SBI PO Recruitment 2024 : ఎస్బీఐ పీఓ రిక్రూట్‌మెంట్ 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ఈ లింక్ ద్వారా ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

SBI PO Recruitment 2024 : ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా డిసెంబర్ 27 నుంచి అప్లయ్ చేసుకోవచ్చు.

SBI PO Recruitment 2024 : ఎస్బీఐ పీఓ రిక్రూట్‌మెంట్ 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ఈ లింక్ ద్వారా ఇప్పుడే అప్లయ్ చేసుకోండి!

SBI PO Recruitment 2024

Updated On : December 27, 2024 / 6:00 PM IST

SBI PO Recruitment 2024 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఈరోజు (డిసెంబర్ 27) ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. అభ్యర్థులు ఎస్బీఐ పీఓ రిక్రూట్‌మెంట్ 2024 కోసం అధికారిక వెబ్‌సైట్ (sbi.co.in)లో జనవరి 16, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 600 ఖాళీలు భర్తీ అవుతాయి. ఇందులో 586 రెగ్యులర్ పోస్టులు, 14 బ్యాక్‌లాగ్ ఖాళీలు ఉన్నాయి. మొదటి దశ ప్రిలిమినరీ పరీక్ష మార్చి 8, 15 తేదీల్లో జరగనుంది.

ఎస్బీఐ పీఓ రిక్రూట్‌మెంట్ 2024 అర్హత ప్రమాణాలివే :
విద్యా అర్హత : పరీక్షకు దరఖాస్తు చేసేందుకు అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి లేదా కేంద్ర ప్రభుత్వంచే గుర్తించిన ఏదైనా సమానమైన అర్హతను కలిగి ఉండాలి. తమ గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం/సెమిస్టర్‌లో ఉన్న ఆసక్తిగల అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

Read Also : TS TET 2024 Admit Card : టీఎస్ టెట్ 2024 అడ్మిట్ కార్డు విడుదల.. ఈ డైరెక్ట్ లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోండి!

వయోపరిమితి : అభ్యర్థులు ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. 21 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

ఎస్బీఐ పీఓ రిక్రూట్‌మెంట్ 2024 : అప్లికేషన్ ఫీజు ఎంతంటే? :
పరీక్షకు విజయవంతంగా దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు తప్పనిసరిగా రుసుము రూ. 750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు చెల్లించకుండా మినహాయింపు పొందవచ్చు.

ఎస్బీఐ పీఓ రిక్రూట్‌మెంట్ 2024 : ఎలా దరఖాస్తు చేయాలి? :

  • అధికారిక వెబ్‌సైట్‌ (sbi.co.in)ను విజిట్ చేయండి.
  • హోమ్‌పేజీలో SBI PO రిక్రూట్‌మెంట్ 2024 డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయండి.
  • దరఖాస్తు ఫారమ్‌ను నింపడానికి మీ వివరాలను ఉపయోగించండి.
  • అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
  • ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజు పేమెంట్ చేయండి.
  • దరఖాస్తు చేసిన తర్వాత కన్ఫార్మ్ పేజీని డౌన్‌లోడ్ చేయండి.

ఎస్బీఐ పీఓ రిక్రూట్‌మెంట్ 2024.. పరీక్షా విధానం :
ఎస్బీఐ పీఓ రాత పరీక్ష రెండు దశల్లో జరుగుతుంది. ప్రిలిమ్స్‌ మొదటి దశ పరీక్ష 100 మార్కులను కలిగి ఉంటుంది. మోడల్ పేపర్లు ఆంగ్ల భాషలో 30 ప్రశ్నలు ఉంటాయి. వాటిలో 35 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌కు సంబంధించినవి. 35 రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించినవి. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన వారిని నెక్స్ట్ మెయిన్స్ పరీక్షకు పిలుస్తారు.

పరీక్ష రెండో దశ అని కూడా అంటారు. మెయిన్స్ పరీక్షలో ప్రశ్నలు 250 మార్కులు ఎంతో కీలకం. రెండో భాగంలో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. రాత పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. పీఓ పోస్టులకు ఎంపికైతే, అభ్యర్థులు నెలకు రూ.41,960 జీతం అందుకుంటారు.

Read Also : New Year 2025 Changes : గ్యాస్ సిలిండర్, కార్ల ధరల నుంచి వీసా నిబంధనల వరకు.. 2025లో రాబోయే కొత్త రూల్స్ ఇవే!