NASA : విశ్వం పుట్టుక తెలుస్తుందా ?..నింగిలోకి జేమ్స్ వెబ్ టెలిస్కోప్

బిగ్‌ బ్యాంగ్‌ తర్వాత పరిణామాలు, గెలాక్సీల పుట్టుక, విశ్వ ఆవిర్భావ సంగతుల్ని శోధించేందుకు జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ పనిచేయనుంది...

NASA : విశ్వం పుట్టుక తెలుస్తుందా ?..నింగిలోకి జేమ్స్ వెబ్ టెలిస్కోప్

Nasa Webb

Updated On : December 25, 2021 / 8:46 PM IST

James Webb Space Telescope : అనంత విశ్వంలోని రహస్యాలను తెలుసుకునేందుకు.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ఇది సక్సెస్‌ అయితే విశ్వం పుట్టుకతో పాటు ఏలియన్స్‌ జాడ కూడా తెలిసే అవకాశముందని అంటోంది నాసా. విశ్వం రహస్యాలను తెలుసుకునేందుకు మనిషి.. ఎన్నో ఉపగ్రహాలు పంపించాడు. రోబోటిక్ రోవర్లను ప్రయోగించాడు. టెలిస్కోప్‌లతో ఖగోళ రహస్యాలను శోధించాడు. ప్రపంచానికి సరికొత్త విషయాల్ని తెలియజేశాడు. ఇప్పుడా అన్వేషణలో జేమ్స్‌ వెబ్ టెలిస్కోప్‌తో మరో ముందడుగు వేసింది నాసా.

Read More : Telangana Omicron : తెలంగాణలో ఒమిక్రాన్, 41 కేసుల్లో కోలుకున్నది పది మంది

బిగ్‌ బ్యాంగ్‌ తర్వాత పరిణామాలు, గెలాక్సీల పుట్టుక, విశ్వ ఆవిర్భావ సంగతుల్ని శోధించేందుకు జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ పనిచేయనుంది. హబుల్ టెలిస్కోప్ కంటే మరిన్ని సీక్రెట్స్ చెబుతుందా? అని సైంటిస్టులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, కెనడా స్పేస్‌ ఏజెన్సీల సహకారంతో.. జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ను అభివృద్ధి చేసింది నాసా. దాదాపు 20కి పైగా దేశాలు ఈ టెలిస్కోపు నిర్మాణంలో పని చేశాయ్‌. ఏరియన్‌ 5 స్పేస్‌ రాకెట్‌లో ఫ్రెంచ్‌ గినియాలోని గినియాస్పేస్‌ సెంటర్‌ నుంచి దీన్ని అంతరిక్షంలోకి పంపించారు. దీని నిర్మాణంలో దాదాపు 10వేల మంది సైంటిస్టులు కష్టపడ్డారు.