EPFO Alert : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. UMANG యాప్ నుంచి నేరుగా మీ UAN జనరేట్ చేసుకోవచ్చు.. ఇదిగో ఇలా చేయండి!
EPFO Alert : ఏదైనా కంపెనీలో కొత్త ఉద్యోగి కోసం ఆధార్ ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ (FAT) ఉపయోగించి UAN జనరేట్ చేసేందుకు ఉమాంగ్ యాప్‌ను ఉపయోగించవచ్చు.

EPFO Alert
EPFO Alert : ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ శుభవార్త.. ఉద్యోగ విరమణ నిధి సంస్థ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కొత్త అథెంటికేషన్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉద్యోగుల తమ సభ్యత్వానికి సంబంధించి ఇప్పుడు ప్రావిడెంట్ ఫండ్ ఖాతా నంబర్ (UAN) సేవలను ఫేస్ అథెంటికేషన్ ద్వారా జనరేట్ చేసుకోవచ్చని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గతంలో, ఒక కంపెనీ HR విభాగం ఈ UAN జనరేట్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు ఉద్యోగులే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.
ఉద్యోగుల కోసం ఈపీఎఫ్ఓ ఫేస్ అథెంటికేషన్ ఉపయోగించి UAN కేటాయింపు, యాక్టివేషన్ కోసం మెరుగైన డిజిటల్ సర్వీసులను ప్రవేశపెట్టిందని కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా చెప్పారు. కోట్లాది మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు కాంటాక్ట్‌లెస్, సురక్షితమైన పూర్తిగా డిజిటల్ సర్వీస్ అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఆయన తెలిపారు.
ఇప్పుడు ఉద్యోగి ఉమాంగ్ మొబైల్ యాప్ ద్వారా ఆధార్ ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ (FAT)ని ఉపయోగించి నేరుగా UAN జనరేట్ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఏదైనా కొత్త ఉద్యోగి కోసం ఆధార్ ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ (FAT) ఉపయోగించి UAN రూపొందించడానికి ఏ కంపెనీ ఎంప్లాయర్ అయినా అదే ఉమాంగ్ యాప్‌ను ఉపయోగించవచ్చు.
UAN నంబర్ ఎలా జనరేట్ చేయాలంటే? :
- మీరు యూఏఎన్ జనరేట్ చేసేందుకు (UMANG) యాప్‌ను ఓపెన్ చేయాలి.
- ఫేస్ అథెంటికేషన్ ద్వారా UAN కేటాయింపు, యాక్టివేషన్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి.
- ఆధార్ ఆధారిత వెరిఫికేషన్ తర్వాత యూఏఎన్ జనరేట్ అవుతుంది.
- మీ ఆధార్ డేటాబేస్‌లో పేర్కొన్న మొబైల్ నంబర్‌కు SMS ద్వారా UAN నెంబర్ వస్తుంది.
యూఏఎస్ జనరేట్ చేసిన తర్వాత ఉద్యోగి (UMANG) యాప్ లేదా మెంబర్ పోర్టల్ నుంచి యూఏఎన్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ కొత్త ప్రక్రియతో ముఖ్యంగా ఫేస్ అథెంటికేషన్ ఉపయోగించి ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ వంద శాతం పూర్తి చేయొచ్చు.
ఇప్పటికే UAN జనరేట్ అయి ఉండి ఇంకా యాక్టివేట్ చేసుకోని సభ్యులు ఇప్పుడు ఉమాంగ్ యాప్ ద్వారా తమ UAN సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చని మంత్రి వివరించారు. డెమోగ్రాఫిక్ లేదా OTP-ఆధారిత అథెంటికేషన్ వంటి ఇతర పద్ధతులతో పోలిస్తే.. ఫేస్ అథెంటికేషన్ ఉపయోగించి బయోమెట్రిక్ అథెంటికేషన్ హై-లెవల్ సెక్యూరిటీని అందిస్తుంది.
ఈ సేఫ్ వెరిఫికేషన్ ప్రక్రియ ద్వారా పీఎఫ్ సభ్యులు వైడ్ రేంజ్ సెల్ఫ్ సర్వీసు ఆప్షన్లను ఎంచుకోవచ్చు. భవిష్యత్తులో అనేక పీఎఫ్ సర్వీసుల్లో ఎంప్లాయర్ లేదా మీ ఆఫీసుతో అవసరం లేకుండా పని పూర్తి చేసుకోవచ్చు.