iQoo Neo 9s Pro Plus : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో ఐక్యూ నియో 9ఎస్ ప్రో ప్లస్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Neo 9s Pro Plus : ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఐక్యూ నియో 9ఎస్ ప్రో ప్లస్ 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్921 ప్రైమరీ షూటర్, 50ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

iQoo Neo 9s Pro Plus : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో ఐక్యూ నియో 9ఎస్ ప్రో ప్లస్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Neo 9s Pro plus With Snapdragon 8 Gen 3 SoC, 120W Fast Charging Support Launched ( Image Source : Google )

iQoo Neo 9s Pro Plus : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఐక్యూ నియో 9ఎస్ ప్రో ప్లస్ చైనాలో గురువారం (జూలై 12) లాంచ్ అయింది. వివో సబ్-బ్రాండ్ ద్వారా కొత్త నియో 9 సిరీస్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 3 కలర్ ఆప్షన్లలో వస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ఎస్ఓసీ ద్వారా పవర్ పొందుతుంది.

Read Also : Redmi 13 5G First Sale : రెడ్‌‌మి 13 5జీ ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. దిమ్మతిరిగే ఫీచర్లు, ధర ఎంతో తెలుసా?

120డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఐక్యూ నియో 9ఎస్ ప్రో ప్లస్ 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో ఎల్‌‌టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఐదు ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందిస్తోంది. ఈ కొత్త హ్యాండ్‌సెట్ ఐక్యూ నియో 9, నియో 9ప్రో మాదిరిగానే ఫీచర్లను కలిగి ఉంది.

ఐక్యూ నియో 9ఎస్ ప్రో ప్లస్ ధర, లభ్యత :
ఐక్యూ నియో 9ఎస్ ప్రో ప్లస్ 12జీబీ + 256జీబీ వేరియంట్ ధర సీఎన్‌వై 2,999 (సుమారు రూ. 34వేల) నుంచి ప్రారంభమవుతుంది. 12జీబీ + 512జీబీ వేరియంట్ ధర సీఎన్‌వై 3,399 (దాదాపు రూ. 39వేలు). 16జీబీ+ 256జీబీ, 16జీబీ+ 512జీబీ ఆప్షన్లు వరుసగా సీఎన్‌వై 3,299 (దాదాపు రూ. 36వేలు) సీఎన్‌వై 3,699 (దాదాపు రూ. 42వేలు)గా ఉన్నాయి. 16జీబీ + 1టీబీ వేరియంట్ ధర సీఎన్‌వై 4,099 (దాదాపు రూ. 46వేలు) వరకు పెరుగుతుంది. బఫ్ బ్లూ, స్టార్ వైట్, ఫైటింగ్ బ్లాక్ కలర్స్‌లో వస్తుంది. జూలై 16 నుంచి చైనాలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

ఐక్యూ నియో 9ఎస్ ప్రో ప్లస్ స్పెసిఫికేషన్‌లు :
డ్యూయల్-సిమ్ (నానో) ఐక్యూ నియో 9ఎస్ ప్రో ప్లస్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఆర్జిన్ఓఎస్ 4లో రన్ అవుతుంది. 6.78-అంగుళాల (1,260×2,800 పిక్సెల్‌లు) అమోల్డ్ డిస్‌ప్లేను గరిష్టంగా 144Hz రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 93తో కలిగి ఉంది. కొత్త ఐక్యూ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ 4ఎన్ఎమ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ఎస్ఓసీ ద్వారా అందిస్తోంది. దీనితో పాటు 16జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, అడ్రినో 750 జీపీయూ ఉన్నాయి. వివో స్వయంగా అభివృద్ధి చేసిన క్యూ1 చిప్‌ను కూడా కలిగి ఉంటుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఐక్యూ నియో 9ఎస్ ప్రో ప్లస్ 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్921 ప్రైమరీ షూటర్, 50ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 16ఎంపీ సెల్ఫీ సెన్సార్‌ను కలిగి ఉంది. 1టీబీ వరకు యూఎఫ్ఎస్4.0 ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది.

ఐక్యూ నియో 9ఎస్ ప్రో ప్లస్‌లోని కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, వై-ఫై 7, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ ఓటీజీ, ఎన్ఎఫ్‌సీ, Beidou, జీపీఎస్, GLONASS, GALILEO, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. బోర్డ్‌లోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి.

ఈ ఫోన్ అల్ట్రాసోనిక్ 3డీ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందిస్తుంది. అథెంటికేషన్ కోసం ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌కు సపోర్టు ఇస్తుంది. ఐక్యూ 120డబ్ల్యూ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఐక్యూ నియో 9ఎస్ ప్రో ప్లస్‌లో 5,500mAh బ్యాటరీని అందించింది. ఈ హ్యాండ్‌సెట్ 163.53×75.68×7.99ఎమ్ఎమ్ కొలుస్తుంది.

Read Also : Jio vs Airtel 5G Plans : జియో, ఎయిర్‌టెల్ చౌకైన 5జీ మొబైల్ ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. ధర, వ్యాలిడిటీ వివరాలివే..!