Lava Storm Series : లావా 2 కొత్త బడ్జెట్ 5G ఫోన్లు.. ధర రూ. 8వేల లోపే.. చైనా ఫోన్ల కన్నా బెటర్ ఫీచర్లు.. ఫస్ట్ సేల్ ఎప్పుడంటే?

Lava Storm Series : లావా కొత్త బడ్జెట్ ఫోన్లు చూశారా? కేవలం రూ. 8వేల లోపు ధరకే కొనేసుకోవచ్చు. ఈ నెల 19న ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది.

Lava Storm Series

Lava Storm Series : కొత్త ఫోన్ కొంటున్నారా? చైనా స్మార్ట్‌ఫోన్లకు దీటుగా స్వదేశీ బ్రాండ్ లావా స్టార్మ్ సిరీస్‌లో 2 కొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. లావా స్టార్మ్ ప్లే, లావా స్టార్మ్ లైట్‌ మోడల్స్ కంపెనీ 5,000mAh బ్యాటరీ, 128GB వరకు స్టోరేజీ ఫీచర్లతో వస్తాయి. రెడ్‌మి, రియల్‌‌మి, పోకో, ఇన్ఫినిక్స్ వంటి చైనీస్ ఫోన్లకు గట్టి పోటీనిస్తోంది. ఈ కొత్త లావా స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Read Also : iQOO Z10 Lite : ఐక్యూ లవర్స్‌ గెట్ రెడీ.. iQOO Z10 లైట్ ఫోన్ వచ్చేస్తోంది.. కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే?

లావా స్టార్మ్ సిరీస్ భారత్ ధర ఎంతంటే? :
ఈ లావా ఫోన్ల (Lava Storm Series) ధరలు రూ. 8వేల కన్నా తక్కువ ధరకే లభ్యం కానున్నాయి. 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ సింగిల్ కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 9,999కు లభిస్తోంది. జూన్ 19న మధ్యాహ్నం 12 గంటలకు ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ద్వారా ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది.

లావా స్టార్మ్ లైట్ 64GB స్టోరేజ్‌తో 4GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో 4GB ర్యామ్ అనే 2 స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది. ఈ లావా ఫోన్ ధర రూ. 7,999 నుంచి ప్రారంభమవుతాయి. లావా ఫస్ట్ సేల్ జూన్ 24 మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్‌లో ప్రారంభం కానుంది.

లావా స్టార్మ్ సిరీస్ స్పెసిఫికేషన్లు :
ఈ లావా 2 స్మార్ట్‌ఫోన్‌లు (Lava Storm Series) 120Hz హై రిఫ్రెష్ రేట్‌తో 6.75-అంగుళాల HD+ వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లేతో వస్తుంది. స్టార్మ్ ప్లే మీడియాటెక్ డైమెన్సిటీ 7060 5G ప్రాసెసర్‌తో వస్తుంది. 6GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో వస్తుంది.

వర్చువల్‌గా 6GB ద్వారా స్టోరేజీని పెంచుకోవచ్చు. స్టార్మ్ లైట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది. ఇందులో 4GB ర్యామ్, 128GB వరకు స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. వర్చువల్‌గా 4GB ద్వారా కూడా విస్తరించవచ్చు.

బ్యాటరీ విషయానికొస్తే.. ఈ రెండు ఫోన్ మోడళ్లు 5,000mAh బ్యాటరీతో వస్తాయి. స్టార్మ్ ప్లే 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుండగా, స్టార్మ్ లైట్ 15Wకి సపోర్టు ఇస్తుంది. కనెక్టివిటీ పరంగా రెండు ఫోన్‌లు 4G/5G సిమ్ కార్డ్ సపోర్ట్, USB టైప్-C, Wi-Fi, బ్లూటూత్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 15-ఆధారిత సిస్టమ్‌పై రన్ అవుతాయి. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ కూడా ఉంది. IP64 రేటింగ్‌ కలిగి ఉంది.

Read Also : Motorola Edge 50 : ఆఫర్ అదిరింది గురూ.. రూ.28వేల మోటోరోలా ఫోన్ కేవలం రూ. 15వేలకే.. ఇప్పుడే కొనడం బెటర్..!

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. లావా స్టార్మ్ ప్లే బ్యాక్ సైడ్ డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 2MP సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. స్టార్మ్ లైట్ బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP కెమెరాను కూడా కలిగి ఉంది.