iQOO Z9 Price drops by 26 Percent on Amazon
iQOO Z9 Price Drop : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో రూ. 20వేల లోపు ఆండ్రాయిడ్ ఫోన్‌ని చూస్తుంటే.. ఇదే సరైన అవకాశం. అమెజాన్‌లో ఇటీవలి ధర తగ్గింపు తర్వాత ఐక్యూ Z9 బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ ఐక్యూ జెడ్ 9 ఫోన్ రూ. 18,498కి కొనుగోలు చేయవచ్చు. అసలు ధర రూ. 24,999 కన్నా చాలా తక్కువ 26శాతం ధర తగ్గింపుతో పొందవచ్చు. ఇంతకీ, ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐక్యూ Z9 5జీ డీల్ ఎంతంటే? :
మీరు ప్రస్తుతం అమెజాన్ ప్లాట్‌ఫారంపై ఐక్యూ Z9 5జీ కోసం చూస్తుంటే.. రూ.18,498కి జాబితా అయిన 8జీబీ+ 128జీబీ మోడల్‌ను పొందవచ్చు. మీరు ఇదే ధరకు కొనుగోలు చేయొచ్చు. బ్యాంక్ ఆఫర్‌లతో మరింత తగ్గింపు ధరకు పొందవచ్చు. ఉదాహరణకు, మీరు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ లేదా వన్ కార్డ్ వంటి సపోర్టు క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగిస్తుంటే.. ధరను మరింత తగ్గించవచ్చు.
అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి ధృవీకరించవచ్చు. అమెజాన్ యాప్ ఫుల్ పేమెంట్‌పై రూ. 2,500 డిస్కౌంట్ అందిస్తుంది. తద్వారా ధర రూ. 15,998కి తగ్గింది. సాధారణ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 2,500గా తగ్గింపు కూడా అందిస్తుంది. వన్‌కార్డ్ యూజర్లు ఈఎంఐ లావాదేవీలపై రూ. 1,500 డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ప్రత్యేకించి లాంచ్ ధరతో పోలిస్తే.. ఐక్యూ జెడ్9కి బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు.
ఐక్యూ జెడ్ 9 స్పెసిఫికేషన్‌లు :
ఐక్యూ Z9 మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్‌సెట్, 5జీ-సామర్థ్యం గల ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీతో వస్తుంది. డిస్ప్లేకి విషయానికి వస్తే.. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల అమోల్డ్ ప్యానెల్‌ను కలిగి ఉంది. 1,800నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌కు సపోర్టు ఇస్తుంది. అవుట్‌డోర్‌లో కూడా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ ఫోన్ పెద్ద 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 44డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఐక్యూ ఫోన్ 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్882 ప్రైమరీ కెమెరాను పొందుతుంది. 4కె వీడియో రికార్డింగ్, సూపర్ నైట్ మోడ్, 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. సెల్ఫీల విషయానికి వస్తే.. 2ఎంపీ సెకండరీ కెమెరా, 16ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కూడా కలిగి ఉంది. చివరగా, సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. ఐక్యూ జెడ్9 ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఫన్‌టచ్ ఓఎస్ 14లో రన్ అవుతుంది.
Read Also : MacBook Air M3 Price Cut : ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా తగ్గిన మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం3 ధరలు.. ఏ మోడల్ ధర ఎంతంటే?