Carens X Line: న్యూ మోడల్ కారెన్స్ ఎక్స్-లైన్‌‭ను విడుదల చేసిన కియా

మా ఉత్పత్తుల విలక్షణమైన గుర్తింపు మాకు ఒక ఆకాంక్షాత్మక బ్రాండ్‌గా మారడానికి సహాయపడింది. కొనుగోలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు విలక్షణమైన, ప్రత్యేకమైన ఉత్పత్తులను పరిగణనలోకి తీసుకునే నూతన యుగపు కొనుగోలుదారులను మేము చూస్తున్నాము

Carens X Line: దేశంలోని అగ్రగామి ప్రీమియం కార్ల తయారీదారులలో ఒకటైన కియా ఇండియా, మంగళవారం కారెన్స్ శ్రేణిలో ప్రత్యేకమైన ఎక్స్-లైన్ ట్రిమ్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ. 18.94 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఇది పెట్రోల్ 7DCT, డీజిల్ 6AT ఖ్నంటూ రెండు వేరియంట్‌లను అందిస్తుంది. ఇవి 6-సీటర్ కాన్ఫిగరేషన్‌లో లభిస్తాయి. వీటి ధరలు వరుసగా రూ.18,94,900, రూ. 19,44,900గా కంపెనీ నిర్ణయించింది.

X-లైన్ ఆవిష్కరణ గురించి కియా ఇండియా చీఫ్ సేల్స్ మ్యూన్గ్ సిక్ సోహాన్ (Myung-sik Sohn) మాట్లాడుతూ, “మా ఉత్పత్తుల విలక్షణమైన గుర్తింపు మాకు ఒక ఆకాంక్షాత్మక బ్రాండ్‌గా మారడానికి సహాయపడింది. కొనుగోలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు విలక్షణమైన, ప్రత్యేకమైన ఉత్పత్తులను పరిగణనలోకి తీసుకునే నూతన యుగపు కొనుగోలుదారులను మేము చూస్తున్నాము. కాబట్టి మేము ఈ ట్రిమ్‌ను మా ఇండియా కార్ ఆఫ్ ది ఇయర్ – కియా కారెన్స్ కు విస్తరించాలని నిర్ణయించుకున్నాము. మేము ఇప్పటికే 100,000 కస్టమర్లతో పెరుగుతున్న కారెన్స్ కుటుంబాన్ని కలిగి ఉన్నాము. X-లైన్ దానిని గణనీయంగా విస్తరిస్తుంది” అని అన్నారు.

ఇవి కూడా చదవండి..

WhatsApp Ban Indian Accounts : ఆగస్టు 2023లో 74 లక్షలకు పైగా భారతీయ అకౌంట్లు బ్యాన్.. ఆన్‌లైన్ స్కామ్‌లపై రిపోర్టు చేయాలంటే?

Flipkart Festival Sale 2023 : ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఈ 5G స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!