Meta Threads New App : ఎలాన్ మస్క్‌ ట్విట్టర్‌ను ఢీ కొట్టేందుకు ‘థ్రెడ్’ రెడీ అవుతున్న జుకర్ బర్గ్

ట్విట్టర్ కు పోటీగా ‘థ్రెడ్’తో ఢీకొట్టటానికి రెడీ అవుతున్నారు ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్. మెటా తాజాగా ‘థ్రెడ్’ను ప్రవేశపెడుతోంది. ఇది ట్విట్టర్ కు మించి అని చెబుతోంది.

Meta thred App

Elon Musk Twitter- Meta threads App Mark Zuckerberg : సోషల్ మీడియాలో వస్తున్న పెను మార్పులకు తగినట్లుగానే జనాలు ఫాలో అయిపోతున్నారు. ఒకప్పుడు ఫేస్ బుక్ (Face Book) హవా నడిచింది. ఆ తరువాత దాన్ని ట్విట్టర్ (Twitter)డామినేట్ చేసింది. ఒక్క ట్వీట్ స్టాక్ మార్కెట్ (Stock market)ప్రపంచాన్నే తల్లికిందులు చేసిన ఘటనలున్నాయి. ఒక్క ట్వీట్ (Tweet)తో యావత్ ప్రపంచాన్ని షేక్ చేసిన ఘటనలు ఉన్నాయి. అలా ప్రస్తుతం ట్విట్టర్ హవా నడుస్తోంది. అటువంటి ట్విట్టర్ (Twitter)కు ధీటుగా మరొకటి రానుంది. దీంతో ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk)ట్విట్టర్ కు పోటీగా ‘థ్రెడ్’ (thread)తో ఢీకొట్టటానికి రెడీ అవుతున్నారు ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ (Mark Zuckerberg). ట్విట్టర్ ను మించి అన్నట్లుగా ‘థ్రెడ్’ (thred)అనే యాప్ తో వస్తున్నారు జుకర్ బర్గ్. మెటా (Meta)తాజాగా థ్రెడ్స్ (thred App) అనే యాపత్ ను రెడీ చేసింది. యాపిల్ (Apple) కు చెందిన యాప్ స్టోర్ (App Store)లో ఇది కనిపిస్తోంది. ట్విట్టర్ వలెనే దీంట్లో కూడా టెక్ట్స్ మెసేజ్ (text messages)లను లైక్ (Like) చేయవచ్చు.

Jio 4G Prepaid Plans : రిలయన్స్ జియో కొత్త 4G ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. ఏ ప్లాన్ ధర ఎంత? వ్యాలిడిటీ పూర్తి వివరాలు మీకోసం..!

కాగా..మైక్రో బ్లాగింగ్ (Micro blogging) లో ఇప్పటి వరకు ట్విట్టర్ (Twitter)ను ఏదీ ఢీ కొట్టలేకపోయాయనే చెప్పాలి. అటువంటి ట్విట్టర్ ను సొంతం చేసుకున్న మస్క్ కు ఈ ‘థ్రెడ్’కు పోటీ కానున్నట్లుగా తెలుస్తోంది. ట్విట్టర్ కు పోటీగా బ్లూ స్కై(blue sky app), మాప్టోడాన్ (Maptodon)వంటివి ఉన్నా ట్విట్టర్ ను బీట్ చేయలేకపోయాయి. కనీసం దాని దరిదాపులకు కూడా రాలేకపోయాయనే చెప్పాలి. కానీ ఎప్పటికప్పుడు టెక్నాలజీ డెవలప్ మెంట్ తో ఒకప్పుడు హావా సాగించినవి వాటికి మించినవి రావటం జరుగుతోంది. దీంట్లో భాగంగానే ట్విట్టర్ కు ధీటుగా పోటీగా తాజాగా మరో కొత్త మైక్రో బ్లాగింగ్ యాప్ వస్తోంది. అదే ‘థ్రెడ్’..

ఫేస్ బుక్ (Facebook), వాట్సాప్ (WhatsApp)వంటి మోస్ట్ యూజబుల్, ఫేమస్ యాప్ లను రన్ చేస్తున్న మెటా తాజాగా ‘థ్రెడ్’ను ప్రవేశపెడుతోంది. ఇది ట్విట్టర్ కు మించి అని చెబుతోంది. ట్విట్టర్ ఇప్పుడు ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. సెలబ్రిటీలే కాదు సామాన్యులు కూడా ట్వీట్ లతో రచ్చ చేస్తున్నారు.

ఈక్రమంలో ట్విట్టర్ ఎలన్ మస్క్ చేతికొచ్చాక ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. యూజర్ల ట్వీట్ల మీద ఆంక్షలు, బ్లూటిక్స్ పై నిబంధనలు వంటివాటితో యూజర్లు కాస్త విసుగు చెందారు. దీంతో ట్విట్టర్ ను వదిలేసి మిగతా యాప్ ను యూజ్ చేయటానికి ఆసక్తి చూపుతున్నారు. ఇదే సమయంలో ట్విట్టర్ కు ధీటుగా..ఈ అవకాశాన్ని ‘థ్రెడ్’ ను ఉపయోగించాలనుకుంటున్నారు జుకర్ బర్గ్. అది కూడా మెటా సంస్థ నుంచి. థ్రెడ్ పేరుతో విడుదల అవనున్న ఈ యాప్ ట్విట్టర్ కు గట్టి పోటీనే ఇస్తుందని టాక్ వినిపిస్తోంది నిపుణుల నుంచి.

Amazon Prime Membership Plans : జూలై 15 నుంచే ప్రైమ్ డే సేల్.. 50 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ప్లాన్లు.. డోంట్ మిస్..!

కాగా ఈ థ్రెడ్ యాప్ లో ట్విట్టర్ వలెనే టెక్ట్స్ మెసేజీలకు లైక్ చేసే వీలుంది. అంతేకాదు షేర్, కామెంట్ కూడా చేయవచ్చని యాప్ స్టోర్ లిస్టింగ్ లోని స్క్రీన్ షాట్ ను చూస్తే తెలుస్తోంది. ఈ థ్రెడ్ అతి త్వరలో ఇంకా చెప్పాలంటే రెండు మూడు రోజుల్లోనే ఈ విషయాన్ని మెటా అధికారికంగా ప్రకటించనున్నట్లుగా సమాచారం. ఇది ఇన్ స్టాకు లింక్ అయి ఉన్న ‘టెక్ట్స్ బేస్ట్ కన్వర్జేషన్ యాప్’. ట్రెండింగ్ లో ఉండే అన్ని విషయాల వరకు డిస్కస్ చేసుకునే గ్రూపుల కోసమే ఈ ‘థ్రెడ్’ అని మోటా వెల్లడించింది. ట్విట్టర్ లో మస్క్ చేసిన మార్పుల నేపథ్యంలో మెటా ‘థ్రెడ్’ను అందుబాటులోకి తేవటం గమనించాల్సిన విషయం. ఎందుకంటే ట్విట్టర్ మార్పులు.. ఆంక్షలతో యూజర్ల అసహనాన్ని ‘థ్రెడ్’ ద్వారా ఆకట్టుకునేందుకు మెటా రెడీ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు