Debit Card EMI : ఈ బ్యాంకు డెబిట్ కార్డుతో షాపింగ్, క్రెడిట్ కార్డు ప్రయోజనాలు
డెబిట్ కార్డుతో చేసిన బిల్లును ఈఎంఐలుగా మార్చేసుకుని..బడ్జెట్ కు అనుగుణంగా...వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పిస్తోంది.

Kotak
Kotak Mahindra Bank : బ్యాంకులు డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు కస్టమర్లకు అందిస్తుంటాయి. డెబిట్ కార్డులపై ఈఎంఐ సదుపాయం కల్పిస్తుంటాయి. అయితే క్రెడిట్ కార్డు అవసరం లేకుండా..దీనికి సంబంధించిన ప్రయోజనాలు అందిస్తోంది ఓ బ్యాంకు. డెబిట్ కార్డుతో చేసిన బిల్లును ఈఎంఐలుగా మార్చేసుకుని..బడ్జెట్ కు అనుగుణంగా…వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పిస్తోంది. ఆ బ్యాంకే ‘కొటాక్’..‘కొటక్ స్మార్ట్ ఇనిషియేటివ్’ స్కీమ్ లో భాగంగా…డెబిట్ కార్డుతో షాపింగ్ చేస్తే క్రెడిట్ కార్డు ప్రయోజనాలు కల్పిస్తోంది. డెబిట్ కార్డుతో చేసిన బిల్లును EMIలుగా మార్చుకోవచ్చు.
Read More : PM Modi : బాలికలకు గుడ్ న్యూస్, ఇక సైనిక్ స్కూళ్లలో ఎంట్రీ
ఈ స్కీమ్ లో భాగంగా..ఏమి కొనుకోవచ్చు..ఈఎంఐ ఎలా ?
కొటక్ స్మార్ట్ ఇనిషియేటివ్ స్కీమ్ లో వినియోగదారులు ఫ్యాషన్ యాక్ససరీస్, కిరాణా సామాగ్రీ, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయవచ్చు. వీటికి సంబంధించిన బిల్లును డెబిట్ కార్డు ద్వారా పే చేస్తూ..ఈఎంఐగా మార్చుకోవచ్చు. అయితే..ఈ అవకాశం రావాలంటే..తప్సనిసరిగా రూ. 5 వేలకు పైగా షాపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. డెబిట్ కార్డు ఈఎంఐకి అర్హులైతే బ్యాంకు నుంచి సంబంధిత ఎస్ఎంఎస్ వస్తుంది. మీ లావాదేవీలను రివ్యూ చేసిన అనంతరం ఈఎంఐ సదుపాయం ఎన్ని నెలలు ఇవ్వాలనేది బ్యాంకు డిసైడ్ చేస్తుంది.
Read More : Meera Mitun: అరెస్ట్ చేశారో కత్తితో పొడుచుకు చస్తా.. నటి బెదిరింపులు
ఈఎంఐ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే…రిక్వెస్ట్ చేయాలి. వస్తువులు కొనుగోలు చేసిన అనంతరం ఆటోమెటిక్ మీ అకౌంట్ నుంచి ఎంత ఈఎంఐ చెల్లిస్తారో అంతే కట్ అవుతుంది. వినియోగదారులు ఆఫ్ లైన్ లేదా..ఆన్ లైన్ లో డెబిట్ కార్డుతో రూ. 5 వేల వరకు షాపింగ్ చేసుకోవచ్చు.