Lava Storm 5G Launch : రూ. 15వేల లోపు ధరకే లావా స్టార్మ్ 5G ఫోన్.. ఈ నెల 28నే సేల్.. డోంట్ మిస్!

Lava Storm 5G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? లావా స్టార్మ్ 5G ఫోన్ అత్యంత సరసమైన ధరకే అందుబాటులో ఉంది. ఈ నెల 28 నుంచి సేల్ అందుబాటులో ఉంటుంది. పూర్తి వివరాలు మీకోసం..

Lava Storm 5G with 8GB RAM, Dimensity 6080 launched

Lava Storm 5G Launch : ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం లావా నుంచి సరికొత్త 5జీ ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది. లావా స్టార్మ్ 5G ఫోన్ 8జీబీ ర్యామ్ మీడియాటెక్ డైమెన్షిటీ 6080 ప్రాసెసర్‌తో శక్తివంతమైన కొత్త స్మార్ట్‌ఫోన్ లావా స్టార్మ్ 5జీ రూ. 15వేల లోపు ధరకు అందుబాటులో ఉంది. హై-ఎండ్ పర్ఫార్మెన్స్, హై-క్వాలిటీ కెమెరా సెటప్‌తో కూడిన ఈ డివైజ్ డిసెంబర్ 28న మార్కెట్లోకి రానుంది. ప్రత్యేకించి (Amazon.in) వెబ్‌సైట్, లావా ఈ-స్టోర్‌లో అందుబాటులో ఉంటుంది. స్టార్మ్ 5జీ ఫోన్ వినియోగదారులకు ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్‌లతో పాటు రూ. 11,999 ప్రారంభ ఆఫర్‌తో కొనుగోలు చేయొచ్చు.

Read Also : Apple iPhone Lost : మీ ఆపిల్ ఐఫోన్ పోగొట్టుకున్నారా? రాబోయే ఈ కొత్త అప్‌డేట్‌తో దొంగిలించిన డివైజ్ ఎవరూ అన్‌లాక్ చేయలేరు..!

మీడియాటెక్ డైమెన్షిటీ 6080 ద్వారా ఆధారితంగా పనిచేస్తుంది. స్టార్మ్ 5జీ హై-ఎండ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. కంపెనీ ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ (AnTuTu) బెంచ్‌మార్క్‌లపై 4,20,000 కన్నా ఎక్కువ స్కోర్ చేసింది. సున్నితమైన గేమింగ్ పర్ఫార్మెన్స్ సూచిస్తుంది. ఆకట్టుకునే 8జీబీ ర్యామ్‌తో (16GB వరకు పొడిగించుకోవచ్చు). ప్రత్యేకించి గేమర్‌ల కోసం రూపొందించింది. గేమ్‌లు, యాప్‌లు, మల్టీమీడియా కంటెంట్ కోసం 128జీబీ తగినంత స్టోరేజీని అందిస్తోంది.

అద్భుతమైన కెమెరా ఫీచర్లు ఇవే :
6,78-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, వైడ్‌వైన్ ఎల్1 సపోర్ట్‌ని కలిగి ఉంది. లావా స్టార్మ్ 5జీ స్పష్టమైన విజువల్స్ అందిస్తుంది. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ సమయంలో బ్లర్‌లను తగ్గిస్తుంది. ఈ ఫోన్ గేల్ గ్రీన్, థండర్ బ్లాక్‌లో లాంచ్ అయింది. సైడ్-మౌంటెడ్ అల్ట్రా-ఫాస్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ వంటి టాప్-నాచ్ సెక్యూరిటీ ఫీచర్లతో కూడా వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ ప్రీమియం గ్లాస్ బ్యాక్‌ను కలిగి ఉంది. కెమెరా విభాగంలో స్మార్ట్‌ఫోన్‌లో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్ డ్యూయల్ రియర్ కెమెరా, 16ఎంపీ ఫ్రంట్ కెమెరా, అత్యుత్తమ ఫోటోగ్రఫీ, సెల్ఫీ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

Lava Storm 5G launched

భారీ బ్యాటరీతో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు :
బలమైన 5000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు నిరంతరాయ వినియోగాన్ని అందిస్తుంది. క్లీన్, బ్లోట్‌వేర్-రహిత స్టాక్ ఆండ్రాయిడ్ 13పై రన్ అవుతుంది. స్టార్మ్ 5జీ ఫోన్ స్పష్టమైన ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. లావా స్మార్ట్‌ఫోన్‌లలో ఏదైనా బ్లోట్‌వేర్‌ను ప్రీ-ఇన్‌స్టాల్ చేయాల్సిన పనిలేదు. ఆండ్రాయిడ్ 14 అప్‌గ్రేడ్‌లు, రెండు సంవత్సరాల భద్రతా అప్‌డేట్ అందిస్తుంది. స్టార్మ్ 5జీలో శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లు, హై-క్వాలిటీ కెమెరా సెటప్, ఎక్స్‌టెండెడ్ బ్యాటరీ లైఫ్, స్మార్ట్‌ఫోన్ ఔత్సాహికుల దృష్టిని ఆకర్షించేలా ఉంటుంది.

లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రొడక్ట్ హెడ్ సుమిత్ సింగ్ మాట్లాడుతూ.. ‘నేటి డైనమిక్ టెక్ ల్యాండ్‌స్కేప్‌లో యువ వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. పవర్ స్పీడ్, అద్భుతమైన కెమెరా అనుభవాన్ని కోరుకుంటున్నారు. లావా స్టార్మ్ 5జీ ఫోన్ ఈ డిమాండ్‌లకు అనుగుణంగా రూపొందించడం జరిగింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్ అత్యాధునిక 50ఎంపీ+8ఎంపీ కెమెరా సెటప్‌తో స్టార్మ్ 5జీ కేవలం డివైజ్ మాత్రమే కాదు. పవర్-ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఇదే మా సమాధానం’ అని ఆయన అన్నారు.

Read Also : Redmi Note 13 Pro Price : భారత్‌కు రెడ్‌మి నోట్ 13 ప్రో వచ్చేస్తోంది.. వచ్చే జనవరి 4న లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?