Jio New Plans: అద్భుతమైన ప్లాన్స్ తీసుకొచ్చిన జియో
ఐదేళ్లలోనే జియో టెలికాం రంగంలో పెను మార్పులు సృష్టించింది. టాప్ రేంజ్ కు ఎదిగిపోయింది. ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్లతో ఎప్పటికప్పుడు కస్టమర్లకు బెనిఫిట్ కల్పించే జియో...

Raliance Jio
Jio New Plans: ఐదేళ్లలోనే జియో టెలికాం రంగంలో పెను మార్పులు సృష్టించింది. టాప్ రేంజ్ కు ఎదిగిపోయింది. ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్లతో ఎప్పటికప్పుడు కస్టమర్లకు బెనిఫిట్ కల్పించే జియో ఇప్పుడు మరో సరికొత్త రెండు ప్లాన్లను తీసుకొచ్చింది.
వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్స్ (Work From Home Plans) కేటగిరీలో జియో కొత్తగా రూ.2వేల 878, రూ.2వేల 998 ప్లాన్‌లను తీసుకొచ్చింది.
కేవలం డేటా ప్యాక్స్ మాత్రమే
కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ లేకుండా వస్తున్న ఈ ప్లాన్లతో పాటు ప్రస్తుతమున్న బేస్ ప్లాన్‌కు అదనంగా డేటా కావాల్సిన వారు ఈ ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. Work From Home Plans చేస్తున్న వారిని ఉద్దేశించి Jio వీటిని ప్రవేశపెట్టింది. రూ.2వేల 878, రూ.2వేల 998 ప్లాన్‌ల వచ్చే బెనిఫిట్స్..
Read AlSO: జియో వరల్డ్ సెంటర్ వేదికగా 2023 ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సదస్సు
రూ.2878 ప్లాన్
365 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2జీబీ డేటా దక్కుతుంది. మొత్తంగా 730జీబీ డేటా.. రోజులో 2జీబీ హైస్పీడ్ డేటా అయిపోతే ఆ తర్వాత 64కేబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ వాడుకోవచ్చు. ఈ ప్లాన్‌కు SMS, Calls ప్రయోజనాలు ఉండవు.
రూ.2998 ప్లాన్
365 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2.5జీబీ డేటా లభిస్తుంది. మొత్తంగా ఈ ప్లాన్‌తో 912.5జీబీ డేటా దక్కుతుంది. రోజులో 2.5జీబీ డేటా అయిపోతే స్పీడ్ కాస్త తగ్గి 64కేబీఎస్‌కు వస్తుంది. ఇది కూడా డేటా ప్యాక్ మాత్రమే కావడంతో కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఉండవు.
బేస్ ప్లాన్‌కు డైలీ డేటా బూస్ట్‌గా ఈ ప్లాన్‌లు ఉపయోగపడతాయి.