JioTV Premium Plans announced at a starting price of Rs 398_ Pricing, benefits, list of OTT, and more
JioTV Premium Plans : ప్రముఖ టెలికాం బ్రాండ్ అయిన రిలయన్స్ జియో కొత్త జియోటీవీ ప్రీమియం ప్లాన్‌లను ప్రారంభించింది. ఈ ప్లాన్ల ద్వారా విస్తృత శ్రేణి ఓవర్-ది-టాప్ (OTT) కంటెంట్‌ను పూర్తి స్థాయిలో యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ జియో టీవీ ప్రీమియం ప్లాన్‌లను విభిన్న యాప్‌ల నుంచి విభిన్న టీవీ షోలు, మూవీలను యాక్సస్ చేయొచ్చు. ఈ ప్రీమియం ప్లాన్ ప్రారంభ ధర కేవలం రూ. 398 మాత్రమే.. ఆన్‌లైన్‌లో వివిధ ప్లాట్ ఫారంల నుంచి ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ ఓటీటీ కంటెంట్‌ను ఎంజాయ్ చేయొచ్చు.
జియోటీవీ ప్లాన్లు, వ్యాలిడిటీ వివరాలు :
ఈ ప్రీమియం ప్లాన్‌లతో ఇకపై ప్రతి యాప్‌కు ప్రత్యేక సబ్‌స్ర్కిప్షన్ కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. ఇకపై చాలా పాస్‌వర్డ్‌లను ఉఫయోగించడం లేదా వివిధ లాగిన్‌లను గుర్తుంచుకోవాల్సిన పనిలేదు. మీరు వివిధ యాప్‌ల నుంచి మీకు కావలసిన అన్ని అంశాలను ఒకే చోట యాక్సస్ చేసుకోవచ్చు. అదే జియోటీవీ యాప్. ఈ యాప్ అందించే ప్లాన్‌లు రూ. 398 నుంచి ప్రారంభమవుతాయి. దీని వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది.
అలాగే, రూ. 1198 ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులతో వస్తుంది. రూ. 4498 ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. లైనప్‌లోని చౌకైన ప్లాన్ 2జీబీ డేటాతో పాటు 12 ఓటీటీ యాప్‌లకు యాక్సెస్‌తో వస్తుంది. అయితే, ఇతర ప్లాన్‌లు 14 ఓటీటీ యాప్‌లకు యాక్సెస్‌తో పాటు 2జీబీతో వస్తాయి. వార్షిక ప్లాన్లలో ప్రైమరీ యూజర్ ప్రొటెక్షన్ సపోర్టును కూడా కూడా పొందవచ్చు.
నెల వారీగా ప్రీమియం ప్లాన్లు :
ఈ ప్రీమియం ప్లాన్‌లు మీ వ్యూ ఎక్స్‌పీరియన్స్ మరింత మెరుగుపరచడానికి అనేక ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఇందుకోసం అనేక ఆప్షన్లు ఉన్నాయి. మీరు నెల, ప్రతి మూడు నెలలకు లేదా సంవత్సరానికి ఒకసారి చెల్లించేలా ఆప్షన్లను ఎంచుకోవచ్చు. అదనంగా, వార్షిక ప్లాన్ తీసుకుంటే.. మీరు త్వరిత కస్టమర్ సర్వీసు, ఇన్‌స్టాల్‌మెంట్ పేమెంట్ ఆప్షన్ల వంటి అదనపు సహాయం పొందవచ్చు.
JioTV Premium Plans
మీ ప్లాన్ వ్యాలిడిటీ ఎంతకాలం ఉండాలో దానికి అనుగుణంగా ప్లాన్లను ఎంచుకోవచ్చు. ఆ మొత్తానికి మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఆపై మీ జియో మొబైల్ నంబర్‌ని ఉపయోగించి జియోటీవీ యాప్‌కి లాగిన్ చేయండి. ఆ తర్వాత, మీకు జియోటీవీ ప్రీమియం సెక్షన్ కనిపిస్తుంది. ఒకసారి లాగిన్ అయితే మళ్లీ మళ్లీ లాగిన్ చేయాల్సిన అవసరం ఉండదు.
ప్రీమియం ఓటీటీ కంటెంట్ పొందాలంటే? :
అదేవిధంగా, జియోసినిమా ప్రీమియం, అమెజాన్ ప్రైమ్ వీడియో (మొబైల్ ఎడిషన్) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి కొన్ని యాప్‌లను కూడా యాక్సస్ చేసుకోవచ్చు. మీరు జియోసినిమా ప్రీమియంలోకి ప్రవేశించడానికి మైజియో నుంచి కూపన్‌ని ఉపయోగించవచ్చు. అమెజాన్ ప్రైమ్ యాక్సస్ కోసం మైజియో ద్వారా యాక్టివేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, మీరు యాప్‌లోకి లాగిన్ అయిన తర్వాత డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓపెన్ అవుతుంది.