×
Ad

Maxima Max Pro Hunt : మ్యాక్సిమా మాక్స్ ప్రో హంట్ స్మార్ట్‌వాచ్‌ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?

Maxima Max Pro Hunt : కొత్త స్మార్ట్‌వాచ్ కొనేందుకు చూస్తున్నారా? మ్యాక్సిమా మాక్స్ ప్రో హంట్ స్మార్ట్‌వాచ్‌ను ఆవిష్కరించింది. అనేక అద్భుతమైన ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునేలా ఉంది.

  • Published On : December 5, 2023 / 10:13 PM IST

Maxima unveils Max Pro Hunt smartwatch, price starts at Rs 2,599

Maxima Max Pro Hunt : ప్రముఖ స్మార్ట్‌వాచ్ కంపెనీ మ్యాక్సిమా తన సరికొత్త స్మార్ట్‌వాచ్ ‘మ్యాక్స్ ప్రో హంట్’ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్‌వాచ్ ఎల్లప్పుడూ ఆన్ ఫీచర్‌తో అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, మెటాలిక్ డిజైన్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.78-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే 1000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంటుంది.

Read Also : Selling Smartphone Tips : మీ పాత ఆండ్రాయిడ్ ఫోన్ విక్రయిస్తున్నారా? ఈ 10 విషయాలను తప్పక పూర్తి చేయండి..!

మ్యాక్సిమా అత్యాధునిక ఫీచర్లు :
368×448 పిక్సెల్ రిజల్యూషన్‌ని కలిగి ఉంది. స్మార్ట్‌వాచ్ ప్రీమియం మెటాలిక్ డిజైన్‌తో కూడిన మెటాలిక్ డిజైన్‌ను అందిస్తుంది. క్రిస్టల్-క్లియర్ రిజల్యూషన్ అత్యుత్తమ ఫొటో క్వాలిటీని నిర్ధారిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో బ్లూటూత్ వెర్షన్ 5.2, అధునాతన జెఎల్7013ఎ చిప్‌సెట్ ఉన్నాయి. కనెక్టివిటీలో అంతరాయం లేని కమ్యూనికేషన్‌లను అందిస్తుంది. బ్లూటూత్ కాలింగ్‌కు సపోర్టు అందిస్తుంది. వాచ్ నుంచి కాల్‌లు చేయడానికి, స్వీకరించడానికి యూజర్లను అనుమతిస్తుంది.

Maxima Max Pro Hunt smartwatch

మరెన్నో హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు :
మ్యాక్స్ ప్రో హంట్ వివిధ రకాల క్లౌడ్-ఆధారిత వాచ్ ఫేస్ ఆప్షన్‌లతో కస్టమైజ్ చేసిన టచ్‌ను అందిస్తుంది. వినియోగదారులు తమ ఆప్షన్ ప్రకారం ఈజీగా కస్టమైజ్ చేసేందుకు అనుమతిస్తుంది. మ్యాక్స్ ప్రో హంట్‌లో ఐపీ67 వాటర్ రెసిస్టెన్స్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం గూగుల్ అసిస్టెంట్, సిరికి సపోర్టు ఇచ్చే ఏఐ వాయిస్ అసిస్టెన్స్, 100+ స్పోర్ట్స్ మోడ్‌లు, మల్టీ వాచ్ ఫేస్‌లు, యాక్టివ్ రొటేటింగ్ క్రౌన్, స్లీప్ మానిటర్, ఎస్‌పీఓ2 మానిటర్, ఫిమేల్ హెల్త్ ట్రాకర్ ఉన్నాయి. వివిధ రకాల ఇన్‌బిల్ట్ గేమ్‌లు ఉంటాయి. ఈ స్మార్ట్‌వాచ్ మ్యాక్సిమా యాజమాన్య యాప్ మ్యాక్సిమా స్మార్ట్‌ఫిట్ యాప్ ద్వారా అందిస్తుంది.

ధర, లభ్యత :
స్మార్ట్ వాచ్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. సిలికాన్ బెల్ట్ కూడా ఉంది. ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 2,599, చైన్ స్ట్రాప్ ధర రూ. 2,899కు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ ఛానెల్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది.

Read Also : WhatsApp Status Updates : మీ వాట్సాప్ స్టేటస్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా షేర్ చేసుకోవచ్చు? ఇదేలా పనిచేస్తుందంటే?