Lava Yuva 2 5G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? లావా యువ 2 5జీ ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు, ధర ఎంతంటే?

Lava Yuva 2 5G Launch : భారత మార్కెట్లో లావా యువ 2 5జీ సింగిల్ 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,499కు అందిస్తోంది. ప్రస్తుతం రిటైల్ స్టోర్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.

Lava Yuva 2 5G Launch

Lava Yuva 2 5G Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో శుక్రవారం (డిసెంబర్ 27) లావా యువ 2 5జీ ఫోన్ లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6ఎన్ఎమ్ ఆక్టా-కోర్ యూనిసోక్ టీ760 ఎస్ఓసీ ద్వారా ఆధారితమైనది. (AnTuTu) స్కోర్ 4,40,000 కన్నా ఎక్కువగా ఉంది.

ఏఐ ఫీచర్లతో కూడిన 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ నోటిఫికేషన్ లైట్ ఫీచర్‌తో అమర్చి ఉంది. సిస్టమ్ లేదా యాప్ వార్నింగ్స్ ఉపయోగించవచ్చు. లేటెస్ట్ బడ్జెట్ 5జీ హ్యాండ్‌సెట్ ప్రస్తుతం ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది. ముఖ్యంగా, ఫస్ట్ జనరేషన్ లావా యువ 5జీ ఫోన్ గత మేలో భారత మార్కెట్లో లాంచ్ అయింది.

Read Also : SBI PO Recruitment 2024 : ఎస్బీఐ పీఓ రిక్రూట్‌మెంట్ 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ఈ లింక్ ద్వారా ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

భారత్‌లో లావా యువ 2 5G ధర, లభ్యత, కలర్ ఆప్షన్లు :
భారత మార్కెట్లో లావా యువ 2 5జీ సింగిల్ 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,499కు అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆన్‌లైన్ లభ్యతను కంపెనీ ఇంకా ధృవీకరించలేదు. ఈ ఫోన్ మార్బుల్ బ్లాక్, మార్బుల్ వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఒక ఏడాది వారంటీతో పాటు ఫ్రీ ఎట్-హోమ్ సర్వీసులతో వస్తుంది.

లావా యువ 2 5జీ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
లావా యువ 2 5జీ ఫోన్ 6.67-అంగుళాల హెచ్‌డీ+ స్క్రీన్‌తో 90Hz రిఫ్రెష్ రేట్, 700నిట్స్ గరిష్ట ప్రకాశం స్థాయిని కలిగి ఉంది. 4జీబీ ర్యామ్‌తో యూనిసోక్ టీ760 ఎస్ఓసీ ద్వారా పవర్ పొందుతుంది. ఈ ఫోన్ అదనపు 4జీబీ వరకు వర్చువల్ ర్యామ్ విస్తరణకు సపోర్టు ఇస్తుంది. 128జీబీ యూఎఫ్ఎస్ 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో కూడా వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. లావా యువ 2 5జీ ఏఐ సపోర్టుతో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ సెకండరీ సెన్సార్‌తో సహా డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ కెమెరాలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8ఎంపీ సెన్సార్ ఉంది. నోటిఫికేషన్ లైట్ యూనిట్ బ్యాక్ కెమెరా మాడ్యూల్‌లో ఉంది. మెరిసే లైట్లను ఉపయోగించి ఇన్‌కమింగ్ కాల్స్‌తో సహా ఇన్-సిస్టమ్, యాప్ నోటిఫికేషన్‌లను చూపుతుంది.

లావా యువ 2 5జీ ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ద్వారా 18డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ డ్యూయల్ స్టీరియో స్పీకర్ యూనిట్‌ను కూడా కలిగి ఉంది. సెక్యూరిటీ విషయానికి వస్తే.. ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది.

Read Also : RBI UPI Rule for Wallets : ఆర్బీఐ కొత్త రూల్.. పీపీఐ యూజర్లు ఏదైనా యూపీఐ ద్వారా వ్యాలెట్లలో నగదుతో పేమెంట్లు చేయొచ్చు!