Lava Blaze 2 Launch : రూ.8,999కే లావా బ్లేజ్ 2 ఫోన్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ఇప్పుడే కొనేసుకోండి..!
Lava Blaze 2 Launch : అత్యంత సరసమైన ధరకే లావా బ్లేజ్ 2 (Lava Blaze 2) ఫోన్ వచ్చేసింది. ఈ ఫోన్ ప్రీమియం గ్లాస్ ఫినిషింగ్, పంచ్-హోల్ డిస్ప్లేను కలిగి ఉంది. కేవలం రూ.8,999కే సొంతం చేసుకోండి.

Lava Blaze 2 Launch in India (Photo : Lava India)
Lava Blaze 2 Launch : ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ కంపెనీ లావా (Lava) భారత మార్కెట్లో కొత్త బ్లేజ్ 2 ఫోన్ లాంచ్ చేసింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ధర రూ. 8,999గా నోయిడాకు చెందిన టెక్ కంపెనీ లావా నిర్ణయించింది. అయితే, భారత మార్కెట్లో ఈ ఫోన్ అధికారిక సేల్ అమెజాన్ (Amazon Sale), లావా ఇండియా (Lava India) ఛానెల్ ద్వారా ఏప్రిల్ 18 నుంచి ప్రారంభం కానుంది. లేటెస్టు డివైజ్ ద్వారా భారతీయ టెక్ బ్రాండ్ (Motorola), (Realme) అందించే బడ్జెట్ ఆఫర్లతో పోటీపడుతుంది. ఈ కొత్త Lava Blaze 2 ఫోన్ 5G సపోర్టు చేయదు. భారతీయ మొబైల్ కస్టమర్లలో తప్పనిసరిగా ఉండాల్సిన ఫోన్ అని చెప్పవచ్చు. మీకు 5G డివైజ్ కావాలంటే.. (Lava Blaze 5G) ఫోన్ మరింత సరసమైన ధర రూ.11,999కి అందిస్తుంది.
లావా బ్లేజ్ 2 సరసమైన ధరలో ఫోన్ బిల్డ్ మెటీరియల్ అందిస్తోంది. ప్రీమియం గ్లాస్ ఫినిషింగ్, పంచ్-హోల్ డిస్ప్లేను కలిగి ఉంది. ఈ కేటగిరీలోని స్మార్ట్ఫోన్లలో అసాధారణమే. గత ఏడాదిలో మోటోరోలా (Moto G22)ను మరింత సాధారణ వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌కు బదులుగా హోల్-పంచ్ డిస్ప్లేతో ప్రవేశపెట్టింది. అయినప్పటికీ, మోటరోలా ఫోన్లో ప్లాస్టిక్ బిల్డ్‌ను కలిగి ఉంది.
బడ్జెట్ ఫోన్లలో సాధారణ మెటీరియల్.. అందుకే మరింత సరసమైన ధరకే అందించనుంది. లావా బ్లేజ్ 2 బ్లోట్-ఫ్రీ ఆండ్రాయిడ్ యూజర్ స్మార్ట్‌ఫోన్ అని చెప్పవచ్చు. ఇందులో అవసరమైన యాప్‌ను మాత్రమే పొందవచ్చు. Gmail, Settings, కెమెరా వంటి కొన్ని డిలీట్ చేయలేని స్టాక్ Android యాప్స్ ఉండవచ్చు. కొన్ని ప్రీ-ఇన్స్టాల్డ్ యాప్‌లు కూడా ఉండవచ్చు. లావా లేటెస్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 అప్‌గ్రేడ్, రెండు ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్తో వస్తుందని పేర్కొంది.

Lava Blaze 2 Launch in India (Photo : Lava India)
స్పెసిఫికేషన్ల పరంగా పరిశీలిస్తే.. లావా Blaze 2 ఫోన్ 6.5-అంగుళాల HD+ IPS డిస్ప్లేతో 90Hz రిఫ్రెష్ రేట్, 2.5D కర్వ్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ వెనుకవైపు, లావా Blaze 2 ఫోన్ 13-MP డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాలింగ్ చేసేందుకు 8-MP స్నాపర్ ఉంది. లావా స్మార్ట్‌ఫోన్ ఇంటర్నల్ కెమెరా ఫీచర్లలో HDR, నైట్ పోర్ట్రెయిట్, పనోరమా, స్లో మోషన్, టైమ్-లాప్స్, ఆడియో నోట్స్ ఉన్నాయి. ఇతర ముఖ్య ఫీచర్లలో 18W ఛార్జింగ్ (టైప్-C), Unisoc T616 SoC, 6GB RAM, 128GB స్టోరేజీతో కూడిన 5,000mAh బ్యాటరీ ఉన్నాయి.
లేటెస్ట్ లావా Blaze 2తో Lava కంపెనీ.. Motorola, Realme వంటి బ్రాండ్ల కన్నా పాపులారిటీ పొందాలని భావిస్తోంది. ఇటీవల ఇదే ధర పరిధిలో స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. కస్టమర్లు గ్లాస్ ఆరెంజ్, గ్లాస్ బ్లూ మధ్య ఎంచుకోవచ్చు. ఈ ఫోన్ సేల్ అమెజాన్ (Amazon Sale) ద్వారా ఏప్రిల్ 18 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. వారంటీ కింద డివైజ్ కోసం లావా ‘(free service at home)‘ని కూడా అందిస్తోంది.