Google Gemini Pro Plan
Jio Users : జియో యూజర్లకు అదిరిపోయే న్యూస్.. రిలయన్స్ జియో గూగుల్ భాగస్వామ్యంతో జెమిని ఏఐ ప్రో ప్లాన్ ప్రవేశపెట్టింది. జియో అన్‌లిమిటెడ్ 5G యూజర్ల కోసం 18 నెలల పాటు లేటెస్ట్ జెమిని 2.5 ప్రో మోడల్‌తో సహా ఏఐ AI ప్రో ప్లాన్ ఆఫర్ చేస్తోంది. ఈ మేరకు గూగుల్ ఒక ప్రకటనలో ధృవీకరించింది.
దాదాపు రూ.35,100 విలువైన ఈ ఆఫర్ మొదట (Jio Users) 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయస్సు గల యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా అన్ని అర్హత కలిగిన జియో సబ్‌స్క్రైబర్‌లకు విస్తరిస్తుంది. అర్హత కలిగిన యూజర్లు ఆఫర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ‘Cliam Now’ బ్యానర్‌పై క్లిక్ చేయడం ద్వారా (MyJio) యాప్ ద్వారా ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.
ఫ్రీ గూగుల్ ఏఐ ప్రో ఆఫర్‌కు ఎవరు అర్హులు? :
జియో ప్రకారం.. ఈ ఆఫర్ రూ. 349 లేదా అంతకంటే ఎక్కువ ధర గల అన్‌లిమిటెడ్ 5G ప్లాన్‌లను వాడే అన్ని ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది. ఫ్రీ ఏఐ బెనిఫిట్స్ కోసం వినియోగదారులు యాక్టివ్ అన్‌లిమిటెడ్ 5G ప్లాన్‌లో ఉండాలి.
గూగుల్ ఏఐ ప్రో ప్లాన్ ఫీచర్లు ఉంటి? :