Human washing Machine : ‘హ్యూమన్ వాషింగ్ మెషిన్’ 15నిమిషాల్లో మీ శరీరాన్ని శుభ్రం చేసి ఆరబెట్టేస్తుంది! ఎలా అంటే?

జపానీస్ కు చెందిన ఓ కంపెనీ సరికొత్త ‘హ్యూమన్ వాషింగ్ మిషన్’ను తయారు చేసింది. ఈ మిషన్ లో మీరు పడుకుంటే ఏం చక్కా అదే మిమ్మల్ని స్నానం చేయించి, ఒంటిపై తడిలేకుండా ఆరబెట్టేస్తుంది.

Human washing Machine

Human washing Machine : రోజూ ఒళ్లు రద్దుకొని స్నానం చేయాలంటే మీకు బద్దకంగా ఉందా.. మీరు శ్రమపడకుండా మిమ్మల్ని శుభ్రంగా వాష్ చేసే మిషన్ ఏదైనా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారా.. అయితే, అలాంటి వారికి సూపర్ గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. జపానీస్ కు చెందిన ఓ కంపెనీ సరికొత్త ‘హ్యూమన్ వాషింగ్ మిషన్’ను తయారు చేసింది. ఈ మిషన్ లో మీరు పడుకుంటే ఏం చక్కా అదే మిమ్మల్ని స్నానం చేయించి, ఒంటిపై తడిలేకుండా ఆరబెట్టేస్తుంది. అదికూడా కేవలం 15 నిమిషాల్లోనే. ఈ మిషన్ ఏఐ సాంకేతికతతో పనిచేస్తోంది. దీనిలో స్నానం చేస్తే స్పా లాంటి అనుభవాన్ని కూడా పొందుతారు. ఇంతకీ ఆ మిషన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది.. ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

Also Read: Donald Trump: అమెరికాలో అక్రమ వలసదారులకు మరోసారి ట్రంప్ వార్నింగ్.. ‘జన్మహక్కు పౌరసత్వం’పై కీలక వ్యాఖ్యలు

ఎప్పుడు లాంచ్ చేస్తారు..?
జపాన్ లోని ఒసాక కేంద్రంగా పనిచేసే ‘సైన్స్ కో’ సంస్థ హ్యూమన్ వాషింగ్ మెషిన్ ను రూపొందించింది. దీనిని 50ఏళ్ల క్రితం డిజైన్ ఆధారంగా తయారు చేశారట. 1970లో జపాన్ వరల్డ్ ఎక్స్‌పో సాన్యో ఎలక్ట్రిక్ కంపెనీ అయిన ప్రస్తుత పానసోనిక్ దీనిని మొదటిసారి తయారు చేసింది. ఈ వెర్షన్ తో పోలిస్తే కొత్త దానిలో అత్యధిక మసాజ్ బాల్స్ వంటివి అమర్చినట్లు తయారీదారు చెబుతున్నారు. ఈ మెషిన్ ఒక మనిషిని కేవలం 15 నిమిషాల్లో శుభ్రం చేసేస్తుందట. ఒసాకా కన్సాయి ఎక్స్ పోలో వెయ్యి మంది అతిథులు ప్రయోగాత్మకంగా దీనిని వాడుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రదర్శన తరువాత మాస్ ప్రొడక్షన్ వెర్షన్ ను 2025లో విడుదల చేస్తామని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. గృహాల్లో వాడుకొనేలా దీనిని తయారు చేయాలని కంపెనీ యోచిస్తోందట. కంపెనీ ఇప్పటికే తన వెబ్ సైట్ లో ఆటోమేటెడ్ బాత్‌టబ్ కోసం ముందుగానే రిజిస్ట్రేషన్లను ఆహ్వానిస్తుంది. సంస్థ చైర్మన్ యసుకి అయోమా దీన్ని ‘బాత్ ఆఫ్ ది ఫ్యూచర్’

Also Read: WhatsApp Reminders : వాట్సాప్ ఆండ్రాయిడ్‌లో బీటా టెస్టర్‌ల కోసం మెసేజ్ రిమైండర్స్ ఫీచర్.. ఇదేలా పనిచేస్తుందంటే?

ఎలా పనిచేస్తుంది.?
♦ మీరు ముందుగా గోరు వెచ్చని నీటితో సగం వరకు నింపి ఉన్న పారదర్శకంగా ఉండే ప్లాస్టిక్ పాడ్ లోకి వెళ్లాలి.
♦ హై-స్పీడ్ వాటర్ జెట్ లు చిన్నచిన్న బుడగలను (బాత్ క్యాప్సూల్) విడుదల చేస్తాయి. ఇవి మీ చర్మాన్ని తాకినప్పుడు పగిలిపోతాయి. తద్వారా మీ శరీరంపై మురికి, మలినాలను ఇవి శుభ్రం చేస్తాయి.
♦ ఏఐ సాంకేతికతో పర్యవేక్షణ ఉంటుంది. నీటి టెంపరేచర్, నీటి ప్రెజర్ ను సర్దుబాటు చేస్తుంది. హైస్పీడ్ జెట్స్ నుంచి ఈ మిషన్ నీటిని వేగంగా విరజిమ్ముతుంది.
♦  ఈ హ్యూమన్ వాషింగ్ మెషిన్ మీ మానసిక ప్రశాంతతపై కూడా దృష్టి పెడుతుంది. ఇది మీ భావోద్వేగ స్థితిని ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ పాడ్ లోపల మిమ్మల్ని ప్రశాంతమైన వాతావరణంలో విశ్రాంతి తీసుకునేలా చేస్తుంది.