WhatsApp Status Updates : మీ వాట్సాప్ స్టేటస్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా షేర్ చేసుకోవచ్చు? ఇదేలా పనిచేస్తుందంటే?

WhatsApp Status Updates : ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో క్రాస్-పోస్టింగ్ చేస్తున్నట్లే.. వినియోగదారులు తమ స్టేటస్ అప్‌డేట్‌లను నేరుగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకునేలా వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది.

WhatsApp Status Updates : మీ వాట్సాప్ స్టేటస్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా షేర్ చేసుకోవచ్చు? ఇదేలా పనిచేస్తుందంటే?

WhatsApp will soon let you share your Status updates on Instagram

WhatsApp Status Updates : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లోని స్టేటస్ అప్‌డేట్‌లను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసేందుకు వినియోగదారులను అనుమతించే కొత్త ఫీచర్‌పై వాట్సాప్ పనిచేస్తోంది. మీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలను ఫేస్‌బుక్ స్టోరీలకు ఎలా షేర్ చేయవచ్చో అదే విధంగా ఈ ఫీచర్ పనిచేస్తుంది. ముఖ్యంగా, ఈ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది.

వాట్సాప్ ఆండ్రాయిడ్ యాప్ బీటా వెర్షన్‌లో కనిపించింది. ప్రస్తుతం, ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో టైమ్‌లైన్ లేదు. కానీ, బీటాలో ఉండటం వల్ల ఇది త్వరలో అందుబాటులోకి వస్తుందని నివేదిక సూచిస్తుంది. ఈ ఫీచర్‌ను (WABetaInfo) గుర్తించింది. రాబోయే ఈ కొత్త ఫీచర్ అన్ని మెటా అప్లికేషన్‌లలో క్రాస్-ప్లాట్‌ఫారమ్‌కు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు.

ఒకే సమయంలో స్టేటస్, స్టోరీ షేర్ చేయొచ్చు :
నివేదిక ప్రకారం.. వాట్సాప్ కొత్త ఫీచర్ వినియోగదారులు తమ వాట్సాప్ స్టేటస్‌ను యాప్ నుంచి నిష్ర్కమించకుండా ఇన్‌స్టాగ్రామ్‌లోనే పోస్ట్ చేసేందుకు అనుమతిస్తుంది. పైన పేర్కొన్న విధంగా, ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ అప్‌లోడ్ చేస్తున్నప్పుడు, ఫేస్‌బుక్‌లో కూడా పోస్ట్ చేసే అవకాశం ఉంది.

Read Also : WhatsApp Feature : వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. ఒరిజినల్ క్వాలిటీతో ఫొటోలు, వీడియోలను పంపుకోవచ్చు!

ఈ ఫీచర్‌తో, వాట్సాప్ వినియోగదారులు తమ వాట్సాప్ స్టేటస్, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని ఒకే ట్యాప్‌లో అంటే.. ఏకకాలంలో అప్‌డేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి, వాట్సాప్ ఇప్పటికే ఫేస్‌బుక్ స్టోరీలకు వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్స్ నేరుగా షేర్ చేయడానికి మెసెంజర్‌లోని యూజర్లను అనుమతిస్తుంది. ఈ ఫీచర్‌తో యూజర్లు త్వరలో వాట్సాప్ స్టేటస్‌ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు ఒకేసారి షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఆటో షేరింగ్ ఆప్షన్ ఎనేబుల్ ఎలా? :
ఇన్‌స్టాగ్రామ్ మాదిరిగానే వాట్సాప్, ఫేస్‌బుక్ క్రాస్-పోస్టింగ్ కోసం ప్రస్తుత సెట్టింగ్‌లు, వాట్సాప్-ఇన్‌స్టాగ్రామ్ పోస్టింగ్‌కు కంట్రోల్ అందించేలా వినియోగదారులకు అవకాశం ఉంటుంది. వినియోగదారులు ఎంచుకుంటే.. వారి వాట్సాప్ స్టేటస్ ఆటోమాటిక్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ అవుతుంది.

WhatsApp will soon let you share your Status updates on Instagram

WhatsApp share Status Instagram

ఈ ఫీచర్‌ని ఎనేబుల్ చేయడానికి యూజర్‌లు ఇన్‌స్టా సెట్టింగ్స్‌కు వెళ్లాలి. ఫేస్‌బుక్-వాట్సాప్ క్రాస్ పోస్టింగ్ మాదిరిగానే ఎనేబుల్ చేసిన తర్వాత కూడా ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఏ స్టేటస్ అప్‌డేట్ వెళ్లాలో నిర్ణయించుకునే నియంత్రణ యూజర్లకు ఉంటుంది. ఏ సమయంలోనైనా, వినియోగదారులు సెట్టింగ్‌ను ఆఫ్ చేసే అవకాశం కూడా ఉంటుంది.

యూజర్ నేమ్ ద్వారా సెర్చింగ్ ఫీచర్ :
అంతేకాదు.. వాట్సాప్ మరో ఆసక్తికరమైన ఫీచర్‌పై పనిచేస్తోంది. వినియోగదారులను యూజర్ నేమ్ ద్వారా కాంటాక్టు లేదా మెసేజ్‌లను సెర్చ్ చేసేందుకు అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా తమ ఫోన్ నంబర్‌లను షేర్ చేయకూడదని ఎంచుకునే వారికి ప్రైవసీపరంగా ఆప్షన్ అందిస్తుంది. యూజర్‌నేమ్‌ను సెటప్ చేయడానికి ఆప్షన్ కూడా అనుమతిస్తుంది. వ్యక్తిగత సమాచారంపై ఎక్కువ కంట్రోల్ కోరుకునే యూజర్లకు ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది.

ముఖ్యంగా, యూజర్ నేమ్ ఎంచుకోవడం పూర్తిగా స్వచ్ఛందంగా ఉంటుంది. వినియోగదారులు ఈ అదనపు యాక్టివిటీని ఉపయోగించాలనుకుంటున్నారో లేదో నిర్ణయించుకునే ఆప్షన్ కలిగి ఉంటారు. నివేదిక ప్రకారం..వినియోగదారులు ఈ ఫీచర్‌పై పూర్తి ఆటోకంట్రోల్ కలిగి ఉంటారు. వారు ఎంచుకున్నప్పుడల్లా వారి యూజర్ నేమ్ యాడ్ చేయడం, తీసివేయడం లేదా ఎడిట్ చేయడం వంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.

అంతేకాదు.. వారి ప్రాధాన్యతలు, అవసరాలకు అనుగుణంగా వారి ప్రైవసీ సెట్టింగ్‌లను కస్టమైజ్ చేసుకునే వీలుంది. అలాగే, సెర్చ్ బాక్స్ కోసం యూజర్ నేమ్ సెర్చ్ యాక్టివిటీ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. వాట్సాప్ కొత్త ఫీచర్ రాబోయే అప్‌డేట్ రానుందని భావిస్తున్నారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ లేదా రెండింటిలోనూ ఈ ఫీచర్ అందుబాటులోకి రావచ్చు.

Read Also : Selling Smartphone Tips : మీ పాత ఆండ్రాయిడ్ ఫోన్ విక్రయిస్తున్నారా? ఈ 10 విషయాలను తప్పక పూర్తి చేయండి..!