New Year 2025 Changes : గ్యాస్ సిలిండర్, కార్ల ధరల నుంచి వీసా నిబంధనల వరకు.. 2025లో రాబోయే కొత్త రూల్స్ ఇవే!
New Year 2025 Changes : 2025 కొత్త ఏడాదికి స్వాగతం పలకనున్న సందర్భంగా ఆర్థికపరంగా ఎలాంటి కొత్త మార్పులు రానున్నాయో ఓసారి పరిశీలిద్దాం..

New Year 2025 Changes : ఆర్థికపరంగా 2024 ఏడాదిలో అనేక కొత్త మార్పులను చూశాం. రాబోయే కొత్త ఏడాది 2025లో కూడా ఆర్థిక విషయాల్లో మరెన్నో కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఎల్‌పీజీ సిలిండర్ ధరల దగ్గర నుంచి కార్ల ధరలు, వీసా నిబంధనల్లో కొత్త మార్పులు అందుబాటులోకి రానున్నాయి.
ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజమైన అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ విషయంలో కూడా కొత్త రూల్స్ రానున్నాయి. మరికొద్ది రోజుల్లో 2024కు గుడ్ బై చెప్పబోతున్నాం. 2025 కొత్త ఏడాదికి స్వాగతం పలకనున్న సందర్భంగా ఆర్థికపరంగా ఎలాంటి కొత్త మార్పులు రానున్నాయో ఓసారి పరిశీలిద్దాం..
ఎల్‌పీజీ ధరలు :
ఎల్‌పీజీ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు ప్రతి నెలా సవరణ చేస్తుంటాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా చమురు సంస్థలు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. 2024 ఏడాదిలో వాణిజ్య సిలిండర్ ధరల్లో అనేక సార్లు మార్పులు జరిగాయి. డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో కూడా మార్పు చేయలేదు. 2025 కొత్త ఏడాదిలో గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు ఉంటాయో చూడాలి.
Read Also : iPhone 16 Discount : కొత్త ఐఫోన్ కావాలా? ఆపిల్ ఐఫోన్ 16పై బిగ్ డిస్కౌంట్.. డోంట్ మిస్..!
ఆ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు :
2025 కొత్త ఏడాదిలో సపోర్టు చేయని పాత స్మార్ట్‌ఫోన్లకు మెసేజింగ్ సర్వీసులను వాట్సప్ నిలిపివేయనుంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో జనవరి ఒకటవ తేదీ నుంచి శాంసంగ్ గెలాక్సీ S3, హెచ్‌టీసీ వన్‌ఎక్స్ ఫోన్, మోటో జీ ఫోన్, సోనీ ఎక్స్‌పీరియా జడ్, మోటో రేజర్ హెచ్‌డీ, ఎల్‌జీ ఆప్టిమస్ జీ ఫోన్ వంటి ఫోన్లకు వాట్సాప్ తన సపోర్ట్‌ను నిలిపివేయనుంది.
భారీగా పెరగనున్న కార్ల ధరలు :
ఆటో మొబైల్ కంపెనీలు వచ్చే 2025 జనవరి 1 నుంచి కార్ల ధరల్ని పెంచనున్నట్టు ప్రకటించాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, హోండా ఇండియా, మహీంద్రా, టాటా మోటార్స్, ఎంజీఈ మోటార్, మెర్సిడెస్ బెంజ్, ఆడీ కార్లు ఈ లిస్టులో ఉన్నాయి.
ప్రైమ్ వీడియో వ్యూ లిమిట్ :
అమెజాన్ ప్రైమ్ వీడియో వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. ఇప్పటివరకూ డివైజ్ అనేది లేకుండా మొత్తంగా 5 డివైజుల్లో ఒకేసారి యాక్సస్ చేసుకునేవారు. 2025 కొత్త ఏడాది నుంచి ఇలా చేయడం కుదరదు. జనవరి ఒకటో తేదీ నుంచి ఒకేసారి 2 కన్నా ఎక్కువ డివైజ్‌ల్లో ప్రైమ్ వీడియోను యాక్సస్ చేయలేరు. ఎక్కువ డివైజ్‌ల్లో ప్రైమ్ వీడియో వినియోగిస్తే.. కొత్త ప్రైమ్ వీడియో అకౌంట్ ఉండాల్సిందే.
పెరగనున్న యూపీఐ లిమిట్ :
స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ లేకుండా యూపీఐ సర్వీసులను అందించే (UPI123PAY) లిమిట్ కూడా 2025 నుంచి పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న లిమిట్ రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెరగనుంది. ఈ కొత్త లిమిట్ ఫీచర్ ఫోన్ యూజర్లకు ఎన్‌పీసీఐ (NPCI) ప్రవేశపెట్టింది.
తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో విలీనం :
గ్రామీణ బ్యాంకులన్నీ విలీనం కానున్నాయి. ‘ఒక రాష్ట్రం.. ఒక గ్రామీణ బ్యాంకు’ అనే నినాదాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ (APGVB)కి సంబంధించిన తెలంగాణలోని గ్రామీణ శాఖలన్నీ ఇప్పటినుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో విలీనం అవుతాయి. వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది.
ప్రస్తుత APGVB తెలుగు రాష్ట్రాల్లో 771 శాఖల ద్వారా కస్టమర్లకు సేవలను అందిస్తోంది. తెలంగాణలోని 493 శాఖలు ఇప్పటికే తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం అవుతాయి. దాంతో దేశంలోనే అతిపెద్ద గ్రామీణ బ్యాంకుల్లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఒకటిగా నిలవనుంది.
థాయ్‌లాండ్ ఈ-వీసా చాలా ఈజీ:
2025 కొత్త సంవత్సరం నుంచి థాయ్‌లాండ్ వెళ్లేవారు తప్పనిసరిగా ఈ-వీసాను పొందాల్సి ఉంటుంది. మీరు ఏ దేశానికి చెందినవారు అయినా వీసా వెబ్‌సైట్ నుంచి ఈ- వీసా కోసం అప్లయ్ చేసుకోవచ్చు. గతంలో థాయ్‌లాండ్ వెళ్లేవారికి ఈ- వీసా విధానం కేవలం కొన్ని దేశాల నుంచి వచ్చేవారిని మాత్రమే అనుమతించేవారు. అయితే, 2025 కొత్త ఏడాదిలో జనవరి ఒకటో తేదీ నుంచి ఏ దేశం నుంచి వచ్చేవారు అయినా ఆన్‌లైన్‌లో సులభంగా ఈ-వీసా కోసం అప్లయ్ చేసుకోవచ్చు.
ఐటీసీ హోటల్ డీమెర్జర్ :
ఐటీసీ లిమిటెడ్ ఐటీసీ హోటల్స్ పేరుతో హాస్పిటాలిటీ బిజినెస్ సపరేటు చేయనుంది. 2025 ఏడాది జనవరిలో ఈ డీమెర్జర్ ప్రాసెస్ కంప్లీట్ కానుంది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) నుంచి ఆర్డర్‌ను స్వీకరించిన తర్వాత ఐటీసీ లిమిటెడ్ తన హోటల్ వ్యాపారాన్ని జనవరి 1, 2025 తేదీన విభజించనుంది. హోటల్ వ్యాపార విభజనకు జనవరి 6ను రికార్డు తేదీగా ఐటీసీ నిర్ణయించింది.
వీసా రీషెడ్యూల్ ఫస్ట్ టైం ఫ్రీ :
అమెరికా వెళ్తున్నారా? అయితే, ఆ దేశం 2025 ఏడాదిలో కొన్ని కీలక మార్పులు చేయనుంది. నాన్ ఇమిగ్రెంట్ వీసా కోసం చూసే ప్రయాణికులు తమకు నచ్చిన లొకేషన్‌లోనే ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేయొచ్చు.
ఏదైనా కారణంగా ఇంటర్వ్యూ రీషెడ్యూల్ చేయాల్సి వస్తే.. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా మొదటిసారి షెడ్యూల్‌ను మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ కొత్త మార్పు వర్తించనుంది. ఒకటికి మించి వీసా ఇంటర్వ్యూ రీషెడ్యూల్ చేసుకుంటే మాత్రం కచ్చితంగా రుసుము చెల్లించాల్సి ఉంటుందని గమనించాలి.
Read Also : 2025 Apple Products : 2025 ప్రారంభంలో రాబోయే కొత్త 5 ఆపిల్ ప్రొడక్టులు ఇవే.. పూర్తి వివరాలు మీకోసం..!