Kia India: కియా ఇండియా నుంచి మరో సూపర్ మోడల్

వారాల వ్యవధిలో మార్కెట్లోకి రిలీజ్ అవుతున్న ఆటోమొబైల్ రంగాన్ని కొత్త ప్రొడక్ట్‌లతో రెడీ చేస్తుంది. రీసెంట్‌గా కియా ఇండియా దేశంలో మధ్య తరహా కియా సెల్టోస్ ఎస్‌యూవీ కారును....

Kia India: కియా ఇండియా నుంచి మరో సూపర్ మోడల్

Kia India Seltos

Updated On : September 1, 2021 / 7:15 PM IST

Kia India: వారాల వ్యవధిలో మార్కెట్లోకి రిలీజ్ అవుతున్న ఆటోమొబైల్ రంగాన్ని కొత్త ప్రొడక్ట్‌లతో రెడీ చేస్తుంది. రీసెంట్‌గా కియా ఇండియా దేశంలో మధ్య తరహా కియా సెల్టోస్ ఎస్‌యూవీ కారును విడుదల చేసింది. 18 అంగుళాల క్రిస్టల్ కట్ మ్యాటె గ్రాఫైట్ అల్లోయ్ వీల్స్ తో లాంచ్ చేశారు. సెల్టోస్ ఎస్యూవీకి X lineను ఇంట్రడ్యూస్ చేశారు. పైగా ఇది ఎక్స్‌క్లూజివ్ మ్యాటె గ్రాఫైట్ కలర్ లో ఉంది.

అంతేాకుండా ఇంటీరియర్ లో ఇండిగో పేరా లెథరాటెతో డిజైన్ చేశారు. సెల్టోస్ ఎక్స్ లైన్ ప్రత్యేకంగా జీ1.4 టీ-జీడీఐ 7 డీసీటీ, డీ1.5 6 ఎటీ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్లతో అందుబాటులో ఉంటుందని కియా ఇండియా ప్రకటనలో వెల్లడించింది.

Seltos

Seltos

పెట్రోల్ ఎక్స్ లైన్ 7 డీసీటీ ట్రిమ్ ధర రూ.17.79 లక్షలు కాగా, డీజిల్ ఎక్స్ లైన్ 6 ఏటీ వేరియంట్ ధర రూ.18.10 లక్షలుగా ఉంది. కియా సెల్టోస్ ఎక్స్ లైన్ 1.4-లీటర్ స్మార్ట్ స్ట్రీమ్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ సీఆర్ డీఐ విజీటీ డీజిల్ మోటార్ వేరియంట్ అందుబాటులో ఉన్నాయి. సెల్టోస్ ప్రారంభించినప్పటి నుండి దాని విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న వాహనాలలో ఒకటిగా ఉంది.

Seltos 123

Seltos 123

నెలకు సగటున 16వేల వెహికల్స్ అమ్ముతున్న కియా ఇండియా.. ఇప్పటి వరకూ 1.3లక్షల వెహికల్స్ అమ్మిందని ఎగ్జిక్యూటివ్ డైరక్టర్, చీఫ్ సేల్స్ అండ్ బిజినెస్ స్ట్రాటజీ ఆఫీసర్ తే జిన్ పార్క్ అన్నారు.

Seltos

Seltos