LPG Gas Prices : సామాన్యులకు బిగ్ న్యూస్.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. భారీగా తగ్గనున్న LPG గ్యాస్ సిలిండర్ ధరలు?

LPG Gas Prices : సామాన్యులకు బిగ్ న్యూస్.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. భారీగా తగ్గనున్న LPG గ్యాస్ సిలిండర్ ధరలు?

LPG Gas Prices

Updated On : October 31, 2025 / 3:48 PM IST

LPG Gas Prices : సామాన్యులకు అదిరిపోయే న్యూస్.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా LPG గ్యాస్ సిలిండర్ల డెలివరీకి సంబంధించిన కొత్త రూల్స్ మారబోతున్నాయి. ఇప్పుడు గ్యాస్ సిలిండర్లను ఆర్డర్ చేసేందుకు తప్పనిసరిగా OTP అవసరం. గ్యాస్ సిలిండర్ల దొంగతనాలను నివారించడంతో పాటు అసలైన వినియోగదారులను గుర్తించేందుకు చమురు కంపెనీలు కొత్త సిస్టమ్ అమలు చేస్తున్నాయి. డెలివరీ అథెంటికేషన్ కోడ్ (DAC) ద్వారా సిలిండర్ డెలివరీ అవుతుంది.

వినియోగదారుడి మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయకపోతే (LPG Gas Prices) డెలివరీ చేసే వ్యక్తి యాప్ ద్వారా రియల్ టైమ్‌లో అప్‌డేట్ చేసి కోడ్‌ను జనరేట్ చేస్తాడు. ఈ సిస్టమ్ రన్ చేయడంతో అడ్రస్ లేదా మొబైల్ నంబర్ తప్పుగా ఉన్నవారికి సమస్యలు వస్తాయి. తప్పుడు సమాచారం కారణంగా వారి గ్యాస్ సిలిండర్ల డెలివరీ నిలిపివేస్తారు.

క్యూఆర్ కోడ్ స్కానింగ్ :
100 స్మార్ట్ సిటీల తర్వాత ఈ కొత్త సిస్టమ్ ఇతర నగరాల్లో అమలు చేస్తున్నారు. అయితే, ఈ క్యూఆర్ కోడ్ ఓటీపీ సిస్టమ్ వాణిజ్య సిలిండర్లకు వర్తించదు. LPG సిలిండర్లపై QR కోడ్‌ల ద్వారా డెలివరీ ట్రాకింగ్‌ చేయనున్నారు. సబ్సిడీలు మీ ఆధార్-లింక్డ్ అకౌంటుకు నేరుగా బదిలీ అవుతాయి.

తగ్గనున్న ఎల్‌పీజీ గ్యాస్ ధరలు? :
అందిన సమాచారం మేరకు నవంబర్ మొదటి రోజే దేశీయ ఎల్పీజీ సిలిండర్ల ధర తగ్గుతాయని భావిస్తున్నారు. ఎల్పీజీ సిలిండర్ల ధర రూ. 35 నుంచి రూ. 40 తగ్గుతుందని అంచనా. అయితే, ఎల్‌పీజీ సిలిండర్ ధరలు తగ్గుతాయా లేదా అనే దానిపై ఇంకా అధికారిక సమాచారం లేదని గమించాలి.

Read Also : Bank Holidays November : నవంబర్‌లో మీకు బ్యాంకు పని ఉందా? మొత్తం 13 రోజులు బ్యాంకులకు సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడంటే?

భారతీయ పెట్రోలియం కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరను తగ్గిస్తే సాధారణ పౌరులు నేరుగా ప్రయోజనం పొందుతారు. ద్రవ్యోల్బణం నుంచి బిగ్ రిలీఫ్ పొందవచ్చు. ప్రతి నెల మొదటి తేదీన, గ్యాస్, చమురు కంపెనీలు LPG, PNG, CNGలకు భద్రత, ధర, సబ్సిడీ నిబంధనలను సవరిస్తాయి. LPG, CNG, PNG ధరలు మార్పుకు లోబడి ఉంటాయి.

ఏప్రిల్ 8, 2025 నుంచి దేశీయ LPG సిలిండర్ల ధర ఇప్పటివరకూ మారలేదు. న్యూఢిల్లీలో ఈ సిలిండర్ ధర ఇప్పటికీ రూ. 853కు అందుబాటులో ఉంది. వాణిజ్య LPG సిలిండర్ల ధర దాదాపు ప్రతి నెలా మారుతుంది. గత ఐదు ఏళ్లలో డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 594 నుంచి రూ. 853కు పెరిగింది. వాణిజ్య సిలిండర్ ధర రూ. 1,241.5 నుంచి రూ.1,595.50కు పెరిగింది.

నవంబర్ 1, 2020న ఎల్‌పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో కేవలం రూ. 594, కోల్‌కతాలో రూ.620.5, ముంబైలో రూ. 594, చెన్నైలో రూ. 610గా ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డేటా ప్రకారం.. అక్టోబర్ 6, 2021న 14 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 899.50, కోల్‌కతాలో రూ. 926, ముంబైలో రూ. 899.50, చెన్నైలో రూ. 915.50గా ఉంది.

చివరిసారిగా రూ. 50కి పెరిగిన ధరలు :
గత ఏప్రిల్‌లో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 50 పెరిగింది. దాదాపు ఒక ఏడాది తర్వాత ఈ పెరుగుదల కనిపించింది. 2015లో దేశంలో 149 మిలియన్ ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయి. 2025 నాటికి 329 మిలియన్లకు పెరుగుతాయని అంచనా. నలుగురు సభ్యులున్న ప్రతి కుటుంబానికి కనెక్షన్ ఉంది.

అయితే, గత 8 ఏళ్లుగా దేశీయ ఉత్పత్తి 1.2 నుంచి 1.3 మిలియన్ టన్నుల వద్ద స్థిరంగా ఉంది. 2024-25లో ఉత్పత్తి 2.86 మిలియన్ టన్నుల వినియోగంతో పోలిస్తే 1.17 మిలియన్ టన్నులు మాత్రమే నమోదైంది. ఫలితంగా, ఎల్పీజీ దిగుమతులు 10 ఏళ్లలో 20శాతం మేర పెరిగాయి. దేశీయ ధరలు ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌పై ఆధారపడి ఉన్నాయి.