Itel A60s Smartphone : రూ. 7వేల లోపు ధరలో ఐటెల్ A60s ఫస్ట్ ఇండియన్ స్మార్ట్‌ఫోన్ వస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Itel A60s Smartphone : భారత్ నుంచి ఫస్ట్ ఇండియన్ ఐటెల్ A60s స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. 8GB ర్యామ్‌తో అత్యంత సరసమైన ధరకే కొనుగోలు చేయొచ్చు.

Itel A60s Claims to Be India’s First Smartphone

Itel A60s Smartphone : ప్రముఖ చైనీస్ తయారీదారు ఐటెల్ (Itel) బడ్జెట్ స్మార్ట్‌ఫోన్, రూ.10వేల కింద కొత్త హ్యాండ్‌సెట్‌లను లాంచ్ చేస్తోంది. భారత మార్కెట్లో ఈ నెల ప్రారంభంలో Itel S23 ఫోన్ లాంచ్ చేయగా.. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 8,799కు అందించింది. గత మార్చిలో Itel P40, Itel A60లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇప్పుడు కంపెనీ Itel A60s అప్‌గ్రేడ్ వెర్షన్‌ను భారత్‌లో లాంచ్ చేసేందుకు రెడీ అవుతుంది. అమెజాన్ లిస్టులో రాబోయే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Itel A60s స్పెసిఫికేషన్‌లను రివీల్ చేసింది.

అమెజాన్ ప్రమోషనల్ పేజీ ఐటెల్ హ్యాండ్‌సెట్‌లో 8GB RAM ఉండనుంది. ఇందులో 4GB ఫిజికల్ ర్యామ్, 4GB వర్చువల్ ర్యామ్ ‘మెమరీ ఫ్యూజన్’ టెక్నాలజీ ద్వారా రానుంది. ఐటెల్ A60s 7K కింద భారతీయ ఫస్ట్ 8GB RAM స్మార్ట్‌ఫోన్ అని జాబితా పేర్కొంది. ఈ ఫోన్ రూ. 7,000 లోపు ధర లాంచ్ చేయనుంది. 8GB RAM మెమరీ ఫోన్ వర్చువల్ వేరియంట్‌తో వస్తుంది.

Read Also : Apple iPhone 13 Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 13పై సేల్.. రూ. 50వేల ఫోన్ కేవలం రూ. 20వేలకే సొంతం చేసుకోండి..!

లిస్టింగ్‌లో ఈ Itel A60s ఫోన్ ఫొటోలు, డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్, దీర్ఘచతురస్రాకార మాడ్యూల్‌లో LED ఫ్లాష్‌ను కూడా కలిగి ఉన్నాయి. ఇందులో ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. ముందు కెమెరా డిస్ప్లే టాప్ మిడిల్ వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌ కలిగి ఉంది. ఈ ఫోన్ 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజీతో వస్తుందని లిస్టింగ్‌లో ఉంది.Itel A60s గ్రీన్, పర్పల్ అనే రెండు కలర్ ఆప్షన్లలో రానుంది.

Itel A60s Claims to Be India’s First Smartphone

Itel వెబ్‌సైట్‌లోని ప్రొడక్ట్ పేజీలో Itel A60s ఫోన్ 128GB స్టోరేజ్ వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 6.6-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 5,000mAh బ్యాటరీని అందించనుంది. 10W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్ 8MP ప్రైమరీ లెన్స్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ ద్వారా పవర్ అందిస్తుంది.

అదనంగా, షాడో బ్లాక్, సన్‌షైన్ గోల్డ్, మూన్‌లిట్ వైలెట్, గ్లేసియర్ గ్రీన్ అనే 4 విభిన్న కలర్ ఆప్షన్లలో Itel A60s రానుందని వెబ్‌సైట్ పేర్కొంది. ఐటెల్ అధికారిక ప్రారంభ తేదీని ఇంకా ధృవీకరించలేదు. అమెజాన్ జాబితాలో త్వరలో A60s స్మార్ట్‌ఫోన్ రాబోతోందిని పేర్కొంది. అయితే, అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో జూలై రెండో వారంలో Itel A60s లాంచ్ కావచ్చని (MySmartPrice) నివేదిక పేర్కొంది.

Read Also : Nothing Phone 2 Pre-order : ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ (2) ప్రీ-ఆర్డర్ మొదలైందోచ్.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. డోంట్ మిస్..!