మార్కెట్లో దాదాపు రూ. 24,800గా ఉండనుంది. ఈ ఫోన్ ధర (8GB RAM + 128GB) స్టోరేజ్ మోడల్ భారత మార్కెట్‌లో కొంచెం ఎక్కువగా ఉంటుందని అంచనా.
గతంలో iQOO Neo 6 ప్రారంభ ధర రూ. 29,999గా ఉంది. iQOO Neo 7 SE సాధారణ మిడ్-రేంజ్ స్పెసిఫికేషన్‌లతో వచ్చింది. రూ. 30,000 ధర పరిధిలో ఉండవచ్చు. ఈ డివైజ్ Full HD+ రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ప్యానెల్ సున్నితమైన పర్ఫార్మెన్స్ కోసం120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు అందిస్తుంది. స్క్రీన్ అనేక మిడ్-రేంజ్ ప్రీమియం ఫోన్‌ల మాదిరిగానే 1,300నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది.
iQOO Neo 7 SE launched with AMOLED screen, 120W fast charging, and more
Read Also : iQOO 11 5G : ఐక్యూ 11 5G ఫోన్ కీలక ఫీచర్లు లీక్.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?
సాధారణ 5,000mAh బ్యాటరీని పొందవచ్చు. 120W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్‌కు సపోర్టు అందిస్తుంది. Apple, Samsung వంటి బ్రాండ్‌ల మాదిరిగా కాకుండా కంపెనీ రిటైల్ బాక్స్‌లో ఫాస్ట్ ఛార్జర్‌ను అందిస్తుంది. ఛార్జర్ కంపెనీ ప్రకారం.. ఫోన్ బ్యాటరీని సుమారు 10 నిమిషాల్లో 60 శాతం పెంచవచ్చు. ఫోటోగ్రఫీ కోసం.. iQOO Neo 7 SE వెనుక 3 కెమెరాలు కనిపిస్తాయి. మిడ్-రేంజ్ ఫోన్ OISకి సపోర్టుతో 65-MP ప్రధాన కెమెరాను కలిగి ఉంది. 2-MP మాక్రో కెమెరా, 2-MP డెప్త్ సెన్సార్‌తో రానుంది. 2-MP సెన్సార్‌కు అనుకూలంగా 8-MP సెన్సార్‌తో రానుంది. ఇది డౌన్‌గ్రేడ్ వెర్షన్. ఈ 2-MP సెన్సార్‌లతో రియల్ టైం ఎలాంటి ఉపయోగం ఉండదు.
ఫ్రంట్ సైడ్ సెల్ఫీల కోసం 16-MP సెన్సార్ ఉంది. iQOO Neo 7 SE ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ తేదీ వెల్లడించలేదు. iQOO 11 స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించడానికి కంపెనీ రెడీ అవుతుందని చెప్పవచ్చు. ఈ 5G ఫోన్ త్వరలో దేశంలోకి వస్తుందని బ్రాండ్ ధృవీకరించింది. 2023లో iQOO Neo 7 SE లాంచ్‌ను చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..