Jio Cheapest Plan : నెలవారీ రీఛార్జ్ అక్కర్లేదు.. జియో చీపెస్ట్ ప్లాన్‌తో 336 రోజులు ఎంజాయ్ చేయొచ్చు..!

Jio Cheapest Plan : జియో నెలవారీ రీఛార్జ్ అవసరం లేకుండా సింగిల్ రీఛార్జ్‌తో ఏకంగా 336 రోజుల వరకు అన్ లిమిటెడ్ కాల్స్ ఎంజాయ్ చేయొచ్చు.

Jio Recharge Plans

Jio Cheapest Plan : జియో కస్టమర్లకు గుడ్ న్యూస్.. నెలవారీ రీఛార్జ్‌లతో విసిగిపోయారా? ఇకపై రీఛార్జ్ (Jio Cheapest Plan) టెన్షన్ అక్కర్లేదు.. రిలయన్స్ జియో మీ బడ్జెట్ ధరలోనే అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది.

జియో చీపెస్ట్ ప్లాన్ ద్వారా దాదాపు ఏడాది వరకు అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. జియో నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా అందరికి అందుబాటులో ఉంది.

Read Also : Vivo T4 Ultra 5G : అదిరే ఫీచర్లతో వివో T4 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోందోచ్.. ఈ నెల 11నే లాంచ్.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చంటే?

కంపెనీ వివిధ ప్లాన్ ధరలతో రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. బడ్జెట్-ఫ్రెండ్లీ ప్లాన్‌ కోరుకునే వారికి ఇదే బెస్ట్ ప్లాన్.. ఈ జియో ప్లాన్‌లో 336 రోజుల వరకు వ్యాలిడిటీ పొందవచ్చు.

జియో రూ.1748 ప్లాన్ :

రిలయన్స్ జియో (Jio Cheapest Plan) పోర్ట్‌ఫోలియోలో కేవలం రూ. 1,748 వాయిస్-ఓన్లీ ప్లాన్‌ అందిస్తోంది. జియో ప్లాన్‌తో 336 రోజుల ఫుల్ వ్యాలిడిటీని అందిస్తుంది. ఒకసారి రీఛార్జ్ చేశాక దాదాపు 11 నెలల వరకు మళ్లీ రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు.

ఈ జియో ప్లాన్‌తో అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ అందిస్తుంది. మొత్తం 336 రోజులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ నెట్‌వర్క్‌తోనైనా ఈజీగా కనెక్ట్ అవ్వొచ్చు. ఈ ప్లాన్‌లో మొత్తం 3600 SMS బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.

Read Also : Motorola Razr 50 Ultra : కిర్రాక్ డిస్కౌంట్.. మోటోరోలా మడతబెట్టే ఫోన్ ధర భారీగా తగ్గిందోచ్.. ఇప్పుడే కొనేసుకోండి!

ఈ చీపెస్ట్ ప్లాన్‌తో జియో తమ కస్టమర్లకు అదనపు బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా యూజర్లకు జియో టీవీ, జియోఏఐక్లౌడ్‌తో సహా జియో యాప్‌లకు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తుంది.