WhatsApp Ban Indian Accounts : ఆగస్టు 2023లో 74 లక్షలకు పైగా భారతీయ అకౌంట్లు బ్యాన్.. ఆన్‌లైన్ స్కామ్‌లపై రిపోర్టు చేయాలంటే?

WhatsApp Ban Indian Accounts : ఆగస్టు 2023లో వాట్సాప్ 74 లక్షలకు పైగా భారతీయ అకౌంట్లను నిషేధించింది. మీరు ఆన్‌లైన్ స్కామ్‌లను ఎలా గుర్తించాలి? రిపోర్టు చేయాలంటే?

WhatsApp Ban Indian Accounts : ఆగస్టు 2023లో 74 లక్షలకు పైగా భారతీయ అకౌంట్లు బ్యాన్.. ఆన్‌లైన్ స్కామ్‌లపై రిపోర్టు చేయాలంటే?

WhatsApp bans over 74 lakh Indian accounts in August

WhatsApp Ban Indian Accounts : ఆగస్ట్ 2023లో వాట్సాప్ 74 లక్షలకు పైగా భారతీయ అకౌంట్లను నిషేధించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021లోని రూల్ 4(1)(d)కి అనుగుణంగా ఈ అకౌంట్లను నిషేధించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021 ప్రకారం.. లేటెస్ట్ నెలవారీ రిపోర్టులో (Whatsapp Monthly Reports) భారతీయ యూజర్ల (Whatsapp Users) నుంచి వచ్చిన ఫిర్యాదులు, భారత్‌లో అకౌంట్ ఉల్లంఘనలు, ఫిర్యాదుల నుంచి వచ్చిన ఆదేశాలకు ప్రతిస్పందనగా వాట్సాప్ తీసుకున్న చర్యలను ప్లాట్‌ఫారమ్ వెల్లడిస్తుంది. కమిటీ (GAC), వినియోగదారు ఫిర్యాదులు, చట్ట ఉల్లంఘనలు, నియంత్రణ సమ్మతిని కలిగి ఉంటుంది.

ముందుస్తుగా 35 లక్షల అకౌంట్లపై నిషేధం :
నివేదిక ప్రకారం.. వాట్సాప్ ఆగస్ట్ 1, 31 మధ్య 7,420,748 భారతీయ అకౌంట్లను నిషేధించింది. ఇందులో, (Meta) యాజమాన్య ప్లాట్‌ఫారమ్ యూజర్ల నుంచి నివేదికల కోసం వేచి ఉండకుండా 3,506,905 భారతీయ అకౌంట్లను ముందస్తుగా నిషేధించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించే అవకాశం ఉన్న అకౌంట్లను గుర్తించడం ద్వారా వాట్సాప్ తన ప్లాట్‌ఫారమ్ నియమాలు, విధానాలను అమలు చేసేందుకు ఈ ముందస్తు చర్య తీసుకుంది. యూజర్ రిపోర్టు (Whatsapp Users Reports) చేసిన ఉల్లంఘనలపై మాత్రమే ఆధారపడకుండా ప్లాట్‌ఫారమ్ మరిన్ని భద్రత చర్యలను చేపట్టింది.

యూజర్ల ఫిర్యాదులతో 17 అకౌంట్లపై చర్యలు :
వాట్సాప్ ప్లాట్‌ఫారమ్‌కు 14,767 ఫిర్యాదుల రిపోర్టులు అందాయి. వాటి నుంచి 17 అకౌంట్లపై చర్యలు తీసుకుంది. వాట్సాప్ దుర్వినియోగం, స్పామ్‌తో ఎలా వ్యవహరిస్తుందో కూడా వివరిస్తుంది. యూజర్ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో హానికరమైన ప్రవర్తనను నిరోధించడానికి ముందస్తు చర్యలు తీసుకుంటుంది. హానికరమైన లేదా దుర్వినియోగ అకౌంట్లను గుర్తించడానికి, వాట్సాప్ అకౌంట్ 3 కీలక దశల్లో పనిచేస్తుంది. అందులో రిజిస్టర్, మెసేజ్, నెగటివ్ రెస్పాన్స్, యూజర్ల రిపోర్టులు, బ్లాక్‌ల రూపంలో అందుకుంటుంది.

Read Also : Apple iPhone 13 Sale : కొత్త ఐఫోన్ కావాలా? ఆపిల్ ఐఫోన్ 13పై భారీ తగ్గింపు.. రూ.40వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు!

వాట్సాప్ టీమ్ ఆటోమేటెడ్ సిస్టమ్‌లు సంక్లిష్టమైన లేదా అసాధారణమైన కేసులను ట్రాక్ చేస్తాయి. యూజర్ ఫీడ్‌బ్యాక్‌పై తప్పుడు సమాచారాన్ని నిరోధించడంతో పాటు సైబర్‌ సెక్యూరిటీని ప్రోత్సహించడంలో నిపుణులతో కలిసి పనిచేస్తామని వాట్సాప్ ప్రతినిధి తెలిపారు. వాట్సాప్ ప్లాట్‌ఫారంలో స్కామ్‌లను ఎదుర్కోవడానికి, స్కామ్‌లను రిపోర్టు చేయడానికి యూజర్ల కోసం కొన్ని టిప్స్ అందిస్తోంది. అవేంటో ఓసారి చూద్దాం.. ఉన్నాయి.

వాట్సాప్‌లో స్కామ్ అకౌంట్ల (Whatsapp Scam Accounts)ను ఎలా గుర్తించాలి? :
1. ఫేక్ జాబ్ ఆఫర్లు : స్కామర్లు బాధితుల నమ్మించేందుకు ఆకర్షణీయమైన ఉద్యోగ అవకాశాలను, డబ్బును ముందస్తుగా అందిస్తారు. బాధితులు పెట్టుబడి పెడితే, స్కామర్‌లు వారి డబ్బు లేదా సున్నితమైన డేటాతో అదృశ్యమైపోతారు. అలాంటి స్కామర్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

2. ఫేక్ గిఫ్ట్స్ : మెసేజ్, ఇమెయిల్ IDలను షేర్ చేయడానికి బదులుగా iPhone 15 వంటి గిఫ్ట్స్ అందిస్తామంటూ వాట్సాప్ ఫార్వార్డ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈ లింక్‌లు తరచుగా పర్సనల్ డేటాను దొంగిలిస్తారు. ఇలాంటి వారిని నమ్మవద్దు.

WhatsApp bans over 74 lakh Indian accounts in August

WhatsApp bans over 74 lakh Indian accounts in August

3. అనుమానాస్పద యాప్‌లు : స్కామర్‌లు బ్యాంక్ యాప్ ఫైల్‌లను హానికరమైన కోడ్‌తో పంపిస్తారు. బాధితులను తమ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేయమని అడుగుతారు. తద్వారా సున్నితమైన బ్యాంకింగ్ సమాచారాన్ని షేర్ చేయమని చెప్పి మోసగిస్తారు. ఇలాంటి ఫేక్ యాప్‌లను ఎప్పుడూ ఇన్‌స్టాల్ చేయవద్దు.

4. ఓవర్సీస్ కాల్స్ : గుర్తుతెలియని విదేశీ నంబర్ల నుంచి కాల్‌లను విస్మరించండి. వెంటనే బ్లాక్ చేయండి. వాట్సాప్ ఈ కాల్‌లను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటుంది. కానీ, మీకు ఒకటి వస్తే ఎట్టిపరిస్థితుల్లో ఆన్సర్ చేయొద్దు.

5. యాదృచ్ఛిక లింక్‌లను క్లిక్ చేయడం మానుకోండి : హ్యాకర్లు మాల్‌వేర్ లింక్‌లను యూజర్లకుపంపుతారు. ఫిషింగ్ వెబ్‌సైట్‌లు లేదా మాల్వేర్‌లతో నిండి ఉంటాయి. గుర్తుతెలియని వ్యక్తి మీకు లింక్‌లను పంపినప్పుడు లేదా అత్యవసరంగా మిమ్మల్ని క్లిక్ చేయమని కోరినప్పుడు జాగ్రత్తగా ఉండండి. వాట్సాప్ స్కామ్‌ల నుంచి సురక్షితంగా ఉండటానికి టూ-ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ ఎనేబుల్ చేయండి. గుర్తుతెలియని వారితో మీ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయొద్దు.

వాట్సాప్ అకౌంట్‌పై ఎలా రిపోర్టు చేయాలి? :
* వాట్సాప్ యూజర్ల అకౌంట్లలో మీరు రిపోర్టు చేయాలనుకునే అకౌంట్‌తో చాట్‌ని ఓపెన్ చేయండి.
* చాట్ ఎగువన ఉన్న యూజర్ నేమ్‌పై నొక్కండి.
* ‘Report’ అనే బటన్ Tap చేయండి.
* మీరు అకౌంట్ ఎందుకు రిపోర్టు చేస్తున్నారో కారణాన్ని ఎంచుకోండి.
* ‘Send’ ఆప్షన్ Tap చేయండి.

Read Also : Flipkart Festival Sale 2023 : ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఈ 5G స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!