JioCinema’s gain is Disney Hotstar’s loss, latter loses over 4 million subscribers
JioCinema Subscribers : ప్రముఖ స్టీమింగ్ యాప్ జియోసినిమా (JioCinema) ఓటీటీ మార్కెట్లో దూసుకుపోతోంది. ఐపీఎల్ ఫ్రీగా అందించడంతో జియోసినిమా స్ట్రీమింగ్ యాప్‌కు ఫుల్ క్రేజ్ వచ్చింది. 2023 మొదటి త్రైమాసికంలో 10 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లతో జియోసినిమా టాప్ ప్లేసులో నిలిచింది. ఇంతకీ జియోసినిమా అంతగా జనాదరణ పొందడానికి ప్రధాన కారణం ఏమిటంటే.. ఈ యాప్ IPLకి ఉచిత యాక్సస్ అందించడమే.. ఇదే భారీ సంఖ్యలో కస్టమర్లను ఆకర్షించేలా చేసింది. మరో ఓటీటీ పోటీదారు డిస్నీ+ హాట్‌స్టార్ (Disney Plus Hotstar)పై మాత్రం గణనీయమైన ప్రభావాన్ని చూపింది.
ఆసియాలో ఈ ఓటీటీ యాప్ సబ్‌స్క్రైబర్ బేస్ భారీగా క్షీణించింది. కేవలం మూడు నెలల్లోనే డిస్నీ స్ట్రీమింగ్ దిగ్గజం 4 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది. అక్టోబర్ 2022 నుంచి 8.4 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కోల్పోయింది. ఇటీవలి నెలల్లో (JioCinema) డిస్నీ హాట్‌స్టార్‌పై పట్టు సాధిస్తోంది. దాంతో కంపెనీ ఆదాయ నివేదిక ప్రకారం.. 2023 మొదటి త్రైమాసికంలో జియోసినిమా 10 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లను చేరుకుంటే.. డిస్నీ హాట్‌స్టార్ మాత్రం 8 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది.
డిస్నీ+ హాట్‌స్టార్ భారీగా పతనం.. :
కంపెనీ ఆదాయ నివేదిక ప్రకారం.. 2023 మొదటి త్రైమాసికంలో, డిస్నీ+ పేమెంట్ సబ్‌స్ర్కైబర్ల సంఖ్య 3.8 మిలియన్లు తగ్గి 57.5 మిలియన్లకు పడిపోయింది. ఈ ఏడాదిలో మొదటి మూడు నెలల్లో 4 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు మరింత తగ్గుముఖం పట్టారు. గత కొన్ని నెలల్లో మొత్తం 8.4 మిలియన్ పేమెంట్ సబ్‌స్ర్కైబర్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ నుంచి వెళ్లిపోయారు. వరుసగా రెండో త్రైమాసిక క్షీణతను ఎదుర్కొంది. ఏప్రిల్ 1, 2023 నాటికి, Disney+ Hotstar 52.9 మిలియన్ల చెల్లింపు సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉంది. అదనంగా, Q2లో, డిస్నీ+ హాట్‌స్టార్‌కు పేమెంట్ సబ్‌స్ర్కైబర్ల సగటు నెలవారీ ఆదాయం 0.74 డాలర్ల నుంచి 0.59 డాలర్లకు 20 శాతం తగ్గింది.
జియోసినిమా యూజర్లకు ఫ్రీ ఐపీఎల్ :
జియో సినిమా విజయానికి అనేక కారణాలున్నాయి. అందులో మొదటిది.. జియో యూజర్లందరికి JioCinema ఉచితంగా సర్వీసులను అందించింది. పేమెంట్ సర్వీసు అయిన డిస్నీ హాట్‌స్టార్ కన్నా జియోసినిమాకు బాగా కలిసొచ్చింది. డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఉన్నప్పుడు జియోసినిమాలో ఐపీఎల్ ఉచితంగా అందించింది. కేవలం సబ్‌స్క్రైబర్‌లు మాత్రమే ఐపీఎల్‌కు యాక్సెస్ కలిగి ఉంటారు. ఏదైనా ఉచితంగా అందిస్తే.. ఎవరు కూడా పేమెంట్ చేసేందుకు ఇష్టపడరు. జియోసినిమా అదే చేసింది.. వినియోగదారులను ఆకట్టుకునేందుకు సర్వీసులను ఉచితంగా అందించింది.
JioCinema Subscribers : JioCinema’s gain is Disney Hotstar’s loss, latter loses over 4 million subscribers
డిస్నీ హాట్‌స్టార్, HBOతో జియో సహకారం :
జియోసినిమా డిస్నీ హాట్‌స్టార్ కన్నా విస్తృతమైన కంటెంట్ ఆప్షన్ కలిగి ఉంది. జియోసినిమాలో అనేక మూవీలు, TV ప్రోగ్రామ్స్, రియల్ కంటెంట్‌ను అందిస్తుంది. అయితే, Disney Hotstar ప్రధానంగా Disney, Pixar, Marvel, Star Wars, National Geographic నుంచి మూవీలు. TV షోలపై దృష్టి సారిస్తుంది. ఇటీవల, రిలయన్స్ జియో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీతో ప్రముఖ హాలీవుడ్ కంటెంట్‌ను స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్, జియోసినిమాకు తీసుకురావడానికి ఒప్పందంపై సంతకం చేసింది. రిలయన్స్ వయాకామ్ 18, వార్నర్ బ్రదర్స్ మధ్య ఈ భాగస్వామ్యం ద్వారా HBO కంటెంట్‌తో పాటు వార్నర్ బ్రదర్స్ షోలు కూడా జియోసినిమాలో అందుబాటులోకి వస్తాయి.
ఇందులో జూ. గేమ్ ఆఫ్ థ్రోన్స్, రాబోయే హ్యారీ పోటర్ సిరీస్ (Harry Potter series) వంటి షోలు యూజర్లను ఆకట్టుకోనున్నాయి. HBO కంటెంట్ గతంలో Disney+ Hotstar యాప్‌లో అందుబాటులో ఉండేది. అయితే, రెండు స్ట్రీమింగ్ కంపెనీల మధ్య భాగస్వామ్యం మార్చి 31న ముగిసింది. డిస్నీ+ హాట్‌స్టార్‌కు సబ్‌స్క్రయిబ్ కావాలంటే HBO గేమ్ ఆఫ్ థ్రోన్స్, సక్సెషన్, ది లాస్ట్ ఆఫ్ అస్ షోలను కూడా పొందవచ్చు. ఈ రెండు దిగ్గజాల మధ్య భాగస్వామ్యం ముగియడంతో ఇందులోని సబ్‌స్ర్కైబర్లు జియోసినిమా వైపు మొగ్గుచూపారు. ఫలితంగా డిస్నీ యూజర్ బేస్ ఒక్కసారిగా పతనమైంది. జియోసినిమా యూజర్ బేస్ టాప్ ప్లేసులోకి దూసుకెళ్లింది.