Aadhaar New Rules : బిగ్ అలర్ట్.. నవంబర్ 1 నుంచి ఆధార్ కొత్త రూల్స్.. ఈ 3 కీలక మార్పులు అమల్లోకి.. ఫుల్ డిటెయిల్స్..!

Aadhaar New Rules : ఆధార్ కొత్త నిబంధనలు నవంబర్ నుంచి అమల్లోకి వస్తాయి. ముఖ్యంగా మూడు కీలక మార్పులు రానున్నాయి.. అవేంటో ఓసారి లుక్కేయండి.

Aadhaar New Rules : బిగ్ అలర్ట్.. నవంబర్ 1 నుంచి ఆధార్ కొత్త రూల్స్.. ఈ 3 కీలక మార్పులు అమల్లోకి.. ఫుల్ డిటెయిల్స్..!

Aadhaar New Rules

Updated On : October 31, 2025 / 4:22 PM IST

Aadhaar New Rules : ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 1, 2025 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఇకపై మీ ఆధార్‌ అప్‌డేట్ మరింత ఈజీ కానుంది. ఇకపై భారీ క్యూలలో నిలబడాల్సిన అవసరం లేదు. అంతేకాదు.. ఆధార్ అప్‌డేట్ కోసం ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ విజిట్ చేయాల్సిన పనిలేదు.

మీ పేరు, అడ్రస్, పుట్టిన తేదీ లేదా (Aadhaar New Rules) మొబైల్ నంబర్ అయినా ఇప్పుడు ప్రతిదీ మీ ఇంటి సౌకర్యం నుంచి ఆన్‌లైన్‌లో ఎడిట్ చేయొచ్చు. ఈ కొత్త నిబంధనలతో ఆధార్ అప్‌డేట్ వివరాలను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయొచ్చు.

మొదటి మార్పు.. ఆధార్ డేటా అప్‌డేట్ :
గతంలో, ఏదైనా ఆధార్ డేటా అప్‌డేట్ కోసం ఆధార్ సర్వీసు సెంటర్‌కు వెళ్లాల్సి ఉండేది. ఇప్పుడు, మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్‌లో చేయవచ్చు. మీరు ఇచ్చిన వివరాలు, పేరు లేదా అడ్రస్ వంటివి, మీ పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా రేషన్ కార్డ్ వంటి అధికారిక ప్రభుత్వ డాక్యుమెంట్లను ఆటోమాటిక్‌గా వెరిఫై అవుతాయి.

ఆధార్ ఫీజు ఎంతంటే? :

  • పేరు, అడ్రస్ లేదా మొబైల్ నంబర్ అప్‌డేట్ ధర రూ. 75
  • ఫింగర్‌ఫ్రింట్స్, ఐరిస్ స్కాన్ లేదా ఫొటో అప్‌డేట్ ధర రూ. 125
  • 5 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వయస్సు గల పిల్లలకు 15 ఏళ్ల నుంచి 17 ఏళ్ల వయస్సు గల పిల్లలకు ఫ్రీ బయోమెట్రిక్ అప్‌డేట్స్
  • జూన్ 14, 2026 వరకు ఫ్రీ ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌డేట్స్, ఆ తర్వాత ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లో రూ. 75 ఖర్చవుతుంది.
  • ఆధార్ రీప్రింట్ అభ్యర్థనలకు రూ. 40
  • ఇంటి రిజిస్ట్రేషన్ సర్వీసు : అదే అడ్రస్‌లో మొదటి వ్యక్తికి రూ. 700, అదనంగా వచ్చే ప్రతి వ్యక్తికి రూ. 350.

రెండో మార్పు : ఆధార్-పాన్ లింక్ తప్పనిసరి :
ప్రతి పాన్ హోల్డర్ డిసెంబర్ 31, 2025 నాటికి తమ పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయాలి. అలా చేయడంలో విఫలమైతే.. జనవరి 1, 2026 నుంచి పాన్ ఇన్ యాక్టివ్ అవుతుంది. ఆర్థిక లేదా పన్ను సంబంధిత ప్రయోజనాల కోసం వినియోగించలేరు. కొత్త పాన్ కార్డ్ దరఖాస్తుదారులకు ఈ ప్రక్రియలో భాగంగా ఆధార్ ధృవీకరణ కూడా అవసరం.

Read Also : LPG Gas Prices : సామాన్యులకు బిగ్ న్యూస్.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. భారీగా తగ్గనున్న LPG గ్యాస్ సిలిండర్ ధరలు?

మూడో కీలక మార్పు, కేవైసీ ప్రక్రియ :
బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు నో యువర్ కస్టమర్ (KYC) విధానం ఈజీ అవుతుంది. మీరు ఇప్పుడు కేవైసీని ఈ విధంగా పూర్తి చేయవచ్చు.

  • ఆధార్ OTP వెరిఫికేషన్
  • వీడియో కేవైసీ
  • ఫేస్ టు ఫేస్ వెరిఫికేషన్
  • పూర్తిగా పేపర్ లెస్ ప్రాసెస్

ఈ మార్పులు ఎందుకు ముఖ్యమంటే? :
ఆధార్ వివరాలను ఇంటి నుంచే అప్‌డేట్ చేసుకోవచ్చు. అయితే, ఆధార్-పాన్ లింక్ గడువు చాలా ముఖ్యం. ఇది మిస్ అయితే ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు. సమస్యలను నివారించేందుకు మీ ఆధార్, పాన్‌ను వెంటనే లింక్ చేయండి. మీ డాక్యుమెంట్లను ఆన్‌లైన్ వెరిఫికేషన్ చేయండి.