Lava Yuva 5G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? లావా యువ 5జీ ఫోన్ వచ్చేసిందోచ్.. ధర కేవలం రూ. 9499 మాత్రమే!

Lava Yuva 5G Launch : ఈ ఫోన్‌లో 50ఎంపీ ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరాతో హై క్వాలిటీ ఫొటోలు, సెల్ఫీలను అందిస్తుంది. అదనంగా, బాటమ్-ఫైరింగ్ స్పీకర్‌ను కలిగి ఉంటుంది.

Lava Yuva 5G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? లావా యువ 5జీ ఫోన్ వచ్చేసిందోచ్.. ధర కేవలం రూ. 9499 మాత్రమే!

Lava Yuva 5G launched in India ( Image Credit : Google )

Updated On : May 30, 2024 / 3:54 PM IST

Lava Yuva 5G Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి స్మార్ట్‌ఫోన్ కంపెనీ లావా నుంచి లేటెస్ట్ మోడల్ యువ 5జీని లాంచ్ చేసింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ యూత్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని టాప్ రేంజ్, స్పీడ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్‌లలో వస్తుంది. 64జీబీ ధర రూ. 9499, 128జీబీ ధర రూ. 9999కు పొందవచ్చు. యువ 5జీ ఫోన్ జూన్ 5, 2024 నుంచి అమెజాన్, లావా ఇ-స్టోర్, లావా రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

Read Also : Realme C65 Launch : భారీ డిస్‌ప్లే, 5జీ సపోర్ట్‌తో రియల్‌మి C65 ఫోన్ వచ్చేసింది.. భారత్‌లో ధర రూ. 10,499 మాత్రమే!

యువ 5జీ ఫోన్ ప్రీమియం డిజైన్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది. మిస్టిక్ బ్లూ, మిస్టిక్ గ్రీన్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. స్ట్రాంగ్ గ్లాస్ బ్యాక్, యాక్సెస్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 128జీబీ యూఎఫ్ఎస్ 2.2 ఆర్ఓఎమ్ వరకు గణనీయమైన స్టోరేజీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అదనంగా 4జీబీ వర్చువల్ ర్యామ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 50ఎంపీ ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరాతో హై క్వాలిటీ ఫొటోలు, సెల్ఫీలను అందిస్తుంది. అదనంగా, బాటమ్-ఫైరింగ్ స్పీకర్‌ను కలిగి ఉంటుంది. టైప్-సి యూఎస్‌బీ కేబుల్ ద్వారా 18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

లావా యువ 5జీ స్పెషిఫికేషన్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ క్లీన్ ఆండ్రాయిడ్ 13పై రన్ అవుతుంది. యాడ్స్ లేదా అనవసరమైన ప్రీ ఇన్‌స్టాల్ యాప్‌లు లేకుండా క్లీన్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. లావా రెండు ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లకు ఆండ్రాయిడ్ 14కి అప్‌గ్రేడ్ అందిస్తుంది. వినియోగదారులు లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌ పొందవచ్చు.

యువ 5జీ హ్యాండ్‌సెట్‌పై ఒక ఏడాది వారంటీతో పాటు అప్లియన్సస్‌పై ఆరు నెలల వారంటీతో కూడా వస్తుంది. లావా ప్రోడక్ట్ హెడ్ సుమిత్ సింగ్ యువ 5జీ ఫోన్ వినూత్న అంశాలను హైలైట్ చేశారు. ఇన్నోవేషన్, ఎక్సలెన్స్‌పై దృష్టి పెట్టినట్టు పేర్కొన్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ సరసమైన ధరలో ఆధునిక ఫీచర్లతో హై-స్పీడ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

యూఎన్ఐఎస్ఓసీ టీ750 5జీ ఆక్టా-కోర్ ప్రాసెసర్ ద్వారా ఆధారితంగా పనిచేస్తుంది. 350,000 కన్నా ఎక్కువ AnTuTu స్కోర్‌తో అత్యుత్తమ పర్ఫార్మెన్స్ అందజేస్తుంది. దీర్ఘకాల 5000ఎంఎహెచ్ బ్యాటరీ, 90Hz 6.5-అంగుళాల హెచ్‌డీ+ పంచ్ హోల్ డిస్‌ప్లే అత్యుత్తమ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

కస్టమర్ సపోర్టు కోసం లావా “ఫ్రీ సర్వీస్ ఎట్ హోమ్” సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ ఫోన్ వారంటీ వ్యవధిలో కస్టమర్‌లు ఏదైనా హోం సర్వీసు కోసం సాంకేతిక నిపుణుడిని అభ్యర్థించవచ్చు. లావా ద్వారా యువ 5జీ ఫోన్ సరసమైన, హై పర్ఫార్మెన్స్ స్మార్ట్‌ఫోన్. యువ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా కంపెనీ రూపొందించింది.

Read Also : Realme Narzo N65 5G : అదిరే ఫీచర్లతో రియల్‌మి నార్జో N65 ఫోన్ వచ్చేసింది.. ఈ 5జీ ఫోన్ ధర ఎంతో తెలుసా?