JioBook laptop now on sale for everyone for less than Rs 15,000 in India
JioBook Laptop Sale : ప్రముఖ రిలయన్స్ జియో (JioBook) ల్యాప్‌టాప్ ఇప్పుడు భారత మార్కెట్లో రూ. 15వేల కన్నా తక్కువ ధరకు అందరికీ అందుబాటులో ఉంది. ల్యాప్‌టాప్ కొనుగోలు చేసే వినియోగదారులు చాలా తక్కువ బడ్జెట్‌తో JioBook ల్యాప్‌టాప్ కొనుగోలు చేయవచ్చు. రిలయన్స్ జియో మొట్టమొదటి ల్యాప్‌టాప్‌ను ఈ నెల ప్రారంభంలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) ఈవెంట్‌లో ఆవిష్కరించింది. ఈ డివైజ్ ప్రభుత్వ అధికారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చేసింది.
JioBook ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ. 15,799తో వస్తుంది. అసలు ధరతో పోలిస్తే కొంచెం తక్కువకే అందిస్తుంది. ఈ డివైజ్‌ను ప్రారంభంలో ప్రభుత్వ వెబ్‌సైట్‌లో రూ.19,500కి అందించారు. ల్యాప్‌టాప్ తగ్గింపు ధరలో లిస్టు చేసినట్టు లేదా సాధారణ వినియోగదారులకు తక్కువ ధర పరిధిలో అందుబాటులో ఉంచినట్టు కనిపిస్తోంది. ఆసక్తిగల కొనుగోలుదారులు రిలయన్స్ డిజిటల్ స్టోర్ ద్వారా డివైజ్‌ను పొందవచ్చు. అనేక బ్యాంకు కార్డులపై రూ. 5వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ప్లాట్‌ఫారమ్ ప్రముఖ బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డ్‌లపై ఫ్లాట్ రూ. 3వేల డిస్కౌంట్ ఆఫర్‌ను, క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 5వేల డిస్కౌంట్ అందిస్తోంది.
JioBook laptop now on sale for everyone for less than Rs 15,000 in India
డెబిట్ కార్డ్ హోల్డర్లు కొంత డిస్కౌంట్ కూడా పొందవచ్చు. మీరు రిలయన్స్ డిజిటల్ వెబ్‌సైట్‌లో చెక్ చేయవచ్చు. JioBook పరిమిత బడ్జెట్‌ను కలిగి ఉంది. బ్రౌజింగ్, విద్య వంటి ప్రాథమిక బెనిఫిట్స్ కోసం ల్యాప్‌టాప్ కావాలనుకునే 11.6-అంగుళాల HD డిస్ప్లేతో వస్తుంది. వీడియో కాల్‌ల కోసం.. బ్రాడ్ బెజెల్స్, ముందు భాగంలో 2-MP కెమెరాను కలిగి ఉంది.
Qualcomm Snapdragon 665 SoC ద్వారా ఆధారితమైనది. దీనికి Adreno 610 GPU సపోర్టు అందిస్తుంది. కేవలం 2GB RAMతో వస్తుంది. మల్టీ టాస్కింగ్ దీనిపై సాఫీగా ఉండదు. 128GB వరకు విస్తరించిన 32GB eMMC స్టోరేజీతో వచ్చింది. ల్యాప్‌టాప్ JioOSలో రన్ అవుతుంది. సున్నితమైన పర్ఫార్మెన్స్ కోసం ఆప్టిమైజ్ చేసినట్టు కంపెనీ పేర్కొంది. ప్రొడక్టుల్లో JioStore కూడా ఉంది. ల్యాప్‌టాప్‌లో ఏదైనా థర్డ్ పార్టీ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది.
హుడ్ కింద 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. రిలయన్స్ జియో ఒక్కసారి ఛార్జ్‌పై 8 గంటల బ్యాటరీ లైఫ్ అందించగలదని పేర్కొంది. వేడి తగ్గించేందుకు కూలింగ్ సపోర్టు కూడా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 3.5mm ఆడియో జాక్, బ్లూటూత్ 5.0, HDMI మినీ, Wi-Fi మరిన్ని ఉన్నాయి. ఈ డివైజ్ నుంచి ఎంబెడెడ్ Jio SIM కార్డ్‌తో వస్తుంది. Jio 4G LTE కనెక్టివిటీని ప్రారంభించేందుకు వినియోగదారులను అనుమతిస్తుంది.
Read Also : JioBook Laptop : జియో నుంచి మరో అద్భుతం.. స్పెసిఫికేషన్లు ఇవే..!