Twitter Sign Viral : ట్విట్టర్ పేరులో ‘W’ అక్షరం మాయం.. ఇక ‘టిట్టర్’ అని పిలవాల్సిందేనట.. మస్క్ మాయాజాలం ఇదిగో..!

Twitter Sign Viral : శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ (Twitter) హెడ్ ఆఫీస్ ట్విట్టర్ పేరులో (W) మిస్ అయినట్టుగా కనిపించింది. తన క్రియేటీవిటీతో తక్కువ ఖర్చుతో సులభంగా ఎలన్ మస్క్ పరిష్కరించాడు. మస్క్ భలే కవర్ చేశాడుగా అని నెటిజన్లు అంటున్నారు.

Twitter Sign Viral : ట్విట్టర్ పేరులో ‘W’ అక్షరం మాయం.. ఇక ‘టిట్టర్’ అని పిలవాల్సిందేనట.. మస్క్ మాయాజాలం ఇదిగో..!

Twitter Sign Viral ( Photo : Twitter)

Twitter Sign Viral : ట్విట్టర్ సీఈఓ ఎలన్ మస్క్ (Elon Musk) చేష్టలకు అంతేలేకుండా పోతోంది. ఎప్పుడు ఏం చేస్తాడో అతడికే తెలియదు అన్నట్టుగా వ్యవహరిస్తుంటాడు. మొన్నటికి మొన్న ట్విట్టర్ అధికారిక లోగో బుల్లిపిట్ట (Blue Bird Logo)ను మార్చి.. ఆ స్థానంలో క్రిప్టోకరెన్సీ డోజీ కాయిన్ (Dogecoin) పెట్టేశాడు. మూడు రోజుల్లోనే కుక్క లోగోను మార్చేసి మళ్లీ బుల్లిపిట్ట లోగోను ఉంచాడు.

కానీ, మస్క్ ఏం చేసినా దానికో లెక్కుంటుంది.. దాని వెనుక ఏదో ఒక అర్థం ఉండే ఉంటుంది.. అందుకే మస్క్ ఎవరికి అర్థం కాడు.. ఇప్పుడు కూడా ఎవరికి అర్థం కాని రీతిలో మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈసారి ఏకంగా ట్విట్టర్ పేరులో (W) అక్షరాన్ని ఎగరగొట్టేశాడు. ఎందుకు అలా చేశాడంటే.. మస్క్ వివరణ కూడా ఇచ్చాడు.

Read Also :  Twitter Logo Changed: పిట్ట పోయింది డాగ్‍‌‌ వచ్చింది..! ట్విటర్‌లో కనిపించని బ్లూ బర్డ్.. అయోమయంలో నెటిజన్లు..

2022 ఏప్రిల్‌లో ఎలన్ మస్క్ ఒక పోల్ నిర్వహించాడు. ఆ పోల్‌లో పాల్గొన్నవారంతా ట్విట్టర్ పేరును తొలగించాలని సూచించారు. ఆ పోల్ ఆధారంగా ట్విట్టర్ లోగోలో W అనే అక్షరం తొలగించినట్టుగా చెప్పుకొచ్చాడు. ట్విట్టర్ పేరును టిట్టర్ అని ఎందుకు మార్చాల్సి వచ్చిందో చెప్పాలంటూ మస్క్‌ను ప్రశ్నించగా.. అందుకు ఆయన చాలా తెలివిగా సమాధానమిచ్చాడు.

చట్టపరంగా ట్విట్టర్ లోని W అక్షరాన్ని తొలగించడానికి అనుమతి లేదు. అందుకే W లెటర్ కనిపించకుండా ఉండేలా బ్యాక్ గ్రౌండ్ కలర్ మార్చేసినట్టు తెలిపాడు. అందుకే.. ట్విట్టర్ పేరులో బ్యాక్‌గ్రౌండ్ కలర్‌లో Wను మాత్రం పెయింట్ చేశాడు. తద్వారా కొత్త అక్షరాన్ని ఇన్‌స్టాల్ చేసేందుకు అయ్యే ఖర్చు ఆదా అయింది.. సమస్య కూడా పరిష్కారమైందని మస్క్ ట్వీట్ చేశాడు.

Titter Logo Viral _ Viral photo showed Twitter HQ as Titter, Elon Musk restores W with paint

Twitter Sign Viral ( Photo : Twitter)

తక్కువ ఖర్చుతో సమస్య పరిష్కారం.. మస్క్ భలే కవర్ చేశాడుగా..

మరోవైపు.. ట్విట్టర్‌ ‘W’ అక్షరం కనిపించకపోవడంపై మస్క్‌పై విమర్శలు వస్తున్నాయి. మస్క్ చేష్టలకు హద్దు అదుపు లేకుండా పోయాయని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కో (San Francisco)లోని ట్విట్టర్‌ హెడ్ క్వార్టర్స్ బయట ఏర్పాటు చేసిన సైన్‌బోర్డుపై Twitter పేరులోని ‘W’ అక్షరాన్ని తొలగించడంపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

ఇది ఏమైనా పిల్లల ఆట అనుకుంటున్నారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ట్విట్టర్ లోగోలో (W) లేకపోవడంతో ఇకపై అందరూ టిట్టర్ (Titter) అని పిలవాల్సి ఉంటుందని అంటున్నారు. ఏదిఏమైనా.. మొన్న ట్విట్టర్ బుల్లిపిట్ట స్థానంలో కుక్క వచ్చి వెళ్లినట్టుగా.. ఇప్పుడు ట్విట్టర్ పేరులో (w) లెటర్ కూడా త్వరలో తిరిగి వస్తోందో లేదో చూడాలి..

Read Also : Twitter Bird Logo : బుల్లిపిట్ట తిరిగొచ్చింది.. ట్విట్టర్‌‌ ‘డాగీ కాయిన్’ లోగో మార్చేశాడు.. మస్క్ మామూలోడు కాదుగా..!