iQOO Neo 9 Pro Launch : అద్భుతమైన ఫీచర్లతో భారత్‌కు ఐక్యూ నియో 9 ప్రో వస్తోంది.. ప్రీ-ఆర్డర్ తేదీ వివరాలు వెల్లడి!

iQOO Neo 9 Pro pre-orders : భారత మార్కెట్లో ఫిబ్రవరి 22న ఐక్యూ నియో 9 ప్రో మోడల్ లాంచ్ కానుంది. ఫిబ్రవరి 8 నుంచి ప్రీ-ఆర్డర్‌లు ప్రారంభమవుతాయి. లాంచ్‌కు ముందు డివైజ్ కొనుగోలు చేసేవారు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.

iQOO Neo 9 Pro pre-orders : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ ఐక్యూ నుంచి మరో సరికొత్త ఐక్యూ నియో 9 ప్రో మోడల్ భారత మార్కెట్లో ఫిబ్రవరి 22న లాంచ్ కానుంది. ఫిబ్రవరి 8న ప్రీ-ఆర్డర్‌లు ప్రారంభం కానున్నాయి. లాంచ్‌కు ముందు ఈ డివైజ్ కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్న వినియోగదారులు తిరిగి చెల్లించాల్సిన డబ్బు చెల్లించి అమెజాన్ లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.

Read Also : Instagram Edit Message : ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. పంపిన మెసేజ్ ఇకపై ఎడిట్ చేయొచ్చు.. కేవలం 15 నిమిషాల్లోపు మాత్రమే..!

ఇందుకోసం రూ. వెయ్యి రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ, ప్రీ-బుక్ స్టాక్‌లు పరిమితంగా ఉన్నాయని గుర్తుంచుకోవాలి. మొదటగా వచ్చిన వారికి మాత్రమే అందుకునే అవకాశం ఉంటుంది. ఇ-కామర్స్ సైట్ ఇప్పటికే ఐక్యూ నియో 9 ప్రో ముఖ్య స్పెషిఫికేషన్లను వెల్లడించింది. రాబోయే ఐక్యూ ఫోన్ స్పెసిఫికేషన్‌లు, భారత్‌లో అంచనా ధర వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఐక్యూ నియో 9 ప్రో స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
రాబోయే ఐక్యూ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 చిప్‌సెట్ ద్వారా అందిస్తోంది. 2023లో అనేక ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను అందిస్తోంది. అదే చిప్‌ని ఇటీవల లాంచ్ చేసిన వన్‌ప్లస్ 12ఆర్ ఉపయోగిస్తోంది. భారత మార్కెట్లో ఈ డివైజ్ ధర రూ. 39,999కు పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 2 కాన్ఫిగరేషన్‌లలో పొందవచ్చు. 8జీబీ ర్యామ్ + 256జీబీ 12జీబీ + 256జీబీ అందిస్తుంది.

డివైజ్ డ్యూయల్ టోన్ లుక్‌తో బ్యాక్ సైడ్ లెదర్ ఫినిష్‌ని కలిగి ఉంది. టీజర్‌ల ప్రకారం.. ఐక్యూ నియో 9 ప్రో ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. 50ఎంపీ సోనీ IMX920 ప్రధాన కెమెరా, 8ఎంపీ వైడ్-యాంగిల్-కెమెరాతో సహా బ్యాక్ 2 పెద్ద కెమెరాలు ఉన్నాయి.

iQOO Neo 9 Pro pre-order details  

ఈసారి కొత్త వెర్షన్‌లో మూడో కెమెరా లేదు. నియో 7 ప్రోలో మాక్రో కెమెరాను కంపెనీ తొలగించింది. కానీ, 2ఎంపీ సెన్సార్‌లు క్వాలిటీ పరంగా పెద్దగా అందిస్తోంది. హుడ్ కింద, 5,160ఎంఎహెచ్ బ్యాటరీ కూడా ఉంది. 120డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి కూడా సపోర్టు అందిస్తుంది. బాక్స్‌లో ఛార్జర్‌ని అందిస్తుంది. ప్రస్తుతానికి వివరాలు తెలియవు.

ఐక్యూ నియో 9 ప్రో : భారత్ ధర ఎంతంటే? :
ఐక్యూ నియో 7 ప్రో గత ఏడాదిలో రూ. 34,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఈ కొత్త ఐక్యూ నియో 9 ప్రో ధర రూ. 40వేల కన్నా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. ప్రస్తుతం అత్యంత హాటెస్ట్ సెగ్మెంట్, పోటీతత్వాన్ని పొందడానికి కంపెనీ ప్రతి ఏడాది మాదిరిగానే వన్‌ప్లస్ 12ఆర్ కన్నా చాలా తక్కువ ధరకు అందిస్తుందని భావిస్తున్నారు.

Read Also : Jio AirFiber Data Offer : జియో ఎయిర్‌ఫైబర్ యూజర్ల కోసం సరికొత్త 3 డేటా బూస్టర్ ప్లాన్లు ఇవే.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

ట్రెండింగ్ వార్తలు