Jio Annual Plan
Jio Annual Plan : జియో యూజర్ల కోసం అద్భుతమైన వార్షిక ప్లాన్ అందిస్తోంది. జియో రూ. 3599 ప్లాన్ కింద 912GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజువారీ SMS, JioTV, 90 రోజుల పాటు జియోసినిమా ప్రీమియం, క్లౌడ్ స్టోరేజ్‌తో 365 రోజుల సర్వీస్‌ను అందిస్తుంది. ఈ జియో వార్షిక రీఛార్జ్ ప్లాన్ ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే చాలు.. ఏడాదంతా ఎంజాయ్ చేయొచ్చు.
నెలవారీ రీఛార్జ్ అవసరం లేదు :
రిలయన్స్ జియో మీ సిమ్‌ను ఏడాది పొడవునా యాక్టివ్‌గా ఉండేలా కొత్త లాంగ్ టైమ్ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దాంతో 46 కోట్లకు పైగా జియో యూజర్లకు భారీ ఉపశమనం కలిగించింది. తరచుగా రీఛార్జ్‌లతో విసిగిపోయిన యూజర్లందరూ జియో లేటెస్ట్ ఆఫర్ సింగిల్ రీఛార్జ్‌తో 365 రోజుల పాటు సర్వీసులను పొందవచ్చు.
రెండు వార్షిక ప్లాన్లు :
జియో తన పోర్ట్‌ఫోలియోలో కొన్ని దీర్ఘకాలిక వ్యాలిడిటీ ప్లాన్లను ప్రకటించింది. టెలికాం దిగ్గజం ఇప్పుడు రూ.3599, రూ.3999 ధరలకు రెండు వార్షిక రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. ఈ ప్లాన్లలో అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా, OTT సబ్‌స్ర్కిప్షన్ అన్నీ ఒకే ప్యాక్ కింద పొందవచ్చు.
జియో రూ.3599 వార్షిక ప్లాన్ :
రూ. 3599 ప్లాన్ 365 రోజుల పూర్తి వ్యాలిడిటీని అందిస్తుంది. వినియోగదారులు అన్ని నెట్‌వర్క్‌లలో అన్‌లిమిటెడ్ లోకల్, STD కాల్స్, రోజుకు 100 SMS, రోజుకు 2.5GBకి సమానమైన 912GB హై-స్పీడ్ డేటాను పొందవచ్చు. రోజువారీ డేటా లిమిట్ తర్వాత స్పీడ్ 64kbpsకి పడిపోతుంది. ఇందులో జియో ట్రూ 5G సర్వీసులను కూడా పొందవచ్చు.
ఫ్రీ OTT, క్లౌడ్ స్టోరేజీ బెనిఫిట్స్ :
జియో ఓటీటీ బెనిఫిట్స్, క్లౌడ్ స్టోరేజ్ ద్వారా మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు. రూ. 3599 ప్లాన్‌తో వినియోగదారులు జియో సినిమా ప్రీమియం ప్లాన్ 90 రోజుల ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. ఇందుకోసం అదనంగా రూపాయి కూడా ఖర్చు చేయనక్కర్లేదు. సినిమాలు, స్పోర్ట్స్, వెబ్ సిరీస్‌లను చూడొచ్చు. అదనంగా, ఈ ప్లాన్‌లో 50GB జియో AI క్లౌడ్ స్టోరేజ్, జియో టీవీకి ఫ్రీ యాక్సెస్ పొందవచ్చు.
అధిక డేటాకు సరైన ప్లాన్ :
అధిక డేటా వినియోగం అవసరమయ్యే జియో యూజర్లకు ఈ ప్లాన్ బెస్ట్. స్ట్రీమింగ్ కంటెంట్ కూడా యాక్సస్ చేయొచ్చు. ప్రతి నెలా రీఛార్జ్ చేయవలసిన అవసరం లేదు. సినిమా ప్రియులు ఈ ప్లాన్ ఓటీటీ యాక్సెస్, క్లౌడ్ స్టోరేజ్‌తో వస్తుంది.