RBI UPI Rule for Wallets : ఆర్బీఐ కొత్త రూల్.. పీపీఐ యూజర్లు ఏదైనా యూపీఐ ద్వారా వ్యాలెట్లలో నగదుతో పేమెంట్లు చేయొచ్చు!

PPI UPI Payments : థర్డ్-పార్టీ యూపీఐ యాప్‌ల ద్వారా ఫుల్ కేవైసీతో ప్రీపెయిడ్ కార్డ్ (PPI) హోల్డర్ల నుంచి యూపీఐ పేమెంట్లు చేసుకునేందుకు అనుమతించినట్టు ఆర్బీఐ తెలిపింది.

RBI UPI Rule for Wallets : ఆర్బీఐ కొత్త రూల్.. పీపీఐ యూజర్లు ఏదైనా యూపీఐ ద్వారా వ్యాలెట్లలో నగదుతో పేమెంట్లు చేయొచ్చు!

RBI Allows UPI Access For Prepaid Payment Instruments

Updated On : December 27, 2024 / 7:56 PM IST

RBI New UPI Rule for Wallets : ప్రీపెయిడ్ కార్డ్ హోల్డర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గుడ్ న్యూస్ చెప్పింది. యూపీఐ థర్డ్ పార్టీ మొబైల్ అప్లికేషన్‌ల ద్వారా పీపీఐ వ్యాలెట్లలోని డబ్బుతో పేమెంట్లను చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ అనుమతిని ఇచ్చింది.

పీపీఐ సంస్థల వ్యాలెట్లలోని నగదును ఇకపై యూపీఐ యాప్స్ ద్వారా పేమెంట్లు (సెండ్‌/ రిసీవ్‌) చేసుకోవచ్చు. ఈ మేరకు శుక్రవారం (డిసెంబర్ 27) ఆర్బీఐ ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. రిజర్వ్ బ్యాంక్ నిర్ణయంతో గిఫ్ట్ కార్డ్‌లు, మెట్రో రైల్ కార్డ్‌లు, డిజిటల్ వ్యాలెట్ల వంటి ప్రీపెయిడ్ పేమెంట్స్ టూల్స్ (PPI) హోల్డర్‌లకు మరింత సౌలభ్యాన్ని అందిస్తుంది.

Read Also : 2025 Apple Products : 2025 ప్రారంభంలో రాబోయే కొత్త 5 ఆపిల్ ప్రొడక్టులు ఇవే.. పూర్తి వివరాలు మీకోసం..!

పీపీఐ యూజర్లు తమ వ్యాలెట్లలో అవసరమైన క్యాష్ లోడ్ చేసుకోవచ్చు. వీటిని వ్యాలెట్లు లేదా ప్రీపెయిడ్‌ కార్డులుగా పిలుస్తారు. ఈ వ్యాలెట్లలోని నగదును యూపీఐ, ఆన్‌లైన్‌ పేమెంట్ల కోసం వినియోగించవచ్చు అనమాట. అయితే, పీపీఐలో జమ చేసిన నగదుకు బ్యాంకు అకౌంటుతో సంబంధం లేకుండానే పేమెంట్లు చేయొచ్చు. పీపీఐ అందించే యూపీఐ నుంచే కాదు.. ఇకపై అన్ని ఇతర ఈ పీపీఐలకు సంబంధించిన థర్డ్ పార్టీ యూపీఐలతో కూడా సులభంగా పేమెంట్లు చేయొచ్చు.

ఆర్‌బీఐ సర్క్యులర్‌లో ఏముందంటే? :
థర్డ్-పార్టీ యూపీఐ యాప్‌ల ద్వారా ఫుల్ కేవైసీతో పీపీఐల నుంచి యూపీఐ పేమెంట్లను అనుమతించాలని నిర్ణయించినట్లు రిజర్వ్ బ్యాంక్ సర్క్యులర్‌లో తెలిపింది. అదేవిధంగా, పీపీఐ కూడా యూపీఐ పేమెంట్లను స్వీకరించడానికి అనుమతించినట్టు ఆర్బీఐ పేర్కొంది. పీపీఐ (PPI) జారీచేసేవారు కస్టమర్‌ని యూపీఐ హ్యాండిల్‌కి లింక్ చేయడం ద్వారా ఫుల్-కేవైసీ పీపీఐ హోల్డర్‌లకు మాత్రమే యూపీఐ పేమెంట్లు చేయడానికి వీలు కల్పిస్తుంది.

కస్టమర్ ప్రస్తుత పీపీఐ ఐడెంటిటీని ఉపయోగించి జారీచేసేవారి అప్లికేషన్‌పై పీపీఐ నుంచి యూపీఐ లావాదేవీలను అధికారికంగా పూర్తి చేయొచ్చు. ప్రస్తుతం, బ్యాంక్ అకౌంట్ నుంచి యూపీఐ చెల్లింపులు ఆ బ్యాంక్ యూపీఐ అప్లికేషన్ లేదా థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్‌ని ఉపయోగించి చేయవచ్చు. అయితే పీపీఐ నుంచి యూపీఐ చెల్లింపులు పీపీఐ జారీచేసేవారు అందించిన మొబైల్ యాప్ ఉపయోగించి మాత్రమే చేయవచ్చు.

పీపీఐకి యూపీఐకి మధ్య తేడా ఏంటి? :
పీపీఐలు వస్తువులు, సేవల కొనుగోలు, ఆర్థిక సేవల నిర్వహణకు సంబంధించినిది. అందులో స్టోర్ చేసిన సొమ్ముపై పేమెంట్లు చేసేందుకు వీలుంటుంది. యూపీఐ అనేది మొబైల్ ఫోన్‌ల ద్వారా అంతర్-బ్యాంక్ లావాదేవీలను పూర్తి చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన ఇన్‌స్టంట్ రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ అని చెప్పవచ్చు.

ప్రస్తుత యూపీఐ పద్ధతి ఏంటి? :
ప్రస్తుతం, యూపీఐ పేమెంట్లు ఆ బ్యాంక్ యూపీఐ అప్లికేషన్ లేదా థర్డ్ పార్టీ అప్లికేషన్‌ని ఉపయోగించి బ్యాంక్ అకౌంట్ ద్వారా లేదా అందులోనే చేయవచ్చు. అయితే, పీపీఐ ద్వారా యూపీఐ పేమెంట్లను పీపీఐ జారీచేసేవారు అందించిన మొబైల్ యాప్ యూపీఐ ద్వారా మాత్రమే చేయవచ్చు.

ప్రీపెయిడ్ పేమెంట్ టూల్స్ అంటే ఏంటి? :
ప్రీపెయిడ్ పేమెంట్ డివైజ్ అనేది కార్డ్ లేదా డిజిటల్ వ్యాలెట్లలో నగదును జమ చేసేందుకు అనుమతించే ఫైనాన్షియల్ టూల్. ఇప్పుడు ఎవరైనా ఏదైనా థర్డ్ పార్టీ యాప్ ఇంటర్‌ఫేస్‌ని ఉపయోగించి వ్యాలెట్లలోకి డబ్బు పంపవచ్చు. అలాగే స్వీకరించవచ్చు కూడా.

ఉదాహరణకు. మీరు Paytm లేదా Google Pay వ్యాలెట్లో డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటే లేదా స్వీకరించాలనుకుంటే.. మీరు ఆ యాప్‌ల ఇంటర్‌ఫేస్‌ను ఉపయోగించాల్సిన అవసరం లేదు. మరేదైనా యూపీఐ యాప్ ద్వారా కూడా డబ్బును వ్యాలెట్లలోకి పంపవచ్చు లేదా ఇతరుల నుంచి పొందవచ్చు.

Read Also : New Year 2025 Changes : గ్యాస్ సిలిండర్, కార్ల ధరల నుంచి వీసా నిబంధనల వరకు.. 2025లో రాబోయే కొత్త రూల్స్ ఇవే!