Toyota Fortuner: కారులో టాయ్‌లెట్, అబ్బో.. అద్భుతమైన ఫీచర్
మోడల్ చేసేందుకు ఫార్చునర్‌లనే ఎక్కువగా ఛాయీస్ తీసుకునేది అందుకే.. ఫోర్డ్ ఎండేవర్, ఎంజీ గ్లోస్టర్ లాంటి కార్లతో పోటీపడగల సత్తా ఫార్చునర్‌ది. రీసెంట్ గా ఓ వ్యక్తి ఫార్చునర్ లో టాయ్‌లెట్ అరేంజ్ చేసుకున్నాడు.

Fortuner
Toyota Fortuner: టయోటా ఫార్చునర్ ఇండియాలో ట్రెండింగ్ లో ఉన్న ఎస్‌యూవీ. చాలా కాలంగా మార్కెట్ లో పాతుకుపోయిన మోడల్. ఇన్నోవా, ఇన్నోవా క్రిస్టాల్లాగే ఫార్చునర్ అంటే అంతగా ఇష్టపడతారు. తక్కువ కాస్ట్ మెయింటైనెన్స్.. ఎలాంటి రోడ్లపైనైనా అనుకూలమైన ప్రయాణం చేయగల నైపుణ్యం సొంతం. అందుకే ఇన్నేళ్లుగా మార్కెట్లో ఉంటుంది ఫార్చునర్.
రీ మోడల్ చేసేందుకు ఫార్చునర్‌లనే ఎక్కువగా ఛాయీస్ తీసుకునేది అందుకే.. ఫోర్డ్ ఎండేవర్, ఎంజీ గ్లోస్టర్ లాంటి కార్లతో పోటీపడగల సత్తా ఫార్చునర్‌ది. రీసెంట్ గా ఓ వ్యక్తి ఫార్చునర్ లో టాయ్‌లెట్ అరేంజ్ చేసుకున్నాడు. ఈ వీడియో యూట్యూబ్ లో అప్ లోడ్ చేసి మరీ దాని స్పెషాలిటీని పంచుకున్నాడు.
రోడ్ ట్రిప్ లు వెళ్లినప్పుడు లేదా.. పబ్లిక్ టాయ్ లెట్ దొరకనప్పుడు ఇది బాగా యూజ్ అవుతుందని చెప్పుకొచ్చాడు. క్యారవాన్స్ కు మాడిఫై చేసి ఓజెస్ గ్యారేజ్ లో దీని పని చేయించారు. బయట నుంచి దీనికి ఎటువంటి మార్పులు చేయకపోగా.. కేవలం టైర్లను మాత్రమే మార్చారు.
ఆ వీడియోలో ఎస్‌యూవీలోనే టాయ్‌లెట్ నిర్మాణం చేసిందంతా ఉంది. ముందు రెండు వరుసలు మామూలుగానే ఉంచి వెనుక వైపు మాత్రం టాయ్ లెట్ కమోడ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇదంతా చేయడానికి అయిన ఖర్చును మాత్రం చెప్పలేదు.
టయోటా పార్చునర్ ఎస్‌యూవీ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. డీజిల్ ఇంజిన్ ఎక్కువ శక్తితో పాటు టార్క్ ను కూడా జనరేట్ చేయగలదు.