Vivo V50e Sale : వివో లవర్స్‌కు పండగే.. భారీ బ్యాటరీతో వివో V50e ఫోన్.. ఈ నెల 17 నుంచే ఫస్ట్ సేల్.. డోంట్ మిస్..!
Vivo V50e Price : వివో V50e ఫోన్ ఫస్ట్ సేల్ ఈ నెల 17న ప్రారంభం కానుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ వివో ఫోన్ మీ బడ్జెట్ ధరకే కొనుగోలు చేయొచ్చు.

Vivo V50e Price
Vivo V50e Sale : వివో ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో వివో V50e ఫోన్ రెండు మెమరీ వేరియంట్లలో లభ్యమవుతుంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. వాస్తవానికి, చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో ఇటీవలే వివో V50e భారత మార్కెట్లో లాంచ్ చేసింది.
Read Also : EPFO Alert : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. UMANG యాప్ నుంచి నేరుగా మీ UAN జనరేట్ చేసుకోవచ్చు.. ఇదిగో ఇలా చేయండి!
ఈ స్మార్ట్‌ఫోన్ భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో వస్తుంది. అంతేకాదు.. 3 ఏళ్ల మెయిన్ OS అప్‌డేట్స్, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయి. వివో V50e ఫోన్ మొత్తం సఫిర్ బ్లూ, పెర్ల్ వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎలా పొందాలి? స్పెసిఫికేషన్ల వివరాలను ఓసారి పరిశీలిద్దాం.
Vivo V50e ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో వివో V50e ఫోన్ రెండు మెమరీ వేరియంట్లలో లభ్యమవుతుంది. 8GB+128GB, 8GB+256GB వేరియంట్లు వరుసగా ధర రూ. 28,999, రూ. 30,999కు అందుబాటులో ఉన్నాయి. ఈ వివో 5జీ ఫోన్ ఏప్రిల్ 17, 2025 నుంచి ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో వివో V50e ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. వన్‌ప్లస్, నథింగ్, శాంసంగ్, ఐక్యూ నుంచి వివిధ ఫోన్లు కూడా ఇదే ధరలో లభ్యమవుతున్నాయి.
భారత్‌లో వివో V50e స్పెసిఫికేషన్లు :
వివో V50e ఫోన్ 6.77-అంగుళాల FHD+ క్వాడ్-కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ డిస్‌ప్లే 300Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2160Hz PWM డిమ్మింగ్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.
మీడియాటెక్ డైమన్షిటీ 7300SoC ద్వారా 128GB వరకు యూఎఫ్ఎస్ 2.2 ఇంటర్నల్ స్టోరేజ్, 8GB (LPDDR4X) ర్యామ్‌తో వస్తుంది. ఈ వివో ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్OS 15 అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో రన్ అవుతుంది. 4 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ పొందవచ్చు.
బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ IMX882 సెన్సార్ (OIS)తో 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల విషయానికి వస్తే.. ఫ్రంట్ సైడ్ 50MP సెన్సార్ ఉంది. స్మార్ట్‌ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5600mAh బ్యాటరీని అందిస్తుంది. సెక్యూరిటీ విషయానికి వస్తే.. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ వివో ఫోన్ IP68, IP69 సర్టిఫికేషన్‌తో వస్తుంది.